చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై ఐఐటీ క్యాపంస్ లో డెంగ్యూ జ్వరం: విశాఖపట్టణం విద్యార్థి బలి, పిట్టాల్లా రాలిపోతన్నారు !

తమిళనాడులో డెంగ్యూ జ్వరంతో విశాఖపట్టణంకు చెందిన యువకుడు మృతి చెందాడు. మద్రాసు ( చెన్నై) ఐఐటీలో విద్యాభ్యాసం చేస్తున్న విశాఖపట్టణంకు చెందిన ప్రేమ్ అవినాష్ (21) అనే యువకుడు డెంగ్యూ జ్వరంతో చికిత్స

|
Google Oneindia TeluguNews

వైజాగ్/ చెన్నై: తమిళనాడులో డెంగ్యూ జ్వరంతో విశాఖపట్టణంకు చెందిన యువకుడు మృతి చెందాడు. మద్రాసు ( చెన్నై) ఐఐటీలో విద్యాభ్యాసం చేస్తున్న విశాఖపట్టణంకు చెందిన ప్రేమ్ అవినాష్ (21) అనే యువకుడు డెంగ్యూ జ్వరంతో చికిత్స విఫలమై మరణించాడు.

చెన్నై ఐఐటీలో ప్రేమ్ అవినాష్ విద్యాభ్యాసం చేస్తున్నాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ప్రేమ్ అవినాష్ ను ఐఐటీ క్యాంపస్ లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేశారు. చికిత్స నయం కాకపోవడంతో ప్రేమ్ అవినాష్ ను వేలచ్చేరీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

IIT Madras student dies dengue at Chennai Apollo hospital

అపోలో ఆసుపత్రిలో చికిత్స విఫలమై ప్రేమ్ అవినాష్ మరణించాడు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో బాలసమోహం భార్య ప్రియా అనే మహిళ డెంగ్యూ జర్వంతో మరణించింది. సేలం జిల్లాలో కవితా అనే మహిళ డెంగ్యూ జ్వరంతో మరణించింది. దిండుగల్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు డెంగ్యూ జ్వరంతో మరణించారు. తమిళనాడులో డెంగ్యూ జ్వరంతో చాల మంది బాధపడుతున్నా ప్రభుత్వం, వైద్య శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

English summary
An IIT Madras student succumbed to dengue in the early hours of Friday at Apollo hospital, where he was undergoing treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X