వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఐటీ మద్రాస్ విద్యార్థిని ఆత్మహత్య, మొబైల్ లో సూసైడ్ నోట్, ఉత్తరాధి ప్రొఫెసర్లు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కేరళ రాష్ట్రంలోని కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ (19) చెన్నై ఐఐటీలో ఆత్మహత్య చేసుకున్న కేసు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెన్నై నగర పోలీసులు తెలిపారు. చెన్నై ఐఐటీలో గత ఆగస్టులో చేరిన ఫాతిమా లతీఫ్ మూడు నెలల్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేపింది. తన కుమార్తె ఫాతిమా లతీఫ్ ఆత్మహత్యకు ముగ్గురు ప్రొఫెసర్లు కారణం అని, వారీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు డీజీపీ త్రిపాఠీలకు ఫిర్యాదు చేశారు.
చెన్నై ఐఐటీ కాలేజ్ లో చేరిన మూడు నెలలకే ఫాతిమా లతీఫ్ హాస్టల్ గదిలో ఈనెల 9వ తేదీన ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!

మొబైల్ లో సూసైడ్ నోట్

మొబైల్ లో సూసైడ్ నోట్

ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య చేసుకునే ముందు మొబైల్ లో సూసైడ్ నోట్ మాకు పంపించిందని ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ ఆరోపించారు. ఫాతిమా మొబైల్ లోని సూసైడ్ నోట్ లో ఉమా, చక్కు, వప్పిచ, తుంపు అనే పేర్లు ఉన్నాయని, వారే ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అబ్దుల్ లతీఫ్ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలకు మనవి చేశారు.

సెల్ ఫోన్ లో వివరాలు !

సెల్ ఫోన్ లో వివరాలు !

తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలను కలిసిన తరువాత ఫాతిమా లతీఫ్ తండ్రి అబ్దుల్ లతీఫ్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. తన ఆత్మహత్యకు కారణం ముగ్గురు ప్రొఫెసర్లు అని తన కుమార్తె ఫాతిమా లతీఫ్ సెల్ ఫోన్ లో నమోదు చేసిందని అబ్దుల్ లతీఫ్ అన్నారు.

కఠిన చర్యలు

కఠిన చర్యలు

తన కుమార్తె ఫాతిమా లతీఫ్ ఆరోపించిన ప్రొఫెసర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలకు తాను మనవి చేశానని, తప్పకుండా న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారని అబ్దుల్ లతీఫ్ మీడియాకు చెప్పారు.

డీఎంకే ఆందోళన

డీఎంకే ఆందోళన

మరో వైపు ఫాతీమా లతీఫ్ ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్లను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ డీఎంకే పార్టీ అధ్వర్యంలో చెన్నై ఐఐటీని ముట్టడించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు, డీఎంకే పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజకీయం చేస్తారా: బీజేపీ

రాజకీయం చేస్తారా: బీజేపీ

ఫాతిమా లతీఫ్ ఆత్మహత్మను రాజకీయం చెయ్యడానికి డీఎంకే ప్రయత్నిస్తోందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి వాసతి శ్రీనివాసన్ విమర్శించారు. ఫాతిమా ఆత్మహత్య తమను భాదించిందని, అయితే ఆమె ఆత్మహత్యను రాజకీయం చెయ్యడం ఎంత వరకు న్యాయమని వాసతి శ్రీనివాసన్ ప్రశ్నిస్తున్నారు.

చెన్నై ఐఐటీలో 9 మంది ఆత్మహత్య

చెన్నై ఐఐటీలో 9 మంది ఆత్మహత్య

చెన్నై ఐఐటీలో ఇప్పటి వరకూ 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు దక్షిణాధి రాష్ట్రాల విద్యార్థులను చిన్న చూపు చూస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెన్నై ఐఐటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

English summary
Chennai: A brilliant young student. A suicide note on a cellphone. A family suspecting foul play. Here's all you need to know about the death of Fathima Lateef, a student of IIT Madras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X