వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త:ఐఐటీ పీజీ విద్యార్థులకు బంపర్ ఆఫర్లిస్తున్న కంపెనీలు, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఐఐటీ పీజీ స్టూడెంట్లకు ఈ ఏడాది భారీ డిమాండ్ ఏర్పడింది. టెక్నాలజీ రంగంలో చోటు చేసుకొన్న మార్పలు కారణంగా ఈ డిమాండ్ ఏర్పడినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐఐటీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల విషయంలో ఈ ఏడాది గతంతో పోలిస్తే మంచి డిమాండ్ నెలకొందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులకు భారీ వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ కంపెనీలు ఉద్యోగాలను ఇస్తున్నాయి.

ఢిల్లీ, చెన్నై ఐఐటీ క్యాంపస్‌లలో గత మాసంలో భారీ వేతనాలను ఆఫర్ చేస్తూ పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. దిగ్గజ టెక్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లను నిర్వహించాయి.ఆపిల్ లాంటి కంపెనీలు కూడ క్యాంపస్ రిక్రూట్ మెంట్లతో ఉద్యోగావకాశాలను కల్పించాయి.

ఐఐటీ పీజీ స్టూడెంట్స్‌కు భారీ వేతనాలు

ఐఐటీ పీజీ స్టూడెంట్స్‌కు భారీ వేతనాలు

ఐఐటీ పీజీ స్టూడెంట్లకు ఈ ఏడాది భారీ డిమాండ్‌ నెలకొంది. టెక్నాలజీ రంగంలో చోటు చేసుకొన్న మార్పుల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి నూతన టెక్నాలజీల్లో వివిధ స్ధాయిల్లో పనిచేసేందుకు కంపెనీలు ఐఐటీల వైపు దృష్టి సారించాయని నిపుణులు చెబుతున్నారు.

టెక్కీలకు షాక్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగ సంఘాల ఏర్పాటు నిర్ణయం వెనక్కు టెక్కీలకు షాక్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగ సంఘాల ఏర్పాటు నిర్ణయం వెనక్కు

పీజీ స్టూడెంట్స్‌కు 90 శాతం ఆఫర్స్ పెరుగుదల

పీజీ స్టూడెంట్స్‌కు 90 శాతం ఆఫర్స్ పెరుగుదల

ఈ ఏడాది గతంతో పోలిస్తే ఐఐటీలో పీజీ విద్యార్థులకు 90 శాతం ఆఫర్లు పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దేశంలోని చెన్నై, కాన్పూర్‌, రూర్కీ ఐఐటీలల్లో కేవలం 30 శాతం ఆఫర్లు దక్కాయి. అయితే ఇతర ప్రముఖ ఐఐటీల్లో మాత్రం సుమారు 90 శాతం ఆఫర్లు దక్కాయని చెబుతున్నారు.గాంధీనర్ ఐఐటీలో గత ఏడాదితో పోలిస్తే రెండున్నర రెట్లు అధిక వేతనంతో విద్యార్థులకు ఆఫర్లు దక్కాయి.

మారిన పరిస్థితులు

మారిన పరిస్థితులు

క్యాంపస్ రిక్రూట్ మెంట్లలో ఎక్కువగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఎంపిక చేస్తారు. అయితే మారిన పరిస్థితుల కారణంగా పీజీ విద్యార్థుల వైపు కంపెనీలు చూస్తున్నాయి.అయితే టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, వ్యాపార ధోరణుల్లో మారిన వైఖరులతో ఈసారి పీజీ విద్యార్ధులను పెద్దసంఖ్యలో భారీ ప్యాకేజ్‌లతో జాబ్‌ ఆఫర్లు వెల్లువెత్తాయి.

సాంకేతిక బృందాలను పట్టిష్టం చేసుకోవడానికి

సాంకేతిక బృందాలను పట్టిష్టం చేసుకోవడానికి

కంపెనీలు టెక్నాలజీ టీమ్‌లను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి.ఈ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ కారణంగానే ఐఐటీ పీజీ విద్యార్థులపై కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

English summary
Postgraduate students at India's premier engineering colleges are in higher demand this year, as companies look to hire talent with stronger domain knowledge for roles in emerging technologies such as artificial intelligence, robotics and machine learning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X