microsoft iit kharagpur west bengal job technology education మైక్రోసాఫ్ట్ ఐఐటి పశ్చిమబెంగాల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ విద్య
ఐఐటి టాపర్: మైక్రోసాఫ్ట్ ఉద్యోగం ఇచ్చినా వద్దన్నాడు
కోల్‌కతా: ఇంజినీరింగ్ పూర్తికాగానే సాధారణంగా అందరు విద్యార్థులు బహుళ జాతి ఐటీ కంపెనీల్లో పెద్ద ఉద్యోగాల్లో చేరాలని కలలు కంటారు. అయితే ఐఐటి టాపర్ అయిన శిఖర్ పత్రనబిస్ మాత్రం ఈ కోవకు చెందినవాడు కాడు.
మైక్రోసాఫ్ట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చినా చేరేదిలేదు. ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివిన శిఖర్‌కు పరీక్షా ఫలితాలు రాకముందే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అతనికి మైక్రోసాఫ్ట్ లక్షల జీతంతో జాబ్ ఆఫర్ ఇచ్చింది.

అయితే ఆ ఉద్యోగం అక్కర్లేదని శిఖర్ చెప్పాడు. ఉద్యోగం కంటే తనకు రీసెర్చి చేయడమే చాలా ఇష్టమని స్పష్టం చేశాడు. ఇదే ఐఐటీలో పీహెచ్‌డీ చేసి అకడమీషియన్‌గా ఉంటాన తెలిపాడు.
తనకు బోధనారంగంలో స్థిరపడాలన్న అభిలాష కూడా ఉందన్నాడు. టాప్ ర్యాంకర్లలో ఒకడైన అనిర్బన్ సంతారా అనే మరో విద్యార్థి కూడా ఇలాగే రీసెర్చి వైపు మొగ్గుచూపుతుండటం గమనార్హం.