వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినూత్నం: ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్ధి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఉద్యోగం కోసం బయోడేటాను తయారు చేయడం బోరింగ్‌గా ఉంటుంది. అంతేకాదు ఆ బయేడేటాతో పాటు అర్హత పత్రాలను ఉద్యోగార్దులు చేతపట్టుకుని కంపనీల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఐఐటీ విద్యార్ధి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు.

దీంతో ఇప్పుడతను అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన అతను.. అదే వెబ్‌సైట్‌లోనే తనని తాను అమ్మకానికి ఉన్నానంటూ రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేశాడు.

IITian looking for a job ‘sells himself’ on Flipkart

వివరాల్లోకి వెళితే... ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చదువుతున్న ఆకాశ్ నీరజ్ మిట్టల్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. వెబ్‌సైట్‌లో తనని తాను అమ్మకానికి ఉంచినట్లు ప్రొపైల్‌తో పాటు పూర్తి వివరాలను పొందుపరిచాడు. అంతేకాదు తనకు ఇచ్చే వేతనాన్ని కూడా ఫిక్స్ చేశాడు.

రూ. 27,60,200గా తన ధరను నిర్ణయించుకున్న నీరజ్ మిట్టల్.. ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్‌ను కూడా ప్రకటించాడు. భారత్‌లోని మేధావులతో పోటీ పడినప్పుడు, మిగతావారితో పోల్చినప్పుడుఏదైనా కొత్తగా చేయాలని మిట్టల్ భావించాడని అతని జూనియర్ బజాజ్ తెలిపాడు.

ఎంతో కొత్తగా ఆలోచించిన మిట్టల్‌కు ఫ్లిప్‌కార్ట్ స్వాగతం పలుకుతుందని అతని సన్నిహితులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎటువంటి ఇంటర్యూ కాల్ మిట్టల్‌కు రాకపోవడం విశేషం.

English summary
Making a CV is probably the most boring part of the applying for a job, but a necessary evil nevertheless, but even that can become a fun task if you have the creative flair. That's exactly what happened when an IIT Kharagpur student recently applied for a product management vacancy at Indian e-commerce Flipkart.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X