వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ikikai: డిజైన్ల ద్వారా సామాజిక స్పృహను మేల్కొలుపుతున్న సంస్థ

|
Google Oneindia TeluguNews

వేడీ వేడిగా కప్పు కాఫీ తాగుతూ ఏదో చర్చించుకుంటున్న మిత్ర బృందానిక ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. డిజైన్ల ద్వారా సామాజిక స్పృహ కల్పించాలన్న కొత్త ఆలోచన వారికి కలిగింది. ఈ డిజైన్ల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్న ఆర్టిస్ట్‌లకు చక్కటి అవకాశం ఇవ్వడం ద్వారా వారిని విజయతీరాలకు చేర్చాలని ఆలోచించారు. ఇక చిరు వ్యాపారాలు చేసే మహిళలు లేదా సామాజిక సంస్థలు లేదా ఎన్జీఓల బలోపేతానికి సహకరించాలన్న ఆలోచన చేశారు. ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఇకికాయ్.

ఇకికాయ్ అనే పేరు పై హమ్మింగ్ బర్డ్ లేదా తేనె పిట్ట ఉంటుంది. జపాన్ భాష నుంచి "ఇకి" అనే పదాన్ని తీసుకున్నారు. ఇకి అనే పదానికి అర్థం సౌదర్యం. "కాయ్" అంటే పునరుద్ధరణ అని అర్థం. ఇక ప్రత్యేకత, అందం, పరిస్థితులను వేగవంతంగా ఆవగింపు చేసుకోవడాన్ని సూచిస్తుంది హమ్మింగ్ బర్డ్.ఇకికాయ్ అనే ఈ సంస్థ ఈ పునాదుల పై నుంచే పుట్టుకొచ్చింది.

ఈ రోజుల్లో మీరు చేస్తున్న కొనుగోళ్లు మీరెలాంటి వారు, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో, మీరు ఎలాంటి వాటిని విశ్వసిస్తారో చెప్పకనే చెబుతాయి. అదే మాదిరిగా ఆలోచనలను ఆచరణలో పెట్టడమే ఇకికాయ్‌ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే ఇకికాయ్ నుంచి వచ్చే డిజైన్లు సామాజిక మరియు పర్యావరణ స్పృహతో కూడిన జీవన శైలి గురించి వివరిస్తాయి. ఇకికాయ్ సంస్థ నుంచి పలు వైవిధ్యమైన డిజైన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణ హితంతో కూడిన డిజైన్లు కచ్చితంగా మంచిని వ్యాప్తి చేసేలా ప్రేరేపిస్తాయి.

Ikikai: Creating social impact through design

ఇకికాయ్ సంస్థను ఇషా, క్షీరా, పరాగ్‌ అనే ముగ్గురు అనుభవజ్ఞులైన నిపుణుల ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. సానుకూల మార్పును సమీకరించాలన్న ఉద్దేశంతో ఇకికాయ్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు ఈ సంస్థ వ్యవస్థాపకులు. డిజైన్ల ద్వారా మంచిని వ్యాప్తి చేయడం కచ్చితంగా ప్రతి ఒక్కరి మనస్సును తాకుతుందని, కదిలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిని వ్యాప్తి చేసేందుకు చాలామంది కదిలి వస్తున్నారని చెప్పారు. మంచిన వ్యాప్తి చేయడంలో సౌందర్యం అనేది ఒక ఆయుధంగా లేదా మార్గంగా మలుచుకుంటామని చెప్పారు.

నేటి వినియోగదారులు రేపటి భవిష్యత్తు కోసం మంచి ఆలోచనతో ముందడుగు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.తద్వారా మంచి సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారన్న విశ్వాసం తమకుందని వెల్లడించారు. ఇకికాయ్ వెబ్‌సైట్ పై మహిళలకు, పిల్లలకు దుస్తులు, వ్యక్తిగత అలంకరణ వస్తువులు, గృహాలంకరణ, కళాకృతులు, డిజైనర్ వేర్స్, గిఫ్ట్స్, హ్యాండ్‌లూమ్స్‌.. ఇలా ఒకటేంటి లెక్కకు మించి వస్తువులను కొనుగోలు చేయొచ్చు. వినియోగదారులు ఇచ్చే డబ్బులో కొంత నేరుగా సామాజిక సేవలకు వినియోగిస్తారు. సామాజిక సేవలో ప్రయాణం చేయాలనుకునేవారికి ఇకికాయ్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని చెప్పారు. మంచి చేద్దాం అనుకునేవారు కచ్చితంగా తమ వెబ్‌సైట్‌ www.ikikai.coను సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Taking a leaf from the Japanese notebook, ‘Iki’ translates to ‘aesthetics’ while ‘Kai’ represents ‘restoration’ or ‘recovery’ and the hummingbird that symbolises uniqueness, beauty, and swiftness to adapt: ikikai is cut from a similar cloth and spirit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X