వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. చట్ట రూపం దాల్చిన మరుసటి రోజే ఘటన

|
Google Oneindia TeluguNews

లక్నో : దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే తలాక్ చెప్పాడో భర్త. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోవడంతో తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. అదీ కూడా రోడ్డు మీద తనకు భార్యతో ఏ సంబంధం లేదని తేల్చిచెప్పి వెళ్లిపోవడం కలకలం సృష్టిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మధురాలో ఈ ఘటన జరిగింది.

ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లిం భర్తలపై ఉక్కుపాదం మోపే చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజముద్ర కూడా వేశారు. ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే యూపీలో ఓ భర్త తలాక్ చెప్పాడు.

ikram says his wife triple talaq

మధురాకు చెందిన జమిరాత్ అనే మహిళను మేవాత్‌కు చెందిన ఇక్రమ్ పెళ్లిచేసుకున్నాడు. అయితే వీరికి పెళ్లి సమయంలో లక్ష రూపాయల కట్నం ఇస్తామని హామీనిచ్చారు. అయితే కట్నం ఇవ్వలేదు. దీంతో ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. కట్నం ఇచ్చేందుకు జమిరాత్ ఫ్యామిలీ నిరాకరించింది. దీంతో ఇక్రమ్ ఆగ్రహానికి గురయ్యాడు. పంచాయతీ పెద్దల ముందే రోడ్డుపైనే జమిరాత్‌కు తలాక్ చెప్పి వెళ్లిపోయాడు.

English summary
The husband who said that the next day that the triple talaq is legal in the country. Talak went away saying he was not given the dowry to pay him. It also creates the possibility that he and his wife had no contact with him on the road
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X