Illegal affair: ఇద్దరు భర్తలు, నెక్ట్స్ ప్రియుడు, ఇంట్లో బిడ్డలను వదిలేసి ? ప్రియుడి చేతిలో ఫినిష్ !
చెన్నై: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని యువతి వివాహం చేసుకుంది. దంపతులకు ఓ పాప పుట్టింది. పాప పుట్టిన కొంతకాలానికి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత ఆమె మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. రెండో భర్తకు ఓ కొడుకు పుట్టాడు. ఇద్దరు బిడ్డలతో పాటు రెండో భర్తతో ఆమె కొంతకాలం గడిపింది. బిడ్డ పుట్టిన తరువాత రెండో భర్త కూడా అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు భర్తలు చనిపోవడంతో ఆమె ఇద్దరు బిడ్డలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉంటున్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. పుట్టింటి సమీపంలోనే ఉంటున్న ప్రియుడితో ఆమె పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న మహిళ ఇద్దరు బి0డ్డలను ఇంట్లో వదలి ప్రియుడితో తిరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఆమె ప్రియుడు చంపేసి చేతులు దులుపుకున్నాడు.
Illegal affair: భర్త మీద మోజు తగ్గి ప్రియుడి మీద మోజు పెరిగింది, అత్తతో కలిసి అల్లుడు, క్లైమాక్స్ !

భర్త చనిపోయాడు
చెంగలపట్టులోని సైంషా (26) అనే యువతి నివాసం ఉంటున్నది. చెన్నైకి చెందిన కన్నన్ అనే వ్యక్తితో కొన్ని సంవత్సరాల క్రితం సైంషా వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు చూపించిన కన్నన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సైంషా కొంతకాలం సంతోషంగా ఉంది. కన్నన్, సైంషా దంపతులకు ఓ పాప పుట్టింది. పాప పుట్టిన కొంతకాలానికి సైంషా భర్త కన్నన్ అనారోగ్యంతో చనిపోయాడు.

రెండో భర్తకు బిడ్డ పుట్టిన తరువాత ?
కన్నన్ చనిపోయిన తరువాత సైంషా చెన్నైలోనే నివాసం ఉంది. ఆ సమయంలో సైంషాకు చాలా మంది పరిచయం అయ్యారు. తరువాత మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సైంషా చెన్నైలోనే అతనితో కాపురం పెట్టింది. రెండో భర్తతో కాపురం చేసిన సైంషాకు ఓ కొడుకు పుట్టాడు. ఇద్దరు బిడ్డలతో పాటు రెండో భర్తతో సైంషా కొంతకాలం గడిపింది. బిడ్డ పుట్టిన తరువాత సైంషా రెండో భర్త కూడా అనారోగ్యంతో చనిపోయాడు.

పుట్టింటి దగ్గర పరిచయం అయిన యువకుడు
ఇద్దరు భర్తలు చనిపోయిన తరువాత ఇద్దరు బిడ్డలతో కలిసి చెన్నైలో కొంతకాలం ఉన్న సైంషాకు కొందరు మగాళ్లతో పరిచయం అయ్యింది, తరువాత కొంతకాలం అక్కడే కాలం గడిపిన సైంషా చెంగలపట్టులోని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఇద్దరు బిడ్డలతో పాటు నివాసం ఉంటున్న సైంషాకు అక్కడ కార్తీక్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

ప్రియుడితో జల్సాలు
కార్తీక్, సైంషాల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. పుట్టింటి సమీపంలోనే ఉంటున్న ప్రియుడు కార్తీక్ తో సైంషా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడు కార్తీక్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న సైంషా ఇద్దరు బిడ్డలను ఇంట్లో తల్లి దగ్గర వదలి ప్రియుడు కార్తీక్ తో కలిసి తిరిగింది.

దుప్పటితో ప్రియురాలిని చంపేసిన ప్రియుడు
సోమవారం సాయంత్రం సైంషా తల్లి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ప్రియుడు కార్తీక్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న సైంషా తరువాత అతనితో ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో ప్రియుడు కార్తీక్ తో సైంషా గొడవపడిందని తెలిసింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో ఇంట్లో బెడ్ రూమ్ లో దుప్పటితో కార్తీక్ అతని ప్రియురాలు సైంషా గొంతు బిగించి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి వెళ్లిన తల్లి చలనం లేకుండా పడి ఉన్న కూతురు సైంషాను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సైంషా ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. ప్రియురాలు సైంషాను హత్య చేసిన ఆమె ప్రియుడు కార్తీక్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.