• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: భార్యను 17 సార్లు కత్తులతో పొడిచి చంపించిన భర్త, కాంట్రాక్టు కిల్లర్స్ తో లక్షలు డీల్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త దగ్గర కొందరు పని చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు భర్త బయట ఎక్కువగా ఉంటున్నాడు. ఇదే సమయంలో దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు మొదలైనాయి. రానురాను దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలోనే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీడియో కాల్ చేస్తున్న భర్త ఆమె భర్త ఎక్కడ ఉన్నాడు అని ట్రేస్ చెయ్యడం మొదలు పెట్టింది.

ఈ విషయంలో దంపతుల మద్య గొడవలు తారాస్థాయికి చేరాయి. భార్యను ఇంట్లో పెట్టి ఇంటి వెనుక తాళం వేసిన భర్త అతని కొడుకు బయటకు పిలుచుకుని వెళ్లాడు. తరువాత భార్యను 17 సార్లు కత్తులతో పొడిచి హత్య చేశారని వెలుగు చూసింది. కేసు విచారణ చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. లక్షల రూపాయలు కిరాయి ఇచ్చిన భర్త కాంట్రాక్టు కిల్లర్స్ అతని భార్యను హత్య చేయించాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Khiladi lady: వీడియో కాల్, బెడ్ రూమ్ రొమాన్స్ వీడి జీవితానే మార్చేసింది, ఆంటీ ఎంట్రీ, క్లైమాక్స్ లో!Khiladi lady: వీడియో కాల్, బెడ్ రూమ్ రొమాన్స్ వీడి జీవితానే మార్చేసింది, ఆంటీ ఎంట్రీ, క్లైమాక్స్ లో!

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

దక్షణి ఢిల్లీలోని (దేశ రాజధాని ఢిల్లీ) మాల్వియా నగర్ లోని షేక్ సరాయ్ ప్రాంతంలో నవీన్ గుల్లాయా అలియాస్ నవీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రీనా అనే మహిళను నవీన్ వివాహం చేసుకున్నాడు. నవీన్, రీనా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు. నవీన్, రీనా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వ్యాపారం చేస్తూ బయట ఎక్కువగా ఉంటున్న భర్త

వ్యాపారం చేస్తూ బయట ఎక్కువగా ఉంటున్న భర్త

వ్యాపారం చేస్తున్న నవీన్ దగ్గర కొందరు పని చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు నవీన్ బయట ఎక్కువగా ఉంటున్నాడు. నవీన్ గతంలో ఇచ్చినంత డబ్బు ఈ మద్యకాలంలో ఇవ్వడం లేదని, ఏదో తేడా వస్తోందని అతని భార్య రీనాకు అనుమానం మొదలైయ్యింది. మొదట్లో ఉన్నంత సంతషంగా తన భర్త నవీన్ తనతో గడపడం లేదని రీనాకు అనుమానం వచ్చింది.

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త

నవీన్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. బయట ప్రియురాలితో ఎంజాయ్ చేసి ఇంటికి వెలుతున్న నవీన్ బెడ్ రూమ్ లో అతని భార్య రీనాను పస్తుల పెట్టడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో నవీన్, రీనా దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు మొదలైనాయి.

 భార్యకు మ్యాటర్ తెలిసిపోయింది

భార్యకు మ్యాటర్ తెలిసిపోయింది

నవీన్ ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడని అతని భార్య రీనాకు తెలిసిపోయింది. రానురాను రీనా, నవీన్ దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలోనే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీడియో కాల్ చేస్తున్న రీనా ఆమె భర్త నవీన్ ఎక్కడ ఉన్నాడు అని ట్రేస్ చెయ్యడం మొదలు పెట్టింది. భార్య రీనా తీరుతో నవీన్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

భార్య చంపేయాలని కాంట్రాక్టు కిల్లర్స్ తో డీల్

భార్య చంపేయాలని కాంట్రాక్టు కిల్లర్స్ తో డీల్

ఈ విషయంలో నవీన్, రీనా దంపతుల మద్య గొడవలు తారాస్థాయికి చేరాయి. రీనాను చంపేయాడానికి ఆమె భర్త నవీన్ కాంట్రాక్టు కిల్లర్స్ ను రంగంలోకి దింపాడు. రాహుల్, సోను అనే ఇద్దరు కాంట్రక్టు కిల్లర్స్ తో డీల్ మాట్లాడిన నవీన్ రూ. 5 లక్షలు ఇచ్చి తన భార్య రీనాను చంపేయాలని చెప్పాడు. కాంట్రాక్టు కిల్లర్స్ సోనా, రాహుల్ తో కలిసి నవీన్ స్కెచ్ వేశాడు.

పక్కాప్లాన్ తో రీనాను చంపేశారు

పక్కాప్లాన్ తో రీనాను చంపేశారు

భార్య రీనాను ఇంట్లో పెట్టి ఇంటి వెనుక తాళం వేసిన నవీన్ అతని కొడుకు పిలుచుకుని బయటకు వెళ్లాడు. తరువాత బార్బర్ షాపులో కొడుకు హెయిర్ కటింగ్ చేయించిన నవీన్ అతని దగ్గర పని చేస్తున్న వ్యక్తిని పిలిచి బైక్ లో తన కొడుకును ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యాలని చెప్పాడు. పని చేస్తున్న వ్యక్తి నవీన్ కొడుకును ఇంటి దగ్గరకు పిలుచుకుని వెళ్లి చూడగా రీనా దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

భార్య హత్య కేసులో మొగుడే కింగ్ పిన్

భార్య హత్య కేసులో మొగుడే కింగ్ పిన్

పని చేస్తున్న వ్యక్తి నవీన్ కు ఫోన్ చేసి నీ భార్యను ఎవరో చంపేశారని చెప్పాడు. నవీన్ వెళ్లి రీనాను ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే రీనా ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి నవీన్ ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు నవీన్ ఇంటి నుంచి వెలుతున్న విషయం గుర్తించారు. వెంటనే నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి బెండ్ తీశారు. తన భార్య రీనాను తానే కాంట్రాక్టు కిల్లర్స్ రాహుల్, సోనూతో కలిసి హత్య చేయించానని నవీన్ అంగీకరించాడు.

భర్తకు అడ్డుపడుతున్న భార్య

భర్తకు అడ్డుపడుతున్న భార్య

నవీన్ ప్రతిరోజూ అతను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నాడని, ఈ వవిషయం రీనాకు తెలిసిపోవడంతో ఆమెను హత్య చేయించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నవీన్ తో పాటు కాంట్రాక్టు కిల్లర్స్ సోనూ, రాహుల్ ను అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

నవీన్ చాలా కాలం నుంచి వివాహిత మహితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం అతని భార్య రీనాతో పాటు కుటుంబ సభ్యులకు అందరికీ తెలుసని, ఈ విషయంలో పెద్దలు ఎంత నచ్చ చెప్పినా అతను పద్దతి మార్చుకోలేదని తెలిసింది. భార్య హత్య కేసులో నవీన్ అరెస్టు కావడంతో అతని ప్రియులు మాయం అయిపోయిందని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Illegal affair: A woman was stabbed around 17 times by killers hired by her husband in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X