• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: ముగ్గురు భార్యలు, కాంట్రాక్టర్ తో మూడో భార్య మస్త్ మజా, బెడ్ రూమ్ లో స్పాట్ లో !

|

నోయిడా/ చెన్నై: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లో చొరబడిన వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. బంగ్లాదేశ్ లో ఉన్న సమయంలో ఓ మహిళను వివాహం చేసుకున్న అతను అక్కడే భార్యను పెట్టి తరువాత భారత్ కు వచ్చాడు. పశ్చిమ బెంగాల్ లో కొన్ని సంవత్సరాలు నివాసం ఉన్న అతను అక్కడ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. తరువాత ఉత్తరప్రదేశ్ లో మకాం వేసి అక్కడ మరో వివాహం చేసుకున్నాడు. ఇలా ముగ్గురు భార్యలతో ఎంజాయ్ చేసిన వ్యక్తి ఓ ఫేమస్ కాంట్రాక్టర్ దగ్గర పని చేసుకుంటూ జీవనం సాగించాడు. రెండో భార్య దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేసిన అతను తరువాత మూడో భార్య ఇంటికి వెళ్లాడు. భర్త పని చేస్తున్న కాంట్రాక్టర్ తో అతని మూడో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త రెండు నెలలు ఇంటికి రాడని తెలసుకున్న భార్య కాంట్రాక్టర్ ఇంటిలోనే మకాం వేసింది. భర్త ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతని మూడో భార్య, కాంట్రాక్టర్ బెడ్ రూమ్ లో అతనికి అడ్డంగా చిక్కిపోయాడు. స్పాట్ లోనే కాంట్రాక్టర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను దారుణంగా చంపేసిన భర్త బంగ్లాదేశ్ కు పారిపోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఇక్కడే ఉంటున్న నిందితుడు రెండు నకిలీ ఆదార్ కార్డులతో పాటు పాస్ పోర్టు కూడా తీసుకున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Torture: బెడ్ రూమ్ లో భార్య, అదే ఇంట్లో ఉరి వేసుకున్న భర్త, బంధువు టార్చర్, వెంటపడి వదల్లేదని !Torture: బెడ్ రూమ్ లో భార్య, అదే ఇంట్లో ఉరి వేసుకున్న భర్త, బంధువు టార్చర్, వెంటపడి వదల్లేదని !

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పొటుగాడు

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పొటుగాడు

బంగ్లాదేశ్ కు చెందిన బాబుల్ మియాన్ అనే వ్యక్తి సుమారు 10 సంవత్సరాల క్రితం అక్రమంగా భారత్ లోకి వచ్చాడు. బంగ్లాదేశ్ లో ఉన్న సమయంలోనే బాబుల్ మియాన్ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అక్కడే కొంత కాలం భార్యతో కాపురం చేసిన బాబుల్ మియాన్ తరువాత అక్రమంగా పశ్చిమ బెంగాల్ లోకి చొరబడ్డాడు.

కుచ్ బెహార్ లో రెండో భార్య

కుచ్ బెహార్ లో రెండో భార్య

పశ్చిమ బెంగాల్ లోకి వచ్చిన కుచ్ బాబుల్ మియాన్ అక్కడ కొంతకాలం ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ లో కొన్ని సంవత్సరాల క్రితం బాబుల్ మియాన్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కుచ్ బెహర్ జిల్లాలోనే బాబుల్ మియాన్ రెండో భార్య నివాసం ఉంటున్నది. రెండో భార్యతో కాపురం చేస్తున్న సమయంలోనే కొన్ని సార్లు బాబుల్ మియాన్ బంగ్లాదేశ్ వెళ్లి వచ్చాడని తెలిసింది.

నోయిడాలో మూడో భార్య

నోయిడాలో మూడో భార్య

పశ్చిమ బెంగాల్ నుంచి నోయిడా చేరుకున్న బాబుల్ మియాస్ అక్కడ సాజిద్ అనే కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నాడు. నోయిడాలో పని చేస్తున్న బాబుల్ మియాన్ ఫాతిమా బీబీ అనే మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. అందంగా ఉన్న ఫాతిమా బీబీతో కాపురం చేస్తూ కాంట్రాక్టర్ సాజిద్ దగ్గర పని చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటూ అప్పుడప్పుడు పశ్చిమ బెంగాల్ లోని రెండో భార్య దగ్గరకు వెళ్లి వస్తున్నాడు.

రెండో భార్య పిలిచిందని

రెండో భార్య పిలిచిందని


పశ్చిమ బెంగాల్ లో ఉంటున్న రెండో భార్య రమ్మని బలవంతం చెయ్యడంతో జులై నెలలో బాబుల్ మియాన్ అక్కడికి వెళ్లాడు. రెండో భార్య దగ్గర చాలా కాలం ఉన్న బాబుల్ మియాన్ ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఇదే సమయంలో బాబుల్ మియాన్ మూడో భార్య ఫాతిమా బీబీ భర్త పని చేస్తున్న కాంట్రాక్టర్ సాజిద్ తో అక్రమసంబందం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది.

భర్త రెండు నెలలు రాడని ప్రియుడి దగ్గరే మకాం

భర్త రెండు నెలలు రాడని ప్రియుడి దగ్గరే మకాం


తన భర్త బాబుల్ మియాన్ పశ్చిమ బెంగాల్ వెళ్లాడని, రెండు నెలల పాటు ఇంటికి రాడని తెలుసుకున్నఅతని మూడో భార్య ఫాతిమా బీబీ ప్రియుడు సాజిద్ దగ్గర మకాం వేసింది. కాంట్రాక్టర్ సాజిద్ ఇంటిలోనే ఉండిపోయిన ఫాతిమా బీబీ అక్కడే అతనికి కావలసిని వంటలు చేసి పెడుతూ అతనికి స్వర్గం చూపిస్తూ ఉండిపోయింది.

అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన భర్త

అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన భర్త

రెండు నెలల పశ్చిమ బెంగాల్ లో ఉంటానని మూడో భార్య ఫాతిమా బీబీకి చెప్పి వెళ్లిన బాబుల్ మియాన్ ఆగస్టు 4వ తేదీన అనుకోకుండా నోయిడాకు వెళ్లాడు. మూడో భార్య ఫాతిమా బీబీ ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. నీ భార్య కాంట్రాక్టర్ సాజిద్ ఇంటిలోనే మకాం వేసి అక్కడే ఎక్కువగా ఉంటోందని తెలిసిన వ్యక్తి బాబుల్ మియాన్ కు చెప్పాడు.

రెడ్ హ్యాండెడ్ గా ప్రియుడితో చిక్కిన భార్య

రెడ్ హ్యాండెడ్ గా ప్రియుడితో చిక్కిన భార్య

బాబుల్ మియాన్ నేరుగా కాంట్రాక్టర్ సాజిద్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మూడో భార్య ఫాతిమా బీబీ పంజాబీ డ్రెస్ తీసి పక్కన పడేసి కాంట్రాక్టర్ సాజిద్ బెడ్ రూమ్ లో రొమాన్స్ చూస్తూ బాబుల్ మియాన్ కు చిక్కిపోయారు. ఆ సమయంలో అక్కడ బాబుల్ మీయాన్ గొడవ చేశాడు. గొడవ ఎక్కవ కావడంతో కాంట్రాక్టర్ సాజిద్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. తరువాత సహనం కోల్పోయిన భర్త బాబుల్ మియాన్ కిందపడిన మూడో భార్య ఫాతిమా బీబీ పంజాబీ డ్రెస్ వేల్ తీసుకని ఆమెను అదే మంచం మీద పడేసి గొంతు బిగించి చంపేశాడు.

చెక్కేయడానికి చాన్స్ రాలేదు

చెక్కేయడానికి చాన్స్ రాలేదు


మూడో భార్య ఫాతిమా బీబీని హత్య చేసిన బాబుల్ మియాన్ అక్కడి నుంచి రాజస్థాన్ పారిపోయాడు. రాజస్టాన్ లో కొన్ని రోజులు ఉన్న తరువాత బాబుల్ మీయాన్ రైలులో పశ్చిమ బెంగాల్ కు పారిపోయాడు. పశ్చిమ బెంగాల్ లో రెండో భార్య దగ్గర మకాం వేసిన బాబుల్ మియాన్ అక్కడి నుంచి బంగ్లాదేశ్ పారిపోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. బంగ్లాదేశ్ పారిపోవడానికి సాధ్యం కాకపోవడంతో పశ్చిమ బెంగాల్ లోనే కొంతకాలం ఉండిపోయాడు.

    గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
    ఎందుకో వచ్చి అడ్డంగా చిక్కిపోయాడు

    ఎందుకో వచ్చి అడ్డంగా చిక్కిపోయాడు

    పశ్చిమ బెంగాల్ లో తలదాచుకున్న బాబుల్ మియాన్ సెప్టెంబర్ 10వ తేదీన నోయిడాకు వెళ్లాడు. నోయిడా సెక్టార్ 52 మెట్రో స్టేషన్ సమీపంలోని బంధువుల ఇంటిలో బాబుల్ మియాన్ తలదాచుకున్నాడు. పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు మూడో భార్య ఫాతిమా బీబీ హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్న బాబుల్ మియాన్ ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు ఆధార్ కార్డులు, పంజాబ్ నేషనల్ బ్యాంకు డెబిట్ కార్డు, పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

    English summary
    Illegal affair: Bangladeshi man kills his third wife suspecting illegal relationship in Noida.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X