చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: కోడలి అక్రమ సంబంధం, అత్తను చంపి తల లారీలో పార్శిల్, బీఎంటీసీ ఉద్యోగి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గ్రానైట్ లారీలో చిక్కిన మహిళ తల కేసులో బీఎంటీసీ డ్రైవర్ హంతకుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న అత్తను ఆమె కోడలు, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారని విచారణలో వెలుగు చూడటంతో మహిళ కుటుంబ సభ్యులు హడలిపోయారు. హత్యకు గురైన మహిళ కోడలు తప్పించుకోవడంతో ఆమె ప్రియుడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. లారీలో ఫుల్ గా గ్రానైట్ రాయి నింపుకున్న డ్రైవర్ బెంగళూరు మీదుగా బాగల్ కోటే చేరుకున్న లారీ డ్రైవర్ గ్రానైట్ రాయి డెలివరీ ఇవ్వడానికి యజమాని చూపించిన గ్రానైట్ షో రూమ్ గౌడన్ దగ్గరకు వెళ్లాడు. గ్రానైట్ రాయి అన్ లోడ్ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్ బయటపడటంతో మహిళ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

Illegal affair: ఎన్ఆర్ఐ స్వీటీతో ఎంజాయ్, పక్కఊర్లో భార్య, సీఐ రెండు యాంగిల్స్, సీసీటీవీల్లో !Illegal affair: ఎన్ఆర్ఐ స్వీటీతో ఎంజాయ్, పక్కఊర్లో భార్య, సీఐ రెండు యాంగిల్స్, సీసీటీవీల్లో !

 గ్రానైట్ ఫ్యాక్టరి

గ్రానైట్ ఫ్యాక్టరి


తమిళనాడులోని మదురై సమీపంలోని గ్రానైట్ ఫాక్టరీ నుంచి తమిళనాడులో రిజిస్టర్ అయిన టీఎన్-52, ఆర్ 7952 నెంబర్ లారీలో అక్కడి కూలీలు ఫుల్ గా గ్రానైట్ రాయి నింపారు. తరువాత డ్రైవర్ రాజా కల్యాణ సుందరం మదురై హైవే రహదారిలో అక్కడక్కడ నిలుపుకుంటూ టీ తాగుతూ, భోజనం చేస్తూ నిదానంగా కర్ణాటక చేరుకున్నాడు.

షోరూమ్ పక్కన ?

షోరూమ్ పక్కన ?


బెంగళూరు- ముంబాయి హైవే రహదారి మీదుగా బాగల్ కోటే జిల్లాలోని ఇళకల్ల పట్టణం చేరుకున్న లారీ డ్రైవర్ రాజు కల్యాణ సుందరం గ్రానైట్ రాయి డెలివరీ ఇవ్వడానికి యజమాని చూపించిన గ్రానైట్ షో రూమ్ గౌడన్ దగ్గరకు వెళ్లాడు. ఇళకల్ల పట్టణంలోని గ్రానైట్ షోరూమ్ యజమాని కూలీలు, క్రేన్ సహాయంతో గ్రానైట్ రాయిని గౌడన్ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో అన్ లోడ్ చేస్తున్నారు.

బ్యాగ్ లో మహిళ తల

బ్యాగ్ లో మహిళ తల

గ్రానైట్ రాయి అన్ లోడ్ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్ బయటపడింది. బ్యాగ్ తీసి చూసిన కూలీలు, లారీ డ్రైవర్ రాజా కల్యాణ సుందరం, గ్రానైట్ షోరూమ్ యజమాని షాక్ అయ్యి పోలీస్ స్టేషన్ కు పరుగు తీశారు. గ్రానైట్ తో పాటు లారీలో మహిళ తల పార్శిల్ అయ్యిందని తెలుసుకున్న బాగల్ కోటే జిల్లా పోలీసులు షాక్ అయ్యారు.

కూపీలాగిన పోలీసులు

కూపీలాగిన పోలీసులు

మహిళను దారుణంగా హత్య చేసిన నిందితులు ఆమె తలను పదునైన ఆయుధంతో నరికేశారని, తరువాత తల మాత్రం బ్యాగ్ లో పెట్టి గ్రానైట్ లారీలో విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్ రాజా కల్యాణ సుందరం ఎక్కడైనా భోజనానికి నిలిపిన సమయంలో నిందితులు మహిళ తల ఉన్న బ్యాగ్ విసిరేసి ఉంటారని పోలీసులు మొత్తం కూపీలాగారు.

హత్యకు గురైయ్యింది అత్త

హత్యకు గురైయ్యింది అత్త

గ్రానైట్ లారీలో చిక్కిన తల కర్ణాటకలోని మండ్య జిల్లా తూబినకెరె గ్రామానికి చెందిన నింగమ్మ అనే మహిళదని పోలీసులు గుర్తించారు. తుమకూరులో కూతురి దగ్గర ఉంటున్న నింగమ్మ పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి బెంగళూరు వెళ్లి కనపడకుండా పోయిందని పోలీసులకు తెలిసింది. నింగమ్మ కోడలు లతా బెంగళూరులో ఉందని పోలీసులు గుర్తించారు.

 కోడలి అక్రమ సంబంధం

కోడలి అక్రమ సంబంధం

నింగమ్మ కుమారుడిని పెళ్లి చేసుకున్న లతా హ్యాపీగా ఉండేది. నింగమ్మ కుమారుడు చనిపోయిన తరువాత రేఖ బెంగళూరు వచ్చి ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరు సిటీ బస్సు (బీఎంటీసీ)లో డ్రైవర్ గా పని చేస్తున్న బాలచంద్ర (42) అనే వ్యక్తితో లతా అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త లేని లతాతో బీఎంటీసీ డ్రైవర్ బాలచంద్ర జల్సా చేస్తున్నాడు.

అత్తను చంపిన కోడలు.... శవం మాయం చేసిన ప్రియుడు

అత్తను చంపిన కోడలు.... శవం మాయం చేసిన ప్రియుడు

బెంగళూరు వచ్చిన అత్త నింగమ్మకు, ఆమె కోడలు లతా అక్రమ సంబంధం విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో లతా దాడి చెయ్యడంతో నింగమ్మ ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న లతా ప్రియుడు నింగమ్మ శవాన్ని లారీలో తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద విసిరేశాడు. తన మొండెం వేరు కావడంతో తల తీసుకెళ్లి గ్రానైట్ లారీలో విసిరేశాడని రైల్వే విభాగం ఏడీజీపీ భాస్కర్ రావ్ మీడియాకు చెప్పారు.

మూడు కేసులు

మూడు కేసులు


రైల్వే ట్రాక్ మీద మొండెం పడేసిన కేసు, నింగమ్మ మాయం అయిన కేసు, బాగల్ కోటే లో మహిళ తల చిక్కిన కేసులు మూడు విచారణ చేసిన పోలీసులు చివరికి హత్యకు గురైయ్యింది నింగమ్మ అని నిర్దారించుకున్నారు. అక్రమ సంబంధం కారణంగా లతా ఆమెను అత్తను హత్య చేస్తే బీఎంటీసీ డ్రైవర్ ఆ శవాన్ని మాయం చెయ్యడానికి ఇంత చేశాడని ఏడీజీపీ భాస్కర్ రావ్ అన్నారు. కోడలు లతా తప్పించుకుందని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Illegal affair: Bengaluru BMTC driver arrested in women murder case at Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X