Illegal affair: పిల్లల తల్లితో పెళ్లికి సిద్దం, భార్యకు విడాకులు ఇవ్వలేదు, లవర్ మీద యాసిడ్ దాడితో !
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. చాలాకాలం పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో దంపతులు విడాకులు తీసుకున్నారు. పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటున్న మహిళ అగరబత్తీల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నది. అదే అగరబత్తీల ఫ్యాక్టరీలో పని చేస్తున్న యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల నుంచి వివాహిత మహిళ, ఆ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వివాహిత మహిళను రెండో పెళ్లి చేసుకోవాలని యువకుడు అనుకున్నాడు. ఇదే విషయం ప్రియురాలికి చెప్పాడు. అప్పటికే యువకుడికి పెళ్లి అయ్యి భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలుసుకున్న ప్రియురాలు రెండో పెళ్లికి నిరాకరించింది. నువ్వు మొదట నీ భార్యకు విడాకులు ఇవ్వు తరువాత రెండో పెళ్లి చేసుకుందామని ప్రియురాలు చెప్పింది. రెండో పెళ్లి గురించి ప్రియురాలితో మాట్లాడుతూ వెలుతున్న యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన మహిళ మీద యాసిడ్ దాడి చెయ్యడం కలకలం రేపింది.

భర్తతో గొడవలు
బెంగళూరు నగరంలోని ఇలియాస్ నగర్ లో రజియా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం రజియా బేగంకు వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న రజియా బేగం ఆమె భర్తతో కాపురం చేసి ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత రజియా బేగం దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

భర్తకు విడాకులు ఇచ్చేసిన మహిళ
చాలాకాలం పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో రజియా బేగం దంపతులు విడాకులు తీసుకున్నారు. పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటున్న రజియా బేగం ఇలియాస్ నగర్ సమీపంలోని ప్రముఖ అగరబత్తీల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నది. అదే అగరబత్తీల ఫ్యాక్టరీలో పని చేస్తున్న మొహమ్మద్ అనే యువకుడు రజియా బేగంతో సన్నిహితంగా ఉంటున్నాడు.

అక్రమ సంబంధం..... ఎంజాయ్
రజియా బేగంతో సన్నిహితంగా ఉంటున్న మొహమ్మద్ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల నుంచి వివాహిత మహిళ రజియా బేగం, మొహమ్మద్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వివాహిత మహిళ రజియా బేగంను రెండో పెళ్లి చేసుకోవాలని మొహమ్మద్ అనుకున్నాడు. ఇదే విషయాన్ని మొహమ్మద్ అతని పిల్లల తల్తి ప్రియురాలు రజియా బేగంకు చెప్పాడు.

ప్రియుడికి ముందే పెళ్లి
అప్పటికే మొహమ్మద్ కు పెళ్లి అయ్యిందని, అతను భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలుసుకున్న ప్రియురాలు రజియా బేగం ప్రియుడు మొహమ్మద్ తో రెండో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. నువ్వు మొదట నీ భార్యకు విడాకులు ఇవ్వు తరువాత రెండో పెళ్లి చేసుకుందామని ప్రియురాలు రజియా బేగం ఆమె ప్రియుడు మొహమ్మద్ కు చెప్పింది.

ప్రియురాలితో గొడవపడిన ప్రియుడు
ఇలియాస్ నగర్ లో రెండో పెళ్లి గురించి ప్రియురాలు రజియా బేగంతో నడుచుకుంటూ మాట్లాడుతూ వెలుతున్న మొహమ్మద్ పెళ్లి చేసుకోవాలని అతని ప్రియురాలి మీద ఒత్తిడి చేశాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మొదటి భార్యకు విడాకులు ఇవ్వు తరువాత ఆలోచిద్దామని రజియా బేగం తేల్చి చెప్పింది.

ప్రియుడిని చితకబాదేశారు
పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన రజియా బేగం మీద పక్కనే నడుచుకుంటూ వెలుతున్న ఆమె ప్రియుడు మొహమ్మద్ యాసిడ్ దాడి చెయ్యడం కలకలం రేపింది. ప్రియురాలి మీద యాసిడ్ దాడి చేసిన తరువాత మొహమ్మద్ పారిపోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. రజియా బేగం ముఖం మీద, కంటి మీద యాసిడ్ దాడి జరిగిందని, బుర్కా వేసుకోవడం వలన ఆమెకు ఎక్కువ గాయాలు కాలేదని, ఆమె సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నదని బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ హరీష్ పాండే మీడియాకు చెప్పారు.