
Illegal affair: అందమైన భార్యకు ?, ఆంటీని సెట్ చేసుకున్న భర్త, ఎదురు తిరిగిన భార్యకు !
పూణే: కుటుంబ సభ్యులు సెట్ చేసిన యువకుడిని వివాహం చేసుకున్న యువతి అతనితో సంతోషంగా కాపురం చెయ్యాలని ఆశపడింది. భర్తతో కలిసి అతని ఇంట్లో ఉంటున్న యువతి అనేక కలలు కనింది. అయితే భర్త మాత్రం అతని భార్యతో ఏదోఒకరంగా కాపురం చేస్తూ బయట వివాహిత మహిళను సెట్ చేసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. చాలాకాలం పాటు భర్త అక్రమ సంబంధం విషయం అతని భార్యకు తెలీకుండా సీక్రేట్ గానే ఉండిపోయింది. కొంతకాలం నుంచి సంపాధిస్తున్న డబ్బు మొత్తం ప్రియురాలికి తగలేస్తున్న భర్త అతని భార్యకు ఏదో కొంచెం చేతిలో పెట్టి కాలం గడిపేస్తున్నాడు. ఇటీవల భర్త అక్రమ సంబంధం గురించి అతని భార్యకు తెలిసిపోయింది. నాతో సక్రమంగా కాపురం చేస్తే చెయ్యాలని, నువ్వు పరాయిస్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నేను సహించనని భార్య తేల్చి చెప్పింది. భార్య పీడ వదిలించుకోవాలని అనుకున్న భర్త తాను విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నానని, పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యకు టార్చర్ పెట్టాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావడానికి నిరాకరించిన భార్యను ఆమె భర్త హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
Girlfriend:
గర్ల్
ఫ్రెండ్
తో
హోటల్
లో
టెక్కీ
ఎంజాయ్,
పోర్న్
సైట్
అతని
వీడియో
అతనే
చూసి
!

10 ఏళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి
మహారాష్ట్రలోని పూణే సిటీలోని మోషి చిఖాలీ రోడ్డులో మొహ్సిన్ అజీమ్ జాకీర్ హుస్సేన్ షేక్ అలియాస్ జాకీర్ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2012లో జాకీర్ షేక్ కుటుంబ సభ్యులు చూపించిన రజియా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. జాకీర్ షేక్, రజియా బేగం వివాహం అప్పట్లో గ్రాండ్ గా జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

హ్యీపీగా ఉండాలని అనుకున్న భార్య
కుటుంబ సభ్యులు సెట్ చేసిన జాకీర్ షేక్ ను వివాహం చేసుకున్న రజియా బేగం ఆమె భర్తతో సంతోషంగా కాపురం చెయ్యాలని ఆశపడింది. భర్త జాకీర్ షేక్ తో కలిసి మోషి చిఖాలీ రోడ్డులోని అతని ఇంట్లో ఉంటున్న రజియా బేగం తన జీవితం సంతోషంగా సాగిపోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని చాలా కలలు కనింది.

ఆంటీని సెట్ చేసుకున్న భర్త
రజీయా బేగంను వివాహం చేసుకోకముందే జాకీర్ షేక్ కు ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిసింది. జాకీర్ షేక్ మాత్రం అతని భార్య రజియా బేగంతో ఏదోఒకరంగా కాపురం చేస్తూ బయట వివాహిత మహిళను సెట్ చేసుకుని ఆమెతో షికార్లు, టూర్లు తిరుగుతూ ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడని వెలుగు చూసింది.

భార్యకు తెలిసి రచ్చరచ్చ అయ్యింది
చాలాకాలం పాటు జాకీర్ షేక్ అక్రమ సంబంధం విషయం అతని భార్య రజియా బేగంకు తెలీకుండా సీక్రేట్ గానేఉండిపోయింది. కొంతకాలం నుంచి సంపాధిస్తున్న డబ్బు మొత్తం ప్రియురాలికి తగలేస్తున్న జాకీర్ షేక్ అతని భార్య రజియా బేగంకు ఏదో కొంచెం డబ్బులు చేతిలో పెట్టి కాలం గడిపేస్తున్నాడు.

టార్చర్ మొదలు పెట్టిన భర్త
ఇటీవల భర్త జాకీర్ షేక్ అక్రమ సంబంధం గురించి అతని భార్య రజియా బేగంకు తెలిసిపోయింది. నాతో సక్రమంగా కాపురం చేస్తే చెయ్యాలని, నువ్వు పరాయిస్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నేను సహించనని, నువ్వు పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని రజియా బేగం ఆమె భర్త జాకీర్ షేక్ కు తేల్చి చెప్పింది.

మ్యాటర్ కట్నం వైపు తిప్పిన భర్త
భార్య రజియా బేగం పీడ వదిలించుకోవాలని అనుకున్న భర్త జాకీర్ షేక్ తాను విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నానని, పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని అతని భార్యకు టార్చర్ పెట్టాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావడానికి నిరాకరించిన రజియా బేగంను ఆమె భర్త జాకీర్ షేక్ హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

భార్య జస్ట్ మిస్........ భర్త మీద కేసు పెట్టిన భార్య
రజియా బేగం తప్పించుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. రజియా బేగంను ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజియా బేగం కూడా ఆమె భర్త జాకీర్ షేక్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్య రజియా బేగంకు చిత్రహింసలు పెడుతున్నాడని, వరకట్నం కోసం టార్చర్ పెడుతున్నాడని జాకీర్ షేక్ మీద కేసు నమోదు చేశామని మోషి చిఖాలీ పోలీసు అధికారులు తెలిపారు.