• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: రాత్రి కేసు పెట్టిన భార్య, పగలు చంపేసిన భర్త, అదే డౌట్, గంట ముందు !

|

చెన్నై/ తిరువనంతపురం: హ్యాపీగా పెళ్లి చేసుకున్న దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. హ్యాపీగా సంసారం చేసుకుంటున్న దంపతుల జీవితంలో అనుమానం మొదలైయ్యింది. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమెతో నిత్యం గొడవలు పడుతూనే ఉన్నాడు. గొడవలు రానురాను పెరిగి పెద్దవి అయ్యాయి. రాత్రి భార్య భర్త మీద కేసు పెట్టడంతో మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసు అధికారులు ఆదేశించారు. పిల్లలు ఆన్ క్లాస్ ల్లో చదువుకోవడానికి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త పోలీసు విచారణ భయంతో అతను చేతి మణికట్టు కత్తిరించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

Illegal affair: పూజారికి గుడిలో అసిస్టెంట్, ఇంట్లో ఆంటీకి ?, పువ్వులు పట్టిన చేతితో కత్తి !Illegal affair: పూజారికి గుడిలో అసిస్టెంట్, ఇంట్లో ఆంటీకి ?, పువ్వులు పట్టిన చేతితో కత్తి !

 హ్యాపీలైఫ్

హ్యాపీలైఫ్

కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని నేడుమంగాడ్ సమీపంలోని శ్రీవత్సవ ప్రాంతంలోని శ్రీ భద్రాదేవి ఆలయం సమీపంలో సతీషమ్ నాయర్, షీజా దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సతీషమ్, షీజా దంపతులు చక్కగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు పట్టడంతో వారితో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

 భార్య మీద అనుమానం ?

భార్య మీద అనుమానం ?

సతీషమ్ నాయర్ పనిమీద ఎక్కువగా బయట తిరిగేవాడు. ఇదే సమయంలో భార్య షీజా ఎక్కువగా ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టింది. తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య షీజా తనకు కాకుండా వేరే వ్యక్తులకు ఫోన్లు చేసి మాట్లాడుతోంది సతీషమ్ కు తెలిసింది. తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని సతీషమ్ నాయర్ కు అనుమానం ఎక్కువ అయ్యింది.

మర్యాదగా చెప్పు..... వదిలేస్తా.... లేదంటే ?

మర్యాదగా చెప్పు..... వదిలేస్తా.... లేదంటే ?

నేను ఇంట్లో లేని సమయంలో ఎవరెవరు ఇంటికి వచ్చి వెలుతున్నారు ?, నువ్వు బయట ఎక్కడెక్కడ తిరుగుతున్నావ్ ?, మర్యాదగా నిజం చెప్పు, వదిలేస్తా ? లేదంటే నిన్ను చంపేస్తా అంటూ భర్త సతీషమ్ నాయర్ అతని భార్య షీజాను చిత్రహింసలు పెట్టాడు. ఇటీవల కాలంలో దంపతుల మద్య గొడవలు పెరిగి పెద్దవి అయ్యాయి.

 పోలీసు కేసు పెట్టిన భార్య

పోలీసు కేసు పెట్టిన భార్య

గురువారం రాత్రి సతీషమ్, షీజా దంపతులు ఇంట్లో కొట్టుకున్నారు. ఆ సమయంలో పెద్దలు పంచాయితీ చేసినా ఫలితం లేకపోయింది. విసిగిపోయిన భార్య షీజా తన భర్త తనను హింసిస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. మరుసటి రోజు ఉదయం నువ్వు పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు భర్త సతీషమ్ నాయర్ కు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు బెండ్ తీస్తారని సతీషమ్ నాయర్ ఆందోళన చెందాడు.

 పక్లాప్లాన్ తో ఫినిష్

పక్లాప్లాన్ తో ఫినిష్

శుక్రవారం ఉదయం 10. 30 గంటల సమయంలో షీజా పిల్లలు ఇద్దరు సమీపంలోని బంధువు ఇంట్లో ఆన్ లైన్ క్లాసులు చదువుకోవడానికి వెళ్లారు. కొంతసేపటికి తాను పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని సతీషమ్ నాయర్ మరింత ఆందోళన చెందాడు. తరువాత భార్య షీజాతో గొడవ పెట్టుకున్న సతీషమ్ ఆమె గొంతు బిగించడంతో ఆమె కుప్పకూలిపోయింది. భార్య షీజా చనిపోయిందని సతీషమ్ పొరపాటుపడ్డాడు.

 భయంతో ఆత్మహత్యాయత్నం

భయంతో ఆత్మహత్యాయత్నం

భార్య షీజా చనిపోయిందని అనుకున్న సతీషమ్ అతని చేతి మణికట్టు కత్తిరించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన పిల్లలు ఇంటి ముందు తలుపులు లాక్ చేసిన విషయం గుర్తించి అమ్మా, నాన్నా ఎక్కడకు వెళ్లారు అని ఆలోచించాడు. కిచెన్ లో కిటికీ తీసి ఉండటంతో వెళ్లి చూడగా అక్కడ అమ్మా, నాన్న కుప్పకూలి కిందపడి ఉన్న విషయం గుర్తించి కేకలు వేశారు.

  Rumours on Jasprit Bumrah and Anupama parameshwaran relationship | Oneindia Telugu
   దారుణం జరిగింది

  దారుణం జరిగింది

  విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సతీషమ్, షీజాను వెంటనే సమీపంలోని నేడుమంగాడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే షీజా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భర్త సతీషమ్ నాయర్ పరిస్థితి చాల విషమంగా ఉందని, అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. అనుమానంతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.

  English summary
  Illegal relationship: Nedumangad husband hacked his wife to death. Her husband, who tried to commit suicide by cutting his wrist in Kerala.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X