Illegal affair: ఫ్రెండ్ భార్యతో బెడ్ రూమ్ లో రొమాన్స్, తొందర ఎక్కువ, భర్త ఎంట్రీతో గేట్ పాస్!
భోపాల్/ ఖార్గోన్/ బెంగళూరు: చిన్ననాటి స్నేహితుడు ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో అతని ఫ్రెండ్ కు ఎలాంటి అనుమానం రాలేదు. ఇద్దరూ కలిసి పని చేస్తున్నా ఆ ఫ్రెండ్స్ మద్య ఎలాంటి విభేదాలు రాలేదు. అయితే స్నేహితుడి భార్యతో లింక్ పెట్టుకున్న అతని స్నేహితుడు ఫ్రెండ్ లేని సమయంలో అతని ఇంటికి అతని భార్యతో వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. రాత్రి పని మీద బయటకు వెళ్లిన ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్లి తొందరలో తలుపు లాక్ చెయ్యకుండా అతని భార్యతో కలిసి నగ్నంగా ప్రపంచాన్ని మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటికే ఫ్రెండ్ కు, భార్యకు చెప్పిచెప్పి విసిగిపోయిన భర్త బెడ్ రూమ్ లో నగ్నంగా ఉన్న ఇద్దరినీ చూసి ఆవేశంతో రగిలిపోయి ఇద్దరినీ కొట్టికొట్టి కిరాతకంగా స్పాట్ లోనే లేపేశాడు.
Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !

హ్యాపీ లైఫ్ లో ఫ్రెండ్ ఎంట్రీ
మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ సమీపంలోని ఉన్ని దసరా ప్రాంతంలో లోకేష్ మనకన్ (32), అనితా పాటి (30) దంపతులు నివాసం ఉంటున్నారు. లోకేష్ ఓ బిల్డర్ దగ్గర కొంత మంది కూలీలను పెట్టుకుని మేస్త్రీగా పని చేస్తూ బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు లోకేష్, అనితా దంపతులు హ్యాపీగా కాలం గడిపేశారు. ఇలాంటి సమయంలో లోకేష్ వ్యక్తి గత జీవితంలోకి అతని స్నేహితుడు రవీంద్ర భగీరత్ (32) ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు.

చిన్ననాటి ఫ్రెండ్.... ఒకే చోట పని
భర్త లోకేష్, రవీంద్ర చిన్నప్పటి నుంచి స్నేహితులు. అంతే కాకుండా బిల్డర్ దగ్గర లోకేష్, రవీంద్ర ఇద్దరూ మేస్త్రీలుగా పని చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, పనుల విషయంలో వీరికి ఇంత వరకు గొడవలు రాలేదు. స్నేహితుడు లోకేష్ ఇంటికి రవీంద్ర అప్పడప్పుడు వచ్చి వెలుతున్నాడు. రవీంద్రకు ఇంకా పెళ్లి కాలేదు.

అనితా ముగ్గులో పడిన రవీంద్ర
ఫ్రెండ్ లోకేష్ భార్య అనితా అందానికి రవీంద్ర ఫీదా అయ్యాడు. ఇంటికి వచ్చి వెలుతున్న పెళ్లికాని రవీంద్రను అనితా ముగ్గులోకి దింపింది. ఓ రోజు భర్త లోకేష్ ఇంటిలో స్నానం చేస్తున్న సమయంలో వచ్చిన రవీంద్రను గట్టిగా వాటేసుకున్న అనితా నువ్వంటే నాకిష్టం అంటూ సినిమా డైలాగ్ చెప్పింది. అప్పటికే అనితా అందానికి సోల్లు కార్చుకుంటున్న రవీంద్ర మంచి చాన్స్ చిక్కిందని, ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న చాన్స్ చిక్కిందని అనుకున్నాడు.

అనితా షెడ్యూల్ ఫుల్ టైట్
భర్త లోకేష్ ఎప్పుడెప్పుడు బిల్డర్ దగ్గర ఉంటాడో అనే విషయం పూర్తిగా తెలిసిన రవీంద్ర ఆ సమయంలో ఏదో ఒక సొట్టుపెట్టుకుని అతని ఇంటికి వెళ్లి అనితాతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. రాత్రి భర్త లోకేష్ తో, పగలు ప్రియుడు రవీంద్రతో ఎంజాయ్ చేస్తున్న అనితా షెడ్యూల్ ఫుల్ బిజీ అయిపోయింది. ఇలా కొన్ని నెలలపాటు అనితా, ఆమె ప్రియుడు రవీంద్ర ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది.

భర్త వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్
భర్త లోకేష్ కు రాకేష్ అనే వ్యక్తి స్నేహితుడు, అనితా, రవీంద్ర వ్యవహారం గురించి తెలుసుకున్న రాకేష్ నువ్వు జాగ్రతగా ఉండాలని లోకేష్ కు చెప్పాడు. నీ భార్య అనితా మన ఫ్రెండ్ రవీంద్రతో తిరుగుతోందని రాకేష్ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త లోకేష్ భార్య అనితాను చితకబాది ఆమెకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అయితే భర్త లోకేష్ మాటను లెక్కచెయ్యని అనితా భర్త లేని సమయంలో ప్రియుడు రవీంద్రను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తూనే ఉంది.

బెడ్ రూమ్ లో ఇద్దరినీ స్పాట్ లో లేపేశాడు
రాత్రి కూలీలతో పని చేయిస్తూ లోకేష్ బిల్డింగ్ దగ్గర బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న రవీంద్ర అతని ఇంటికి వెళ్లి బెడ్ రూమ్ లో అనితాతో నగ్నంగా శరీరంగా మీద నూలుపోగుకూడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న రవీంద్ర బైక్ లో ఇంటికి వెళ్లాడు. కామంతో రగిలిపోతున్న అనితా, రవీంద్ర ఇంటి తలుపు లాక్ చెయ్యకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో భార్య అనితాను ఫ్రెండ్ తో నగ్నంగా చూసిన లోకేష్ రగిలిపోయాడు. వెంట తీసుకెళ్లిన పెద్ద కర్ర తీసుకుని బెడ్ రూమ్ లో నుంచి అనితా, ఆమె ప్రియుడు రవీంద్ర బయటకు వెళ్లకుండా లాక్ చేసి ఇద్దరి తలల మీద కర్రతో దాడి చేసి చితకబాది స్పాట్ లో చంపేశాడు.

ఫ్రెండ్ శవాన్ని ఎత్తుకెళ్లి
భార్య అనిత శవాన్ని ఇంట్లోనే పెట్టిన లోకేష్ ఫ్రెండ్ రవీంద్ర శవాన్ని సంచిలో మూటకట్టి బైక్ లో రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి కల్వర్టులో విసిరేశాడు. తరువాత నేరుగా ఇంటికి వచ్చిన లోకేష్ నగ్నంగా శవంగా పడి ఉన్న భార్య అనితా శవాన్ని ఇంటి బయటకు విసిరేశాడు. స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఖార్గోన్ ఏఎస్పీ జితేంద్ర సింగ్ పర్వాన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

చంపేసి సిగరేట్లతో కాలక్షేపం
భార్య అనితా, ఫ్రెండ్ రవీంద్ర అక్రమ సంబంధం విషయంలో ఎన్నిసార్లు వారికి నచ్చచెప్పినా వినలేదని, అందుకే చంపేశానని లోకేష్ నేరం అంగీకరించాడని ఖార్గోన్ ఏఎస్పీ జితేంద్ర సింగ్ పర్వాన్ మీడియాకు చెప్పారు. భార్య అనితా, ఫ్రెండ్ రవీంద్రను చంపేసిన లోకేష్ పారిపోకుండా హ్యాపీగా ఇంట్లో కుర్చుకుని సిగరెట్లు తాగుతూ కాలక్షేపం చేస్తున్న విషయం గుర్తించి స్థానికులు షాక్ కు గురైనారు. కేసు విచారణలో ఉందని ఖార్గోన్ ఏఎస్పీ జితేంద్ర సింగ్ పర్వాన్ మీడియాకు చెప్పారు.