Illegal affair: కండెక్టర్ లవ్ మ్యారేజ్, భర్త బస్సులో విజిల్ వేస్తుంటే భార్య ?, పెళ్లికి ముందే !
బెంగళూరు: కొన్ని సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయిని ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. యువకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మమ్మ ఇంటిలో కాపురం పెట్టిన భర్త అతని భార్యతో కలిసి సంతోషంగా కాపురం చేశాడు. పెళ్లి కాకముందు ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయం అయిన వ్యక్తి విషయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్య తనను మోసం చేస్తోందని భర్త రగిలిపోయాడు. భార్యను చంపేసిన భర్త ఆమె శవాన్ని యూరియా మూటలో కట్టేసి పొలంలోకి తీసుకెళ్లి పాతిపెట్టేశాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా శవం మీద టెంకాయ చెట్లు నాటేశాడు. వ్యక్తిగత పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య కనపడకుండా పోయిందని, తనకు భయంగా ఉందని పోలీసు కేసు పెట్టాడు.
Illegal affair: రౌడీషీటర్ గర్ల్ ఫ్రెండ్ తో ? జిమ్ లో చంపేసి డ్రమ్ లోనే బూడిద చేసి నిమజ్జనం!

ఆర్ టీసీ బస్సులో కండెక్టర్ ఉద్యోగం
బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని రామనగర జిల్లా, కనకపురలోని గోపాలక్రిష్ణ టెంట్ హౌస్ సమీపంలో నివాసం ఉంటున్న లోకేష్ (30) అనే యువకుడు కేఎస్ఆర్ టీసీలో కండెక్టర్ అండ్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. హావేరి జిల్లా హానగల్ తాలుకా హోంకణ గ్రామానికి చెందిన గీతా (25) అనే యువతి బెంగళూరు నగర శివార్లలోని నెలమంగల సమీపంలోని మాదనాయకనహళ్ళి చేరుకుని అక్కడ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేది.

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం
ఆరు సంవత్సరాల క్రితం లోకేష్, గీతాకు పరిచయం అయ్యింది. తరువాత లోకేష్, గీతా ప్రేమించుకున్నారు. కులాలు వేరు అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. లోకేష్ ఆర్ టీసీలో ఉద్యోగం చేస్తున్నాడని ధైర్యంగా గీతా అతన్నిపెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని నిర్ణయించింది. నాలుగు సంవత్సరాల క్రితం లోకేష్, గీతా కులాంతర వివాహం చేసుకున్నారు.

భార్యను ఉద్యోగం మానేయాలని చెప్పిన భర్త
పెళ్లి చేసుకున్న తరువాత నువ్వు ఉద్యోగం చెయ్యకూడదని లోకేష్ గీతాకు పెళ్లికి ముందే కండీషన్ పెట్టాడు. భర్త చెప్పినట్లు కొంతకాం ఉద్యోగం చేసిన గీతా తరువాత ఇంటికే పరిమితం అయ్యింది. పెళ్లి చేసుకున్న తరువాత లోకేష్ సాతనూరు సమీపంలోని యలవళ్ళి గ్రామంలోని అమ్మమ్మ ఇంటిలో భార్య గీతాతో కలసి నివాసం ఉంటూ కండెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు.

పెళ్లికి ముందే భార్యకు
పెళ్లి కాకముందు గీతాకు పరిచయం ఉన్న వ్యక్తి విషయంలో భర్త లోకేష్ నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఇదే విషయంలో నిత్యం దంపతుల మధ్య గొడవలు జరిగేవి. లోకేష్ బంధువులు, స్నేహితులు ఇంతకాలం వారికి సర్దిచెబుతూ వచ్చారు. నీకు అతనితో అక్రమ సంబంధం ఉందని, అందుకే అప్పుడప్పుడు బయటకు వెళ్లి వస్తున్నావని, ఫోన్లు చేసి మాట్లాడుతున్నావని భర్త లోకేష్ భార్య గీతా మీద రగిలిపోయాడు. ఇదే విషయంలో భార్య గీతా మీద ఆమె భర్త లోకేష్ అనుమానం పెంచుకున్నాడు.

భార్యను చంపేసి యూరియాలో కలిపేసిన భర్త
2021 జూన్ 1వ తేదీన రాత్రి ఇంట్లో గీతా, లోకేష్ దంపతలు పాతపంచాయితీ విషయంలోనే గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన లోకేష్ భార్య గీతా తల మీద బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తరువాత అర్దరాత్రి గీతా శవాన్ని యూరియా మూటలో కట్టేశాడు. బైక్ లో శవాన్ని అమ్మమ్మ పొలంలోకి తీసుకెళ్లిన లోకేష్ అక్కడే గోతితీసి పాతిపెట్టేశాడు.

పోలీసుల ముందు నటించలేకపోయిన కండెక్టర్
పొలంలో భార్య గీతా శవాన్ని పాతిపెట్టిన తరువాత అక్కడ మట్టి చదును చేసిన లోకేష్ అతి తెలివి ప్రదర్శించాడు. కొన్ని టెంకాయ చెట్లు తీసుకెళ్లిన భర్త లోకేష్ గీత శవం మీద, పరిసర ప్రాంతాల్లో వాటిని నాటేశాడు. వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లిన తన భార్య కనపడటం లేదని లోకేష్ పోలీసు కేసు పెట్టాడు.

భర్తను పట్టించిన భార్య మొబైల్ ఫోన్ నెంబర్
కేసు నమోదు చేసిన పోలీసులు లోకేష్, గీతా మొబైల్ ఫోన్ నెంబర్ల డేటాను పరిశీలించారు. భర్త లోకేష్ తీరుతో అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. తన భార్యను తానే హత్య చేశానని పోలీసుల విచారణలో లోకేష్ అంగీకరించాడు. పొలంలో పాతిపెట్టిన గీతా మృతదేహాన్ని బయటకుతీయడంతో అప్పట్లో స్థానికంగా కలకలం రేపింది.