చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: నా భార్యతో వీళ్లకు ఏం పని ?, జాకెట్లు ఎవరికి కుడుతోంది ? వాట్సాప్, అదే డౌట్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/కన్యాకుమారి: భర్తకు ఆర్థికంగా సహాయం చెయ్యడానికి భార్య టైలర్ పని చేస్తోంది. టైలరింగ్ లో శిక్షణ తీసుకున్న భార్య నిత్యం యూట్యాబ్ లో మంచి మంచి డిజైన్లు సెలక్ట్ చేసుకుని కస్టమర్లకు చూపించి ఆ విధంగా జాకెట్లు, పంజాబి డ్రెస్ లు కుడుతూ బాగానే డబ్బులు సంపాధిస్తోంది. పని మీద నిత్యం ఇంటికి వస్తున్న వారిని చూసి భర్తకు భార్య మీద అనుమానం మొదలైయ్యింది. నీ దగ్గరకు వచ్చేది టైలరింగ్ కస్టమర్లా ? లేక వేరే కస్టమర్లా ?, నువ్వు ఆడవాళ్లకు జాకెట్లు కుడుతున్నావా ? లేక వాళ్ల మొగుళ్లకు కుడుతున్నావా ? అంటూ భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భార్య ఫోన్ ఎంగేజ్ రావడంతో అతనికి మరింత అనుమానం పెరిగిపోయింది. భార్య ఎవ్వరినీ చూడకుండా అతను ఇంటి బయట పెద్ద కాంపౌండ్ గొడ కట్టేశాడు. టైలరింగ్ పని చెయ్యకూడదని భార్యను నిర్బంధించాడు. రోజూ భార్య మొబైల్ ఫోన్ లో వాట్సాప్ మేజ్ లు చూసి ఆమెను వేధించాడు. చివరికి భర్త అనుమానం ఎక్కువ కావడం, భార్య శీలాన్ని భూతద్దంలో చూడటంతో ఇక తన భార్య మారదు అని డిసైడ్ అయినన భర్త ఆమె గొంతు కోసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

friend: సోషల్ మీడియా స్కెచ్, ఫిగర్ అదిరిందని టీ ప్లాన్, 3 ఏళ్లు రొమాన్స్, బ్లాక్ మెయిల్, వీడియో !friend: సోషల్ మీడియా స్కెచ్, ఫిగర్ అదిరిందని టీ ప్లాన్, 3 ఏళ్లు రొమాన్స్, బ్లాక్ మెయిల్, వీడియో !

 ఇద్దరు పిల్లలు.... హ్యాపీలైఫ్

ఇద్దరు పిల్లలు.... హ్యాపీలైఫ్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా వెల్లిచందై ప్రాంతంలో రమేష్ (42), ఉమా (39) దంపతులు నివాసం ఉంటున్నారు. రమేష్, ఉమా దంపతులకు 11 ఏళ్ల కుమారుడు, 9 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. రమేష్ బైక్ లు, కార్ల సీట్లకు కొత్తకొత్త డిజైన్ల రెగ్జిన్ కవర్లు కుట్టే షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు భార్య, పిల్లలతో రమేష్ చాలా సంతోషంగా ఉండేవాడు.

భార్య లేడీస్ టైలర్

భార్య లేడీస్ టైలర్

పెళ్లి కాకముందే భార్య ఉమా టైలరింగ్ లో శిక్షణ తీసుకుంది. భర్త రమేష్ కు ఆర్థికంగా సహాయం చెయ్యడానికి ఇంట్లోనే కుట్టు మిషన్ పెట్టుకున్న ఉమా ఇంట్లో లేడీస్ జాకెట్లు, పంజాబి డ్రెస్ లు కుడుతున్నది. జాకెట్లు కుట్టించుకోవడానికి స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు ఉమా ఇంటికి వచ్చి వెలుతున్నారు. జాకెట్లు కుట్టించుకోవడానికి వచ్చి వెళ్లే మహిళల వెంట వారి భర్తలు కొందరు ఉమా ఇంటికి వచ్చి వెలుతున్నారు.

 యూట్యూబ్ డిజైన్ లు..... వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు

యూట్యూబ్ డిజైన్ లు..... వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు

ఉమా నిత్యం యూట్యాబ్ లో మంచి మంచి డిజైన్లు సెలక్ట్ చేసుకుని కస్టమర్లకు చూపించి ఆ విధంగా జాకెట్లు, పంజాబి డ్రెస్ లు కుడుతూ డబ్బులు సంపాధిస్తోంది. యూట్యూబ్ లో చూసి కొత్తకొత్త డిజైన్లను వాట్సాప్ లో మెసేజ్ లు, వీడియోలను కస్టమర్లకు పంపించి ఆమె మీకు ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటూ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నించింది. నా భార్య ఉమా ఎప్పుడు వాట్సాప్ మెసేజ్ లు ఎందుకు పంపిస్తోంది ? అంటూ రమేష్ లోలోపల అనుమానం పెంచుకున్నాడు.

 నీ కస్టమర్లు లేడీస్ కాదా ? వాళ్ల మొగుళ్లా

నీ కస్టమర్లు లేడీస్ కాదా ? వాళ్ల మొగుళ్లా

పని మీద నిత్యం ఇంటికి వస్తున్న మహిళలు, వారి భర్తలను చూస్తున్న భర్త రమేష్ కు భార్య ఉమా మీద అనుమానం మొదలైయ్యింది. జాకెట్లు కుట్టించుకోవడానికి మహిళలు రావాలి కదా ? వాళ్ల మొగుళ్లు ఎందుకు వస్తున్నారు ? అంటూ రమేష్ భార్య ఉమాతో కొన్ని సంవత్సరాల నుంచి గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. నీ దగ్గర జాకెట్లు కుట్టించుకోవడానికి వచ్చే ఆడవాళ్ల మొగుళ్లతో నువ్వు చనువుగా ఉంటూ వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావ్, నీకు మగాళ్ల పిచ్చి ఎక్కువగా పట్టుకుంది అంటూ రమేష్ భార్య ఉమాతో గొడవ పెట్టుకుని చితకబాదేశాడు.

 ఫోన్ ఎంగేజ్ ఓ సమస్య..... పెద్దలు పంచాయితి

ఫోన్ ఎంగేజ్ ఓ సమస్య..... పెద్దలు పంచాయితి

భార్య ఉమా మీద అనుమానంతో షాప్ లో నుంచి ఎప్పుడంటే అప్పుడు రమేష్ ఆమెకు ఫోన్లు చేసేవాడు. భార్య మొబైల్ ఫోన్ ఎంగేజ్ వస్తే ఆ విషయం అడ్డం పెట్టుకుని ఇంటికి వచ్చి భార్యను చితకబాదేవాడు. వేరే మహిళలతో ఫోన్ లో మాట్లాడితే ఎంగేజ్ కాకుండా ఏమి వస్తుంది అంటూ ఉమా కుటుంబ సభ్యులు రమేష్ ను ప్రశ్నించేవాళ్లు. ఉమా కుటుంబ సభ్యులు చాలాసార్లు పంచాయితీలు చేసి రమేష్ కు సర్దిచెబుతూ వచ్చారు.

 భార్యను చూడకూడదని పెద్ద కాంపౌండ్ కట్టేశాడు

భార్యను చూడకూడదని పెద్ద కాంపౌండ్ కట్టేశాడు

రానురాను భార్య ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్న రమేష్ చివరికి ఇంటికి పాలు తెచ్చే అబ్బాయి దగ్గర నుంచి అందర్ని అనుమానించడం మొదలుపెట్టాడు. భార్య ఉమా దగ్గర పూర్తిగా టైలర్ పని మాన్పించేశాడు. అంతే కాకుండా తన భార్య ఎవ్వరినీ చూడకూడదని ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ గొడ కట్టేశాడు. భార్య ఉమాను ఇంటి నుంచి బయటకు పంపించకుండా ఇంట్లోనే ఆమెను కట్టేశాడు.

 భర్తకు చెప్పాపెట్టకుండా చెక్కేసిన భార్య

భర్తకు చెప్పాపెట్టకుండా చెక్కేసిన భార్య

షాప్ కు వెలుతున్నానని భార్య ఉమాకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెలుతున్న రమేష్ తరువాత షాప్ కు వెళ్లకుండా ఇంటి సమీపంలో దాక్కొని ఆమె మీద నిఘా వెయ్యడం మొదలుపెట్టాడు. నా ఇంటికి ఎవరైనా మగాళ్లు వచ్చి వెలుతున్నారా ? అంటూ ఎప్పుడంటే అప్పుడు ఇంటి సమీపంలో దాక్కొని చూసేవాడు. తన ప్రవర్తన మీద భర్త రమేష్ కు అనుమానం ఇంకా ఎక్కువ అయ్యిందనే ఆవేదనతో నాలుగు నెలల క్రితం ఉమా భర్తకు ఒక్కమాట కూడా చెప్పకుండా ఇద్దరు పిల్లలను పిలుచుకుని పుట్టింటికి చెక్కేసింది. నెల రోజుల తరువాత రమేష్ భార్య పుట్టింటికి వెళ్లి ఇక ముందు తన భార్య, పిల్లలను చక్కగా చూసుకుంటానని ఊరి పెద్దల ముందు నాటకాలు ఆడి వారిని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు.

పక్కా స్కెచ్.... భార్య గొంతు కోసి చీకట్లో ఎస్కేప్

పక్కా స్కెచ్.... భార్య గొంతు కోసి చీకట్లో ఎస్కేప్

రాత్రి ఇంటికి వెళ్లిన భర్త రమేష్ నువ్వు మీళ్ల ఫోన్ లో నీ ప్రియుడితో మాట్లాడుతున్నావ్, ఎందుకు ఫోన్ లు చేస్తున్నావ్ అంటూ గొడవ పెట్టుకున్నాడు. చాలాసేపు గొడవ జరిగింది. అర్దరాత్రి భార్య ఉమా ఇద్దరు పిల్లలతో కలిసి వేరే గదిలో నిద్రపోయింది. ఆసమయంలో కత్తి తీసుకుని వెళ్లిన రమేష్ భార్య ఉమాను కదలకుండా ఆమె మీద కుర్చుకుని కత్తితో ఆమె గొంతు కోసేసేశాడు. ఉమా కేకలు వెయ్యడంతో ఇద్దరు పిల్లలు నిద్రలేచారు. ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు పరుగు తీసిన రమేష్ అతని బైక్ లో చీకట్లో పరారైనాడు.

 మా నాన్న చంపేశాడు

మా నాన్న చంపేశాడు

ఉమా ఇంటి చుట్టుపక్కల వాళ్ల సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఉమాను అసరిపల్లెం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఉమా ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. తన తండ్రి రమేష్ తన తల్లి గొంతు కోసి చంపేశాడని ఉమా కూతురు పోలీసులకు చెప్పింది. రమేష్ కోసం గాలిస్తున్నామని కన్యాకుమారి జిల్లా పోలీసులు తెలిపారు.

Recommended Video

#HBDSouthQueenTRISHA : Trisha Krishnan Interesting Facts | Trisha Biography || Oneindia Telugu

English summary
Illegal affair: Husband killed wife due to illegal relationship and family issues near Kanyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X