• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: అందమైన భార్య, డైలీ ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ పౌడర్, అక్కడే తేడా, డౌట్ తో !

|

చెన్నై/ క్రిష్ణగిరి/ హోసూరు: భార్య అందంగా ఉందని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్ర ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ పౌడర్ వేసుకుని సింగారించుకుంటున్నదని భర్తకు అనుమానం పెరిగిపోయింది. 12 ఏళ్ల నుంచి భార్యతో కాపురం చేస్తున్న భర్తకు డజనుకు పైగా డౌట్లు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్త లోలోపల అనుమానం పెంచుకుని రగిలిపోయాడు. ఇదే సమయంలో భార్య ఉద్యోగంలో చేరడంతో మరింత అనుమానం పెరిగిపోయిన భర్త వీర తాగుబోతు అయ్యాడు. పక్కాప్లాన్ ప్రకారం భార్యను చంపేసిన భర్త ఆమె శవం పక్కనే కాలం గడిపాడు.

Illegal affair: ఆంటీ నర్సు, 108 డ్రైవర్, మంచమేసి దుప్పటేసి మల్లెపూలు, అంబులెన్స్ ఏసీ ఆన్!

 12 ఏళ్ల క్రితం పెళ్లి

12 ఏళ్ల క్రితం పెళ్లి

కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని క్రిష్ణగిరి (తమిళనాడు రాష్ట్రం) జిల్లాలోని ఉతంగరై ప్రాంతం సమీపంలోని పల్లసులకరైలో తంగరాజ్ (37), రుక్మిణి (33) దంపతులు నివాసం ఉంటున్నారు. 12 సంవత్సరాల క్రితం పెద్దలు సంబంధం కుదుర్చడంతో తంగరాజ్, రుక్మిణిల వివాహం జరిగింది. వివాహం జరిగి 12 ఏళ్లు అయినా ఇంత వరకు తంగరాజ్, రుక్మిణి దంపతులకు సంతానం లేదు.

 ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ పౌండర్ దెబ్బ

ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ పౌండర్ దెబ్బ

రుక్మిణి చిన్నపటి నుంచి ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని తరువాత పాండ్స్ పౌండర్ వేసుకోవడం అలవాటు అని తెలిసింది. పెళ్లి జరిగిన తరువాత ఉదయం, సాయంత్రం రుక్మిణి శుభ్రంగా స్నానం చేసి ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని తరువాత పాండ్స్ పౌండర్ వేసుకుంటున్నది. చిన్నప్పటి అలవాటును రుక్మిణి పెళ్లి జరిగిన తరువాత కొనసాగించడం భర్త తంగరాజ్ కు నచ్చలేదు.

 అసలే అందమైన భార్య..... నేనేమో ?

అసలే అందమైన భార్య..... నేనేమో ?

తన భార్య రుక్మిణి చూడటానికి చాలా అందంగా ఉంటుందని, తాను చూడటానికి అందంగా లేనని తంగరాజ్ లోలోపల రగిలిపోయాడు. తాను అందంగా లేనని తన భార్య రుక్మిణి భావించిందని. అందుకే ప్రతిరోజూ సింగారించుకుని పరాయి వ్యక్తులను వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని తంగరాజ్ అనుమానం పెంచుకున్నాడు.

 తంగరాజ్ వీర తాగుబోతు

తంగరాజ్ వీర తాగుబోతు

భార్య రుక్మిణి మీద అనుమానంతో తంగరాజ్ మద్యం తాగడానికి బానిస అయ్యాడు. టైలర్ పని చేస్తున్న తంగరాజ్ ప్రతిరోజూ సంపాధిస్తున్న డబ్బును మద్యం తాగడానికే తగలేస్తున్నాడు. సంపాదిస్తున్న డబ్బులు ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా భర్త తంగరాజ్ నిర్లక్షం చెయ్యడంతో సంసారం వెళ్లదీయడానికి రుక్మిణి నానా తంటాలు పడింది.

 ఎవరి కోసం నీ బోడి ఉద్యోగం

ఎవరి కోసం నీ బోడి ఉద్యోగం

సంసారం చెయ్యడానికి పుట్టింటి నుంచి తెచ్చుకుంటున్న డబ్బులు సరిపోకపోవడంతో సహనం కోల్పోయిన రుక్మిణి క్రిష్ణగిరిలోని ఓ లెదర్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. నువ్వు రోజూ ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని, పాండ్స్ పౌండర్ వేసుకుని ప్రియుడితో కులకడానికి ఉద్యోగానికి వెలుతున్నావని తంగరాజ్ రోజూ ఇంట్లో గొడవపడటం మొదలుపెట్టాడు.

 భార్య శవం పక్కనే ఆలోచించాడు

భార్య శవం పక్కనే ఆలోచించాడు

ప్రతిరోజూ మద్యం సేవించి రాత్రిపూట తంగరాజ్ భార్య రుక్మిణిని పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్లు ఇన్ని రోజులు సర్దిచెప్పడానికి ప్రయత్నించి చివరికి వదిలేశారు. శుక్రవారం రాత్రి తంగరాజ్, రుక్మిణి దంపతులు గొడవపడ్డారు. నా మొగుడు అంతే అంటూ రుక్మిణి నిద్రపోయింది. అర్దరాత్రి కత్తి తీసుకున్న తంగరాజ్ భార్య రుక్మిణిని నోటిలో గుడ్డలు కుక్కి నిద్రలోనే పొడిచిపొడిచి చంపేశాడు. మరుసటి రోజు వేకువ జామున వరకు భార్య రుక్మిణి శవం పక్కనే తంగరాజ్ ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ కాలం గడిపేశాడు. ఉదయం బంధువులు వెళ్లి చూడగా రుక్మిణి హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. తంగరాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Illegal affair: Husband murder wife near Krishnagiri in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X