• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: లేడీ టీచర్ కు నల్ల మొగుడు, ఎర్రతోలు ప్రియుడు, మిస్సుడ్ కాల్, కోసేశాడు !

|

చెన్నై/ ఈరోడ్: స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న భార్య ఆమె నల్లగా ఉన్న భర్తతో కాపురం చేస్తూ ఇద్దరు కుమారులకు జన్మనిశ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత డ్రైవర్ మొగుడు స్కూల్ టీచర్ కు చులకన అయ్యాడు. స్కూల్ లో పని చేస్తున్న మరో ఎర్రతోలు ప్రియుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో, లాక్ డౌన్ సమయంలో కూడా ఉద్యోగానికి వెలుతున్నానని బయటకు వెలుతున్న లేడీ టీచర్ ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని ఆమె భర్తకు తెలిసిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు భార్య మొబైల్ ఫోన్ కు మిస్సుడ్ కాల్స్ రావడం, అర్దరాత్రి కూడా భార్య మొబైల్ ఫోన్ పట్టుకుని వేలాడుతుండటంతో భర్తకు మండిపోయింది. ఎన్నోసార్లు భార్యకు నచ్చచెప్పి చూసిన భర్త చివరికి భార్యను గొంతు కోసి చంపేయడం కలకలం రేపింది.

Illegal affair: ఎన్ఆర్ఐ స్వీటీతో ఎంజాయ్, పక్కఊర్లో భార్య, సీఐ రెండు యాంగిల్స్, సీసీటీవీల్లో !Illegal affair: ఎన్ఆర్ఐ స్వీటీతో ఎంజాయ్, పక్కఊర్లో భార్య, సీఐ రెండు యాంగిల్స్, సీసీటీవీల్లో !

 లేడీ టీచర్ హ్యాపీలైఫ్

లేడీ టీచర్ హ్యాపీలైఫ్

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని జంబాయి ప్రాంతంలో సెల్వరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పది సంవత్సరాల క్రితం అర్ముగం కుమార్తె రేవతిని సెల్వరాజ్ వివాహం చేసుకున్నాడు. భర్త సెల్వరాజ్ తో హ్యాపీగా కాపురం చేసిన రేవతి యశ్వంత్, రేవంత్ అనే ఇద్దరు కుమారులకు తల్లి అయ్యింది.

 భార్య స్కూల్ టీచర్..... భర్త డ్రైవర్

భార్య స్కూల్ టీచర్..... భర్త డ్రైవర్

కొంగ్సంబులయం పంచాయితీ యూనియన్ ప్రైమరీ స్కూల్ లో రేవతి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. రేవతి భర్త డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సెల్వరాజ్ చూడటానికి చాలా నల్లగా ఉంటాడని ఆమె భార్య రేవతి చాలా ఫీలైపోయిదని సమాచారం.

ప్రతిరోజు టిప్పుటాప్ గా రెఢీ అవుతున్న రేవతి ఉదయం స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి తరిగి వస్తోంది. రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తున్న రేవతి భర్త సెల్వరాజ్ ఆమెతో గడుపుతున్నాడు.

 24 గంటలు మొబైల్ ఫోన్

24 గంటలు మొబైల్ ఫోన్

స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న రేవతి ఎక్కువ సేపు మొబైల్ ఫోన్, సోషల్ మీడియాలో చాటింగ్ లు చేస్తూ కాలం గడుపుతోంది. సాయంత్రం భర్త త్వరంగా ఇంటికి వచ్చినా అతని గురించి పట్టించుకోకుండా రేవతి మొబైల్ ఫోన్ లో కాలం గడిపింది. ఇదే విషయంలో సెల్వరాజ్, రేవతి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

 పదేపదే ఫోన్లు..... మిస్సుడ్ కాల్స్

పదేపదే ఫోన్లు..... మిస్సుడ్ కాల్స్

ఇంట్లో ఉంటున్న రేవతికి బయట వ్యక్తులు ఫోన్లు చెయ్యడం మొదలు పెట్టారు. రాత్రి అనికూడా చూడకుండా పదేపదే మిస్సుడ్ కాల్స్ రావడంతో రేవతిని ఆమె భర్త నిలదీశాడు. మా స్కూల్ లో టీచర్లు ఫోన్ చేశారని, మా హెడ్ మాస్టర్ ఫోన్ చేశారని కొంతకాలం రేవతి భర్తకు మాయమాటలు చెప్పింది.

 లాక్ డౌన్ లో భార్య జల్సాలు

లాక్ డౌన్ లో భార్య జల్సాలు

భార్య రేవతి మీద రానురాను ఆమె భర్త సెల్వరాజ్ కు అనుమానం మొదలైయ్యింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తరువాత లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో కూడా తనకు స్కూల్ లో పని ఉందని చెప్పి బయటకు వెళ్లిన రేవతి కొన్ని గంటల తరువాత ఇంటికి వెళ్లింది. రేవతి ఆమె ప్రియుడితో జల్సా చెయ్యడానికి వెలుతోందని ఆమె భర్త సెల్వరాజ్ కు తెలిసిపోయింది.

 భార్య గొంతు కోసి చంపేసి ఎస్కేప్

భార్య గొంతు కోసి చంపేసి ఎస్కేప్

రాత్రి ఇంట్లో నీ పద్దతి మార్చుకుని నాతో సక్రమంగా కాపురం చేస్తే చెయ్యి, లేదంటే నిన్ను చంపేస్తానని రేవతితో ఆమె భర్త గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త సెల్వరాజ్ కత్తి తీసుకుని భార్య రేవతి గొంతు కోసి చంపేశాడు.

 ఏం జరిగిందో ? స్వయంగా లొంగిపోయిన భర్త

ఏం జరిగిందో ? స్వయంగా లొంగిపోయిన భర్త

రేవతి హత్యకు గురైన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేవతిని హత్య చేసిన తరువాత ఆమె భర్త సెల్వరాజ్ ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసులు రేవతి భర్త కోసం గాలించారు. అయితే ఏం జరిగిందో ? ఏమో ? కాని రేవతిని తానే హత్య చేశానని ఆమె భర్త నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. అక్రమ సంబంధం కారణంగా భర్త చేతిలో రేవతి దారుణ హత్యకు గురి కావడం ఈరోడ్ లో కలకం రేపింది.

English summary
Illegal affair: Husband murdered wife in Erode for having illicit relationship in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X