• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Sadist+ Psycho: భార్య, అత్త, మరదలిని రేప్ చేశాడు, అంతకు ముందే చంపేశాడు, భార్యకు లవర్ లింక్ !

|

హర్యానా/ పానిపట్/ న్యూఢిల్లీ: మొదటి నుంచి భార్య మీద భర్తకు అనుమానం. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పదేపదే భర్త రగిలిపోయాడు. ఇప్పటికే అతనికి ఇద్దరు పిల్లలు ఉండటంతో ఈ పిల్లలు నా పిల్లలేనా ? అనే అనుమానం మరింత పెరిగిపోయింది. తన భార్య అక్రమ సంబంధానికి ఆమె తల్తి (అత్త), మరదలు సహకరిస్తున్నారని భర్త రగిలిపోయాడు. అంతే పక్కాప్లాన్ ప్రకారం హాలీవుడ్ సినిమా స్ట్రైల్లో ముగ్గురిని హత్య చెయ్యాలని ప్రయత్నించాడు. మొదట భార్య, మరదలిని చంపేశాడు. మూడు రోజులు గ్యాప్ ఇచ్చి అత్తను అడ్డంగా నరికేశాడు. అయితే ఈ సైకో భార్య, మరదలు, అత్తను చంపి వారి శవాలను కసితీరా రేప్ చేసి కామవాంఛ తీర్చుకున్నాడని వెలుగు చూడటంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు బిత్తరపోయారు.

Illegal affair: సింగపూర్ లో భర్త, సిల్క్ చీరలో భార్య, ప్రియుడు ఎంజాయ్, టాప్ హీరో ఫ్యాన్ స్కెచ్!

 కొంతకాలం భర్త హ్యాపి

కొంతకాలం భర్త హ్యాపి

హర్యానాలోని సోనెపత్ జిల్లా, పానిపట్ సమీపంలోని పట్టి కలియానా గ్రామంలో నూర్ హాసన్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని నూర్ హాసన్ వివాహం చేసుకున్నాడు. నూర్ హాసన్ పెళ్లి జరిగిన తరువాత కొంత కాలం హ్యాపీగా ఉన్నాడు. నూర్ హాసన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పదేపదే పుట్టింటికి వెలుతున్న భార్య ప్రవర్తనపై నూర్ హాసన్ కు అనుమానం మొదలైయ్యింది.

 ఇద్దరూ నా పిల్లలేనా ?

ఇద్దరూ నా పిల్లలేనా ?

పుట్టింటి దగ్గర వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న నా భార్య నేను దగ్గర లేని సమయంలో అతనితో తిరుగుతోందని నూర్ హాసన్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో నిత్యం భార్యతో గొడవపెట్టుకోవడం మొదలు పెట్టిన నూర్ హాసన్ ఎలాగైనా నా భార్య అక్రమ సంబంధం విషయం బయటపెట్టాలని ప్రయత్నించాడు. అయితే నూర్ హాసన్ కు అది సాధ్యం కాలేదు.

 మరదలు, అత్త నా కొంప ముంచేశారు

మరదలు, అత్త నా కొంప ముంచేశారు

తన భార్య అక్రమ సంబంధం విషయంలో గొడవ చేసిన ప్రతిసారి నూర్ హాసన్ అత్తా, మరదలు ఎంట్రీ ఇచ్చారు. నా కూతురు మంచిది, నువ్వు ఎందుకు అనుమానం పెంచుకుంటున్నావు ? అంటూ అత్త విరుచుకుపడేది. మా అక్క చాలా మంచిది, నువ్వు ఇలాగే గొడవలు చేస్తే నీ అంతు చూస్తాం అటూ భార్య చెల్లెలు (మరదలు) నూర్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చింది. తన భార్య, మరదలు, అత్త కలిసి నా కొంప ముంచుతున్నారని నూర్ హాసన్ రగిలిపోయాడు.

 హాలీవుడ్ సినిమా స్కెచ్ వేసిన హాసన్

హాలీవుడ్ సినిమా స్కెచ్ వేసిన హాసన్

నా భార్య నన్ను మోసం చేస్తోంది, తన భార్యకు అత్తా, మరదలు తాళం వేస్తున్నారు, ఎలాగైనా ముగ్గురిని చంపేయాలని నూర్ హాసన్ స్కెచ్ వేశాడు. యూట్యూబ్ లో ఓ హాలీవుడ్ సినిమా చూసిన నూర్ హాసన్ అచ్చం ఆ సినిమాలో లాగా భార్య, మరదలు, అత్తను చంపేయాలని సమయం కోసం వేచిచూశాడు. నన్ను మోసం చేసిన వారిని వదిలిపెట్టకూడదని నూర్ హాసన్ డిసైడ్ అయ్యాడు.

 భార్య, మరదలిని చంపి శవాలను రేప్ చేశాడు !

భార్య, మరదలిని చంపి శవాలను రేప్ చేశాడు !

ఈనెల 5వ తేదీన ఇంటికి మత్తుమందు కలిపిన బిర్యానీలు తీసుకెళ్లిన నూర్ వాటిని భార్య, మరదలకు ఇచ్చాడు. బిర్యానీలో మత్తు మందు కలిపారు అనే విషయం తెలియన భార్య, మరదలు తినడంతో మత్తులోకి జారుకున్నారు. తరువాత పదునైన కత్తి తీసుకుని భార్య, మరదలిని చంపేసి వారి శవాలపై పదేపదే అత్యాచారం చేసి కసి తీర్చుకున్నాడు. శవాలను రేప్ చేసిన నూర్ హాసన్ తరువాత ఇద్దరి మృతదేహాలను తీసుకెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.

 అత్తను అడ్డంగా నరికి శృంగారం

అత్తను అడ్డంగా నరికి శృంగారం

భార్య, మరదలిని చంపేసిన మూడు రోజుల తరువాత (ఈనెల 8వ తేది) నేరుగా బుర్దామ్ గ్రామంలోని అత్త ఇంటికి వెళ్లిన నూర్ హాసన్ అందరితో చనువుగా మాట్లాడాడు. నీ కూతుర్లు ఇద్దరూ నిన్ను చూడాలి అంటున్నారు, వెంటనే నువ్వు బయలుదేరాలి అని నూర్ హాసన్ అత్తకు చెప్పాడు. అల్లుడితో పాటు అత్త బయలుదేరి అతని ఇంటికి వెళ్లింది. ఇంట్లోనే నూర్ హాసన్ అత్తను పదునైన కొడవలితో హత్య చేశాడు. తరువాత అత్త శవంతో శృంగారం చేసిన నూర్ హాసన్ తరువాత మృతదేహాన్ని తీసుకెళ్లి కాల్చి బూడిద చేశాడు.

  Intra-Afghan Talks : ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి S Jaishankar
   శాడిస్టు+ సైకో అరెస్టు

  శాడిస్టు+ సైకో అరెస్టు

  తల్లి, ఇద్దరు కుమార్తెలు కనపడకపోవడంతో వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో నూర్ హాసన్ ను విచారణ చెయ్యగా అసలు విషయం బయటకు వచ్చింది. భార్య, మరదలు, అత్తను హత్య చేసిన తరువాత ముగ్గురిని రేప్ చేసి కసి తీర్చుకున్నానని నూర్ హాసన్ అంగీకరించాడని, అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు.

  English summary
  Illegal affair: Man killed wife, sister in law and mother in law due to family issue in Haryana.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X