• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: ఆంటీతో అక్రమ సంబంధం, చంపేసి ఇంట్లో పూడ్చేశాడు. చిన్న పొరపాటుతో !

|

భోపాల్/చెన్నై: తన కంటే చాలా సంవత్సరాల తక్కువ వయసు ఉన్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ అతనితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. రోజు ఆఇంటికి ఈ ఇంటికి ఎందుకు తిరగాలి ? అని ఆలోచించిన ఆంటీ ప్రియుడితో కలిసి అతని ఇంటిలో కాపురం పెట్టేసింది. కుటుంబ సభ్యులు ఆమెకు అతనితో కలిసి ఉండకూడదని చాలాసార్లు చెప్పిచెప్పి విసిగిపోయారు. ప్రియుడితో ఆంటీకి గొడవ అయ్యింది. అంతే ఇంతకాలం కలిసి సహజీవనం చేస్తున్న ఆంటీని ఆమె ప్రియుడు కత్తితో కసితీరా పొడిచి చంపేశాడు. శవాన్ని బయటకు తరలిస్తే చిక్కిపోతామని భయపడి అతని వంట గదిలో శుభ్రంగా పూడ్చిపెట్టి పైన ప్లాసింగ్ చేసేశాడు. ప్రియుడి ఇంటిలో అతని ప్రియురాలిని పూడ్చిపెట్టినట్లు పోలీసులకు ఎలాంటి సాక్షం చిక్కలేదు, పోలీసులు కూడా మొదట కనుక్కోలేకపోయారు. అయితే ప్రియుడి చేసిన చిన్న పొరాటుతో అతను పోలీసులకు చిక్కిపోయాడు.

Illegal affair: అత్తా, అల్లుడి అక్రమ సంబంధం, లేచిపోయి పెళ్లి, ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను ?Illegal affair: అత్తా, అల్లుడి అక్రమ సంబంధం, లేచిపోయి పెళ్లి, ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను ?

 ప్రియుడికి 35 ఏళ్లు.... ప్రియురాలికి 45 ఏళ్లు

ప్రియుడికి 35 ఏళ్లు.... ప్రియురాలికి 45 ఏళ్లు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలోని గధ్రా గ్రామంలో శాంతి (45) అనే మహిళ నివాసం ఉంటున్నది .భర్తను వదిలేసిన శాంతి ఆమె పుట్టింటిలో కొంతకాలం నివాసం ఉండేది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న రామ్ రాజ్ (35) అనే యువకుడితో శాంతి చనువు పెంచుకుని అతనికి దగ్గర అయ్యింది.

 మస్త్ మజా చేసిన ఆంటీ

మస్త్ మజా చేసిన ఆంటీ

ప్రియుడు రామ్ రాజ్ తో శాంతి అక్రమ సంబంధం పెట్టుకునింది. శాంతి, రామ్ రాజ్ ఎవ్వరికి భయపడకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశారు. రామ్ రాజ్, శాంతి అక్రమ సంబంధం గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలిసి ఆమెకు నచ్చచెప్పడానికి అనేకసార్లు ప్రయత్నించారు. అయితే శాంతి ఎవ్వరి మాట వినకపోవడంతో వాళ్లు ఊరికేవుండిపోయారు.

 రోజూ అక్కడికి ఇక్కడికి తిరిగితే టైమ్ వేస్ట్ అనుకుంది

రోజూ అక్కడికి ఇక్కడికి తిరిగితే టైమ్ వేస్ట్ అనుకుంది

రామ్ రాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న శాంతి ఆంటీ అతనితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. రోజు ఆఇంటికి ఈ ఇంటికి ఎందుకు తిరగాలి ? అని ఆలోచించిన శాంతి ఆంటీ ప్రియుడు రామ్ రాజ్ తో కలిసి అతని ఇంటిలో కాపురం పెట్టేసింది. కుటుంబ సభ్యులు శాంతికి రామ్ రాజ్ ఇంటిలో ఉండకూడదని చాలాసార్లు చెప్పి విసిగిపోయారు.

 ఆంటీని కసితీర పొడిచి చంపేసిన పోటుగాడు

ఆంటీని కసితీర పొడిచి చంపేసిన పోటుగాడు

అడిగే దిక్కు కరువు కావడంతో శాంతిది ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. ప్రియుడు రామ్ రాజ్ తనకు సర్వస్వం అంటూ అతని మైకంలో పడిపోయింది. వారం రోజుల క్రితం శాంతికి, ఆమె ప్రియుడు రామ్ రాజ్ కు గొడవ జరిగింది. ఇద్దరు గొడవ పడిన విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రామ్ రాజ్ కత్తి తీసుకుని శాంతిని కసితీర పొడిచేసి చంపేశాడు.

 డౌట్ వస్తుందని ప్రియుడు ఏం చేశాడంటే ?

డౌట్ వస్తుందని ప్రియుడు ఏం చేశాడంటే ?

శాంతి చనిపోవడంతో రామ్ రాజ్ హడలిపోయాడు. శాంతి శవాన్ని బయటకు తరలిస్తే చుట్టుపక్కల వాళ్లు చూస్తారని, తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని రామ్ రాజ్ భయపడ్డాడు. మరుసటి రోజు వరకు శాంతి శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. తరువాత ఇంటికి ఓ వైపులో ఉన్న వంట గది (కిచెన్) లో గోతి తీసి శాంతి శవాన్ని అక్కడే పూడ్చి పెట్టేశాడు.

 ఫ్లోరింగ్ కు నీట్ గా ప్లాస్టింగ్ చేసిన ప్రియుడు

ఫ్లోరింగ్ కు నీట్ గా ప్లాస్టింగ్ చేసిన ప్రియుడు

శాంతి శవాన్ని పూడ్చి పెట్టేసిన తరువాత వేరే గ్రామంలో నివాసం ఉండే ఓ స్నేహితుడిని ఇంటికి పిలుచుకుని వచ్చిన రామ్ రాజ్ సిమెంట్ కలిపి వంట గది ఫ్లోరింగ్ లో నీట్ గా ప్లాస్టింగ్ చేసేశాడు. తరువాత ఫ్లోరింగ్ ఫ్లాస్టింగ్ చేసిన స్నేహితుడికి కొంత డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా రామ్ రాజ్ ఊరిలో తిరగడం మొదలుపెట్టాడు.

 శాంతి నుంచి ఫోన్ రాలేదని అనుమానంతో ?

శాంతి నుంచి ఫోన్ రాలేదని అనుమానంతో ?

శాంతి ఆమె ప్రియుడు రామ్ రాజ్ తో కలిసి ఉన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతోంది. నాలుగు రోజులు అయినా శాంతి నుంచి ఫోన్ రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రామ్ రాజ్ ను ప్రశ్నించారు. శాంతి మా ఇంటికి కూడా రాలేదని, ఎక్కడికి వెళ్లిందో తెలీదని రామ్ రాజ్ చెప్పాడు. శాంతి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి శాంతి కనపడటం లేదని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు.

 పోలీసులకు ఎలాంటి సాక్షం చిక్కలేదు

పోలీసులకు ఎలాంటి సాక్షం చిక్కలేదు

రంగంలోకి దిగిన పోలీసులు మొదట శాంతి ప్రియుడు రామ్ రాజ్ ను ప్రశ్నించారు. శాంతి గురించి తనకు ఏమీ తెలీదని, నాలుగు రోజుల నుంచి మా ఇంటికి కూడా రాలేదని రామ్ రాజ్ చెప్పారు. రామ్ రాజ్ ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వంట గదిలో కొత్తగా ఫ్లోరింగ్ చేసిన విషయం కూడా పోలీసులు గుర్తించని విధంగా రామ్ రాజ్ నీట్ గా ఫ్లోరింగ్ వేసి కప్పిపెట్టేశాడు.

 రంగు మారింది ?, వంటగదికి కొత్తగా పెయిటింగ్ ఎందుకు

రంగు మారింది ?, వంటగదికి కొత్తగా పెయిటింగ్ ఎందుకు

రామ్ రాజ్ ఇంటిలోని అన్ని రూమ్ లకు ఒక రంగు ఉంటే వంటగదికి మాత్రం కొత్తగా పెయింటింగ్ చేశారని ఓ పోలీసులకు అనుమానం వచ్చింది. వంట గదిలో కొత్తగా పెయింటింగ్ చేశారని, ఇంకా పెయింట్ ఆరిపోలేదని, తడిగానే ఉందని పోలీసులు గుర్తించారు. రామ్ రాజ్ ను ఎందుకు వంట గదిలో కొత్తగా పెయింట్ చేశారు ? అంటే అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు.

 బెండ్ తీస్తే నిజం చెప్పిన ప్రియుడు

బెండ్ తీస్తే నిజం చెప్పిన ప్రియుడు

పోలీసులు రామ్ రాజ్ కు బెండ్ తీస్తే ప్రియురాలు శాంతిని చంపేసి వంటగదిలోనే పూడ్చి పెట్టానని రామ్ రాజ్ అంగీకరించాడు. పోలీసులు వంటగదిలో తవ్వి శాంతి శవాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు రామ్ రాజ్ ఆమెను చంపేసి వంట గదిలో పూడ్చి పెట్టాడని వెలుగు చూడటం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.

l

English summary
Illegal affair: Man kills live-in partner, Buries her body in kitchen near Rewa district in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X