• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: నా బిడ్డలకు నా పోలికలు లేవు, మళ్లీ గర్భిణినా ?, భార్య, అత్తా, పిల్లలు హత్య, భార్య శీలంపై ?

|

బెంగళూరు/ మైసూరు: భార్య మీద మొదటి నుంచి భర్తకు అనుమానమే. ఇప్పటికే ఇద్దరు కొడుకులు పుట్టారని, ఒక్కరికి కూడా తన పోలికలు లేవని నిత్యం భర్త అతని భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు. మరోసారి భార్య గర్బవతి కావడంతో తాగుబోతు భర్తకు అతని మీద అతనికే అనుమానం పెరిగిపోయింది, నా భార్యకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అందుకే మూడోసారి గర్బవతి అయ్యిందని ఆమె మీద పగ పెంచుకున్నాడు. భార్య నెలలు నిండిన నిండు గర్భిణి. రెండు మూడు రోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనిస్తుందని ఉదయం వైద్యులు చెప్పారు. రాత్రి పీకలదాక మద్యం సేవించి వెళ్లిన భర్త నీ రంకు మొగుడు ఎవడే ? అంటూ ఇనుప రాడ్ తీసుకుని భార్య, కొడులు, అత్త మీద దాడి చేసి నలుగురిని కిరాతకంగా చంపేశాడు. భార్యతో పాటు రెండు రోజుల్లో నేల మీదపడవలసిన చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

Illegal affair: భర్త విదేశాల్లో, ఆంటీతో ఎంజాయ్, కూతురితో ?, బిగ్ షాట్ కొడుకు లీలలు !Illegal affair: భర్త విదేశాల్లో, ఆంటీతో ఎంజాయ్, కూతురితో ?, బిగ్ షాట్ కొడుకు లీలలు !

ఇద్దరు కొడుకులు

ఇద్దరు కొడుకులు

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హెచ్.డీ. కోటే సమీపంలోని సరగూరు తాలుకా చామేగౌడ హుండి గ్రామంలో మణికంఠ స్వామి (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం మణికంఠ స్వామి, గంగా (28) అనే యువతికి పెళ్లి జరిగింది. మణికంఠ స్వామి, గంగా దంపతులకు సామ్రాట్ (4), రోహిత్ (2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

భార్య శీలం మీద అనుమానం

భార్య శీలం మీద అనుమానం

పెళ్లి జరిగిన ఏడాది నుంచి భార్య గంగా శీలం మీద ఆమె భర్త మణికంఠ స్వామిని అనుమానం ఉండేది. మణికంఠ స్వామి టైలర్ పని చేస్తున్నాడు. ప్రతినిత్యం నువ్వు ఎవరితో తిరిగుతున్నావు ?, నేను బయటకు వెళ్లిన టైమ్ లో ఎవరెవరు ఇంటికి వస్తున్నారు ?, నువ్వు బయట ఎవరెవరిని కలుస్తున్నావు ? అంటూ భార్య శీలం మీద అనుమానంతో ఆమెను చికతబాదేవాడు. భార్య మీద అనుమానం పెరిగిపోవడంతో మణికంఠ స్వామి తాగుడుకు బానిస అయ్యాడు.

నా పోలీకలు అస్సలు లేవు

నా పోలీకలు అస్సలు లేవు

తన కొడుకులు ఇద్దరికి తన పోలికలు ఏమాత్రం లేవని మొదటి నుంచి మణికంఠ స్వామికి అనుమానం ఉందని తెలిసింది. ఈ ఇద్దరు కొడుకులు నాకు పుట్టనవాళ్లేనా ? లేకపోతే ఎవరికి పుట్టారు ? అంటూ రానురాను భర్త మణింకఠ స్వామి భార్య గంగాను చిత్రహింసలకు గురి చేశాడు. పెద్దలు ఎన్నిసార్లు రాజీ చేసినా తాగుబోతు మణింకఠ స్వామికి ఏమాత్రం బుద్దిమారలేదు.

భార్య మూడోసారి గర్బవతి

భార్య మూడోసారి గర్బవతి

భార్య గంగా శీలం మీద అనుమానంతో గొడవలు జరుగుతున్న సమయంలోనే గంగా మూడోసారి గర్బవతి అయ్యింది. ఇక అప్పటి నుంచి రోజూ రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న మణికంఠ లేనిపోని విషయాలు ముందుపెట్టుకుని భార్య గంగాతో నిత్యం గొడవలు పడుతూ ఆమెకు ప్రత్యక్షంగానే నరకం చూపించాడు.

 రెండు మూడు రోజుల్లో డెలవరీ

రెండు మూడు రోజుల్లో డెలవరీ

బుధవారం గంగాను ఆమె తల్లి కెంపాలమ్మ (60) ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి వైద్యపరీక్షలు చేయించింది. నిండు గర్భిణి అయిన గంగాకు రెండుమూడు రోజుల్లో పండంటి బిడ్డపుడుతాడని వైద్యులు చెప్పారు. కాన్పుకు మా కూతురు గంగాను పుట్టింటికి పంపించాలని ఆమె తల్లి కెంపాలమ్మ, తండ్రి అల్లుడు మణికంఠను వేడుకున్నారు.

చస్తే ఇక్కడే చావాలి.... నేను పంపించను

చస్తే ఇక్కడే చావాలి.... నేను పంపించను

నా పెళ్లాం గంగా చస్తే ఇక్కడే చావాలని, నేను మాత్రం పుట్టింటికి పంపించనని మణికంఠ వాళ్లకు తేల్చి చెప్పాడు. కూతురు కాన్ఫు కోసం అయినా ఇక్కడే ఉండాలని నిర్ణయించిన కెంపాలమ్మ కూతురు గంగా ఇంటిలోనే ఉండిపోయింది. రాత్రి పీకలదాక మద్యం సేవించి వెళ్లిన మణికంఠా నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు ? అంటూ భార్య గంగాతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. అర్దరాత్రి వరకు తన భార్య నిండు గర్భిణి అనే విషయం మరిచిపోయిన మణికంఠ మద్యం మత్తులో భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు.

భార్య శీలంపై అనుమానంతో ఐదు హత్యలు

భార్య శీలంపై అనుమానంతో ఐదు హత్యలు

గొడవ పెద్దది కావడంతో ఇంట్లో ఉన్న ఇనుపరాడ్ తీసుకున్న మణికంఠ నిండు గర్భిణి అయిన గంగా, ఇద్దరు కొడుకులు సామ్రాట్, రోహిత్ మీద దాడి చేశాడు. అడ్డువెళ్లిన అత్త కెంపాలమ్మ తల మీద ఇనుపరాడ్ తో దాడి చేశాడు. తీవ్రగాయాలైన భార్య గంగా, ఆమె తల్లి కెంపాలమ్మ, ఇద్దరు కొడుకులు సామ్రాట్, రోహిత్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండు రోజుల్లో నేలమీద పడవలసిన గంగా కడుపులోని బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

తాగుబోతు కొడుక్కి పాపం పండిపోయింది

తాగుబోతు కొడుక్కి పాపం పండిపోయింది


భార్య, ఆమె కడుపులోని బిడ్డను, ఇద్దరు కొడుకులు, అత్తను చంపేసిన మణికంఠ మద్యం మత్తులోనే అతని గూడ్స్ లగేజ్ ఆటో తీసుకుని గ్రామం నుంచి పరారైనాడు. విషయం తెలుసుకున్న గంగా సోదరుడు లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లాక్ డౌన్ కారణంగా వాహనాలు పరిశీలిస్తున్న పోలీసులు భార్య, బిడ్డలు, అత్తను దారుణంగా హత్య చేసిన మణికంఠను అరెస్టు చేసి నరాలు పిండేశారు. అక్రమ సంబంధం అనుమానంతో నిండు గర్భిణి అయిన భార్యతో పాటు కొడుకులు, అత్తను ఒకే సారి చంపేయడం కలకలం రేపింది.

English summary
Illegal affair: Man murders wife, two children and his mother in law near Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X