• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: పాపం పూజారి, సౌండ్ లేకుండా నరికేశారు, కూతురు డిస్కో డ్యాన్స్, తల్లి బ్రేక్ డ్యాన్స్

|

చెన్నై/ విల్లుపురం/ మదురై: భర్తను వదిలేసిన కూతురు ప్రియుడితో కులుకుతుందని తెలుసుకున్న పూజారి ఆవేదన చెందాడు. నువ్వు గుడిలో అందరూ బాగుండాలని పూజలు చేస్తావని, నీ కూతురు మాత్రం పరాయి మగడాని ఇంటికి పిలిపించుకుని సరసాలు ఆడుతుందని, కుమార్తెకు నీ భార్య వంతపాడుతుందని ఊర్లో వాళ్లు ఆ పూజారిని ఆడిపోసుకున్నారు. నువ్వు పూజారి పని చేస్తూ గుడిలో దేవుడికి నైవేద్యం పెడుతుంటే నీ ఇంట్లో పరాయి మగాడికి అమ్మా, కూతురు కలిసి అభిషేకం చేస్తున్నారని మండిపడ్డారు. పరాయి మగాడితో నువ్వు చేస్తున్న పనులు ఏమిటని మందలించిన పాపానికి కూతురు, భార్య చేతిలో పూజారి దారుణ హత్యకు గురైనారు. వంట గదిలోకి పూజారిని లాక్కెళ్లిన అతని భార్య, కూతురు కలిసి కొడవలితో నరికి, కత్తితో పొడిచి సౌండ్ లేకుండా చెంపేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

Criminal wife: భర్తకు బెడ్ రూమ్ స్కెచ్, హత్యకు రూ. లక్షలు డీల్, కెమెరామెన్ గణేష్ తో గాయిత్రి, ష్!

 2017లో కూతురి పెళ్లి

2017లో కూతురి పెళ్లి

తమిళనాడులోని విల్లుపురంలోని వడవంపాళయంలో ధనశేఖరన్ (46), రాజేశ్వరి (42) దంపతులు నివాసం ఉంటున్నారు. ధనశేఖరన్, రాజేశ్వరి దంపతులకు సత్య (21) అనే కుమార్తె ఉంది. 2017వ సంవత్సరంలో తండ్రి ధనశేఖరన్ పుదుచ్చేరీకి చెందిన కుమార్ అనే యువకుడితో కుమార్తె సత్య వివాహం జరిపించాడు.

సంసారాన్ని నాశనం చేసుకున్న సత్య

సంసారాన్ని నాశనం చేసుకున్న సత్య

పెళ్లి జరిగిన తరువాత ఆరు నెలల కూడా సత్య భర్త కుమార్ తో సక్రమంగా కాపురం చెయ్యలేదు. నిత్యం భర్త కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేది. ఇదే సమయంలో సత్య కుటుంబ సభ్యులు, కుమార్ కుటుంబ సభ్యులు అనేకసార్లు పంచాయితీసుల చేశారు. వీరి పంచాయితీలకు భర్త కుమార్ దూరపు బంధువు పుదుచ్చేరిలోని అరియకుప్పంలో నివాసం ఉ:టున్న మురగవేల్ (35) వచ్చి వెళ్లాడు.

 కాన్పూకు పుట్టింటికి వెళ్లి రివర్స్

కాన్పూకు పుట్టింటికి వెళ్లి రివర్స్

భర్త కుమార్ బంధువు మురుగవేల్ తో సత్యకు పరిచయం అయ్యింది. వారి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. తరువాత సత్య గర్బవతి అయ్యింది. కాన్పూకు పుంటింటికి వెలుతున్నానని చెప్పిన సత్య భర్త కుమార్ ఇంటి నుంచి విల్లుపురంలోని ఇంటికి వచ్చేసింది. ఆరు నెలల క్రితం సత్యకు బిడ్డపుట్టింది, భార్య సత్యను ఇంటికి పిలుచుకుని వెళ్లడానికి భర్త కుమార్, అతని తల్లి విల్లుపురంలోని సత్య ఇంటికి వెళ్లారు.

 బయటకు పోరా చెత్తనా మొగుడా

బయటకు పోరా చెత్తనా మొగుడా

అత్తగారింటికి పిలుచుకుని వెళ్లడానికి వచ్చిన భర్త కుమార్ తో పాటు అత్తను చులకనగా మాట్లాడిన సత్య నేను మీ ఇంటికి రాను అంటూ తెగేసి చెప్పింది. భార్య సత్యకు సర్దిచెప్పడానికి కుమార్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలో మా ఇంటి నుంచి బయటకు పోరా చెత్తనా కొడకా అంటూ సత్య భర్త కుమార్ ను, అతని తల్లిని బూతులు తిట్టింది. తరువాత కుమార్ పుదుచ్చేరీలోని ఇంటికి వెళ్లిపోయాడు.

 ప్రియుడు డోర్ డెలవరీ

ప్రియుడు డోర్ డెలవరీ

భర్తకు దూరంగా పుట్టింటిలో ఉంటున్న సత్యను చూడటానికి, ఆమెతో ఎంజాయ్ చెయ్యడానికి ప్రియుడు మురుగవేల్ నేరుగా ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఈ విషయం గుర్తించిన ఊర్లో వాళ్లు పూజారి ధనశేఖరన్ కు చెప్పారు. నువ్వు గుడిలో పూజలు చేస్తుంటే నీ కూతురు సత్య ఇంటికి ప్రియుడిని పిలుపించుకుని అతనికి అభిషేకం చేస్తోందని, నీ భార్య రాజేశ్వరి వారికి రకరకాల వంటలు చేసి నైవేధ్యంగా పెడుతుందని, చూడటానికి మాకే సిగ్గుగా ఉందని, నీకు పరువు పోయిందని అనింపించడం లేదా అని ధనకేఖరన్ మీద మండిపడ్డారు.

 తల్లి బ్యాక్ బోన్ గా ఉందని రెచ్చిపోయిన సత్య

తల్లి బ్యాక్ బోన్ గా ఉందని రెచ్చిపోయిన సత్య

పూజారి ధనశేఖరన్ ఇంటికి వెళ్లి కుమార్తె సత్యపై మండిపడ్డాడు. ఎవడు వాడు ? ఎందుకు వస్తున్నాడు ? భర్త కుమార్ తో నీకు పనిలేనప్పుడు అతని బంధువు మురగవేల్ ఎందుకు ఇంటికి వస్తున్నాడు, పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించాడు. అయితే ప్రియుడు మురుగవేల్ తో తాను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసినా తన తల్లి రాజేశ్వరి ఒక్కమాట కూడా మాట్లాడలేదని తెలుసుకున్న సత్య మరింత రెచ్చిపోయింది. తనకు తల్లి రాజేశ్వరి మద్దతు ఉందని, తండ్రి ధనకేఖర్ మాట ఎందుకు వినాలని సత్య భావించి మరింత రెచ్చిపోయింది. ప్రతిరోజు ధనకేఖరన్ ఇంటిలో కుమార్తె సత్య, భార్య రాజేశ్వరితో గొడవపెట్టుకుంటున్నాడు. ఎలాగైనా తండ్రిని చంపేయాలని సత్య డిసైడ్ అయిపోయింది.

  North Korea ను తాకిన Coronavirus.. Lockdown ప్రకటించిన Kim || Onendia Telugu
   సైలెంట్ గా నరికేసి తల్లి, కూతురు నాటకాలు

  సైలెంట్ గా నరికేసి తల్లి, కూతురు నాటకాలు

  ఈనెల 12వ తేదీన వేకువ జామున ప్లాన్ ప్రకారం ధనశేఖరన్ ను అతని భార్య రాజేశ్వరి, కుమార్తె సత్య కొడవలితో నరికేసి, కత్తిపీటతో గొంతు కోసేసి దారుణంగా చంపేశారు. ప్రియుడు మురగవేల్ ను ఇంటికి పిలుపించుకుని ధనశేఖరన్ శవాన్ని ఇంటి బయటకు తీసుకెళ్లి ఊరి బయట విసేశారు. తరువాత ఇంటిలో ధనకేఖరన్ హత్యకు సంబంధించి ఎలాంటి అనవాళ్లు లేకుండా చేశారు. మొదట పోలీసులు కూడా ధనశేఖరన్ ను ఎవరో హత్య చేశారు అని అనుకున్నారు. అయితే సత్య భర్త కుమార్, ఊరిలోని కొందరు ఇచ్చిన సమాచారం మేరకు సత్య మీద పోలీసులు నిఘా వేశారు. సత్య, మురుగవేల్ అక్రమ సంబంధంతో వారికి అండగా ఉంటున్న రాజేశ్వరి వ్యవహారం బయటకు రావడంతో ముగ్గురికి పోలీసులు బెండ్ తీశారు. అంతే ధనశేఖరన్ ను తామే హత్య చేశామని భార్య రాజేశ్వరి, సత్య, ఆమె ప్రియుడు మురుగవేల్ అంగీకరించారని, ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచామని విల్లుపురం పోలీసులు తెలిపారు.

  English summary
  Illegal affair: Priest murdered by wife and daughter near Villupuram in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X