Doubt: భార్య మీద డౌట్, విడాకులు, భార్య ఇంటికి వెళ్లి అర్దరాత్రి ఏం చేశాడంటే ?, పోలీస్ స్టేషన్ లో!
లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్న భర్త రగిలిపోయాడు. రానురాను గొడవలు ముదిరిపాకానపడ్డాయి. భార్యను పట్టుకుని చితకబాదుతున్న భర్త ఆమెను కొంతాకలం ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు. దంపతులకు బుద్దిమాటలు చెప్పి వారు కలిసి జీవించాలని కోరుకున్న పెద్దలు లెక్కలేనన్నిసార్లు పంచాయితీలు చేశారు.
అయితే దంపతులు విడిపోయి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు, తండ్రి దగ్గర ఉంటున్న పిల్లలు ఆదివారం మాత్రం తల్లి దగ్గరకు వెళ్లి వస్తున్నారు. శనివారం రాత్రి భార్య దగ్గరకు పిల్లలను పిలుచుకుని వెలుతున్న భర్త సోమవారం వారిని అతని ఇంటికి పిలుచుకుని వెలుతున్నాడు. ఎప్పటిలాగే పిల్లలను పిలుచుకుని భార్య ఇంటికి వెళ్లాడు.
అక్కడ సీన్ చూసిన భర్త ఆవేశంతో ఊగిపోయాడు. అదే రోజు అర్దరాత్రి భార్యను చంపేసిన భర్త ఇంటి బయట తాళం వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఇంటి తాళం పోలీస్ స్టేషన్ లోని టేబుల్ మీద పెట్టిన భర్త నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుని నాకు మోసం చేసి నా పరువు తీసిందని, అందుకే ఆమెను చంపేశానని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.
Illegal affair: ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్ భార్యతో వీడు ?, ప్రాణస్నేహితుడి చేతిలో!

మొదట్లో దంపతులు హ్యాపీ
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మోహన్ లాల్ గంజ్ ప్రాంతంలో క్రిష్ణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం క్రిష్ణ సరిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న క్రిష్ణ, సరిత దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. సరిత, క్రిష్ణ దంపతులకు కార్తికేయ (7), లక్ష్మీ (40) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భార్య మీద అనుమానం
కొడుకు, కూతురు పుట్టిన తరువాత క్రిష్ణ, సరిత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య సరిత ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్న ఆమె భర్త క్రిష్ణ రగిలిపోయాడు. రానురాను క్రిష్ణ, సరితల గొడవలు ముదిరిపాకానపడ్డాయి. భార్య సరితను పట్టుకుని చితకబాదుతున్న క్రిష్ణ ఆమెను కొంతాకలం ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు.

విడిపోయిన దంపతులు
సరిత, క్రిష్ణ దంపతులకు బుద్దిమాటలు చెప్పి వారు కలిసి జీవించాలని కోరుకున్న పెద్దలు లెక్కలేనన్నిసార్లు పంచాయితీలు చేశారు. అయితే సరిత, క్రిష్ణ దంపతులు విడిపోయి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు, తండ్రి క్రిస్ణ దగ్గర ఉంటున్న కార్తికేయ, లక్ష్మీ ఆదివారం మాత్రం వాళ్ల తల్లి సరిత ఇంటికి వెళ్లి వస్తున్నారు.

భార్య ఇంట్లో సీన్ చూసి రగిలిపోయాడు
శనివారం రాత్రి భార్య సరిత ఇంటికి పిల్లలను పిలుచుకుని వెలుతున్న క్రిష్ణ సోమవారం వారిని అతని ఇంటికి పిలుచుకుని వెలుతున్నాడు. పిల్లలకు సెలవులు ఉండటంతో వారిని పిలుచుకుని భార్య సరిత ఇంటికి వెళ్లాడు. భార్య సరిత ఇంట్లో సీన్ చూసిన క్రిష్ణ ఆవేశంతో ఊగిపోయాడు. గొడవ జరిగిన కొంతసేపటి తరువాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.

భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏం చెప్పాడంటే?
అదే రోజు అర్దరాత్రి దాటిన తరువాత క్రిష్ణ అతని భార్య సరితో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన క్రిష్ణ అతని భార్య సరితను గొంతు కోసి దారుణంగా చంపేశాడు. భార్య సరితను చంపేసిన క్రిష్ణ ఇంటి బయట తాళం వేసుకుని నేరుగా మోహన్ లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఇంటి తాళం పోలీస్ స్టేషన్ లోని టేబుల్ మీద పెట్టిన క్రిష్ణ నా భార్య సరిత అక్రమ సంబంధం పెట్టుకుని నాకు మోసం చేసి నాకు విడాకులు ఇచ్చి నా పరువు తీసిందని, అందుకే ఆమెను చంపేశానని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.

తల్లి శవం పక్కనే నిద్రపోయిన పిల్లలు
సరిత ఇంటికి వెళ్లి చూడగా ఆమె శవం పక్కనే ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారని, వాళ్లకు తల్లి హత్యకు గురైన విషయం తెలీదని, తరువాత విషయం తెలుసుకుని బోరన విలపించారని లక్నోఈస్ట్ జోన్ అడిషనల్ పోలీసు కమీషనర్ ఖాసీం ఆబిది అన్నారని స్థానిక మీడియా తెలిపింది.