• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ప్రియుడికి స్కూల్ టీచర్ సెక్స్ పాఠాలు, భర్త హత్యకు 5 స్కెచ్ లు, రూ. 10 లక్షలు స్వాహా

|

చెన్నై/ కన్యాకుమారి/ మదురై: ప్రియుడి వ్యామోహంలో కట్టుకన్న భర్తను చంపించడానికి భార్య ప్రయత్నించింది. ప్రియుడు, కిరాయి హంతకుల సహాయంతో భర్తను లేపేయడానికి 5 స్కెచ్ లు వేసిన భార్య పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది. ప్రియుడి మోజులో అతని జల్సాల కోసం భర్త ఇంటిపై హౌసింగ్ లోన్ తీసుకుని ప్రియుడికి రూ. 10 లక్షలు ఇచ్చేసింది. ప్రియుడు నిర్వహిస్తున్న ప్లే స్కూల్ లో టీచర్ గా చేరి అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పకుండా ప్రియుడికి సెక్స్ పాఠాలు చెబుతూ రాసలలీలు సాగించింది. బ్యాంకులో ఎందుకు లోన్ తీసుకున్నావ్ ? ఆ డబ్బులు ఏం చేశావు ? అని భర్త నిలదీసినందుకు రేయ్ నాతోనే పెట్టుకుంటావా ?, నీ అంతూ చూస్తా అంటూ లోలోపల రగిలిపోయిన భార్య ఇంట్లో నిద్రపోతున్న భర్తను చంపడానికి ప్రయత్నించింది.

Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !

 ఫేమస్ ఫోటోగ్రాఫర్

ఫేమస్ ఫోటోగ్రాఫర్

తమిళనాడులోని నాగర్ కోవిల్ జిల్లాలోని వెత్తూర్నిమాడమ్ సమీపంలోని కేశవతిరుపురంలో గణేష్ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గణేష్ కు భార్య గాయిత్రీ (35), ఒక కుమారుడు ఉన్నాడు. గణేష్ ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు. గణేష్ కు సొంత ఇళ్లతో పాటు కొన్ని ఆస్తులు ఉన్నాయి. భార్య గాయిత్రీ అంటే గణేష్ కు చాలా ఇష్టం అని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

 ఇంట్లోనే భర్త హత్యకు కుట్ర

ఇంట్లోనే భర్త హత్యకు కుట్ర

రెండు నెలల క్రితం ఓ రోజు రాత్రి ఇంటిలో గణేష్ మొద్దునిద్రపోతున్నాడు. ఆ రోజురాత్రి బెడ్ మీద నుంచి కిందపడిన గణేష్ తలకు తీవ్రగాయాలైనాయని గాయిత్రీ డ్రామాలు ఆడింది. తీవ్రగాయాలైన గణేష్ ను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. గణేష్ తల మీద, శరీరం మీద ఇనుపరాడ్లతో దాడి చెయ్యడం వలనే తీవ్రగాయాలైనాయని, అతని మీద హత్యాయత్నం జరిగిందని వైద్యులు చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చెయ్యగా గణేష్ కుటుంబ సభ్యులు బిత్తరపోయే విషయాలు వెలుగు చూశాయి.

 మణిరత్నం సినిమా రివర్స్ స్టోరీ

మణిరత్నం సినిమా రివర్స్ స్టోరీ

ప్రముఖ దర్శకుడు మణిరత్నం 20 ఏళ్ల క్రితం తెరకెక్కించిన బొంబాయి సినిమాలో హిందూ హీరోగా అరవిందస్వామి, ముస్లీం యువతిగా మనిషాకోయిరాలా నటించారు. అరవిందస్వామి, మనిషాకోయిరాల ప్రేమ వివాహం చేసుకున్న తరువాత సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. అయితే గాయిత్రీ లవ్ స్టోరీ రివర్స్ లో ఉంది. గాయిత్రీకి పెళ్లి కాకముందే ఆమె కాలేజ్ లో చదివేటప్పుడు మదురైకి చెందిన మహమ్మద్ యాసిన్ అనే ప్రియుడు ఉన్నాడు.

 గాయిత్రీ ఫ్యామిలీ సూపర్ స్కెచ్

గాయిత్రీ ఫ్యామిలీ సూపర్ స్కెచ్

కాలేజ్ లో చదువుతున్న సమయంలో గాయిత్రీ, మహమ్మద్ యూసఫ్ పిచ్చపాటిగా ప్రేమించుకున్నారు. యాసిన్, గాయిత్రీ ఎక్కడపడితే అక్కడ తిరిగి ఎంజాయ్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న గాయిత్రీ కుటుంబ సభ్యులు మా అమ్మాయి మతాంతర వివాహం చేసుకుంటే కష్టాలు ఎదురౌతాయని భయపడ్డారు. అదే సమయంలో పెళ్లి కొడుకు కోసం గాలించగా బకరా లాగా గణేష్ వాళ్లకు చిక్కాడు. గుట్టుచప్పుడు కాకుండా గణేష్, గాయిత్రీల వివాహం చేశారు. గాయిత్రీ, గణేష్ దంపతులకు ఓ కుమారుడు పుట్టినా ఆమె మాత్రం ప్రియుడు యాసిన్ ను మరిచిపోలేకపోయింది. మహమ్మద్ యాసిన్ కు పెళ్లి జరిగి ఓ కుమారుడు ఉన్నాడు.

 ప్రియుడి స్కూల్ లో టీచర్

ప్రియుడి స్కూల్ లో టీచర్

పెళ్లి జరిగిన తరువాత గాయిత్రీ, యాసిన్ కలుసుకునేవాళ్లు. ఇదే సమయంలో గాయిత్రీతో ఎంజాయ్ చెయ్యాలని ఆమె ఇంటి సమీపంలోనే యాసిన్ ప్లేస్కూల్ ప్రారంభించాడు. ప్లేస్కూల్ లో తాను టీచర్ గా ఉద్యోగం చేస్తానని గాయిత్రీ భర్త గణేష్ కు చెప్పడంతో అతను సరే అన్నాడు. ఇక అప్పటి నుంచి ప్లే స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పడం పక్కన పెట్టిన గాయిత్రీ ప్రియుడు యాసిన్ కు సెక్స్ పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ప్లే స్కూల్ లో పిల్లల ఆటలకంటే యాసిన్, గాయిత్రీల రాసలీలల ఆటలు ఎక్కువ కావడంతో ఆ విషయం గణేష్ కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. గణేష్ కుటుంబ సభ్యులతో పాటు గాయిత్రీని ఆమె కుటుంబ సభ్యులు బుద్దిగా ఉండాలని మందలించారు.

 ప్రియుడి కోసం భర్త ఇంటిపై బ్యాంకులో లోన్

ప్రియుడి కోసం భర్త ఇంటిపై బ్యాంకులో లోన్

ప్రియుడు యాసిన్ కు ఆర్థిక సహాయం చెయ్యాలని గాయిత్రీ డిసైడ్ అయ్యింది. ప్లే స్కూల్ నిర్వహణ కోసం, ప్రియుడు ఎంజాయ్ చెయ్యడం కోసం భర్త గణేష్ కు తెలీకుండా ఇంటి పత్రాలు తీసుకెళ్లి బ్యాంకులో రూ. 10 లక్షలు రుణం తీసుకున్న గాయిత్రీ ఆ డబ్బులు ప్రియుడు యాసిన్ కు ఇచ్చేసింది. కొన్ని నెలల పాటు భర్త గణేష్ కు ఇంటి మీద లోన్ ఉందని తెలుసుకుని షాక్ కు గురైనాడు. భార్య గాయిత్రీని నిలదీస్తే లోన్ తీసుకుని మా కుటుంబ సభ్యులకు ఇచ్చానని, వాళ్లు ఆ డబ్బులు తరువాత ఇస్తారని కాలం గడిపింది. ఇదే విషయంలో పెద్దలు పంచాయితీ చెయ్యడంతో యాసిన్ విషయం బయటకు వచ్చింది.

 భర్త హత్య కోసం బిర్యానీలో మత్తుమందు

భర్త హత్య కోసం బిర్యానీలో మత్తుమందు

యాసిన్ విషయం బయటకు రావడంతో ఎలాగైనా భర్త గణేష్ ను చంపేయాలని ఇంతకు ముందే ఐదు సార్లు స్కెచ్ వేసిన భార్య గాయిత్రీ రెండు నెలల క్రితం ఇంట్లో బిర్యానీ చేసింది. అందరితో పాటు కాకుండా భర్త గణేష్ కు పెట్టిన బిర్యానీలో మత్తుమందు కలిపి పెట్టిన గాయిత్రీ అతను రాత్రి నిద్రపోయిన తరువాత యాసిన్, అతని స్నేహితులను ఇంటికి పిలిపించి హత్య చేయించడానికి ప్రయత్నించింది. పోలీసులు కూపీలాగడంతో గాయిత్రీ రంకు బండారం బయటకు వచ్చింది. ఇప్పటికే భార్య గాయిత్రీ, కిరాయి హంతకులు విజయ్ కుమార్, కరుణాకరన్ లను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మహమ్మద్ యాసిన్ ను మదురైలో అరెస్టు చేసిన పోలీసులు అతన్ని నాగర్ కోవిల్ కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు.

English summary
Illegal affair: Tamil Nadu Woman and her paramour arrested in Nagercoil for murder attempt on her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X