• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: భర్త కోటీశ్వరుడు, ఆటో డ్రైవర్ తో ఆంటీ జంప్, ఖర్చుల కోసం రూ. 47 లక్షలు, గోల్డ్ !

|
Google Oneindia TeluguNews

ఇండోర్/ చెన్నై: కోటీశ్వరుడైన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి దంపతులు హ్యాపీగానే ఉన్నారు. భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. దంపతుల ఇంట్లో ఎప్పుడూ భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. ప్రతిరోజూ భార్య స్నేహితులను కలవడానికి బయటకు వెలుతుంటోంది. ఇటీవల కాలంలో భార్య కారు ఇంట్లో పెట్టి ఆటోలో తిరుగుతోందని తెలిసింది. రెండు వారాల క్రితం ఉదయం భర్త వ్యాపారం పని నిమిత్తం బయటకు వెళ్లాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత భార్య కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి భర్త ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్య లేకపోవడంతో ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాడు. భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె కోసం ఆమె ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఆరా తీశాడు. బంధువుల ఇళ్లలో కూడా భార్య లేకపోవడంతో భర్త హడలిపోయాడు. ఇంట్లో బీరువాలో చూసిన భర్త మైండ్ బ్లాక్ అయ్యింది. రెండు రోజుల క్రితం ఇంట్లో పెట్టిన రూ. 47 లక్షల క్యాష్ తో పాటు బంగారు నగలు మాయం కావడంతో భర్త బిత్తర పోయాడు. తన భార్య కనపడటం లేదని, ఇంట్లో ఉన్న రూ. 47 లక్షలు, బంగారం మాయం అయ్యిందని భర్త పోలీసు కేసు పెట్టాడు. రెండు రోజుల తరువాత భార్య ఆమె కంటే 13 ఏళ్లు తక్కువ వయసు ఉన్న ఆటో డ్రైవర్ తో లేచిపోయిందని వెలుగు చూడటం కలకలం రేపింది. ఆ రోజు కుర్రాడితో కలిసి చెక్కేసిన కోటీశ్వరుడి భార్య ఈ రోజు వరకు అడ్రస్ లేదు. రోజూ ఇంటి దగ్గర భార్యను డ్రాప్ చేస్తున్న ఆటో డ్రైవర్ చివరికి నా జీవితంలో లేకుండా పికప్ చేసుకుని వెళ్లిపోయాడని ఆ వ్యాపారి లబోదిబో అంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నాడు.

Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో !Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో !

 కోటీశ్వరుడి హ్యాపీలైఫ్

కోటీశ్వరుడి హ్యాపీలైఫ్

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రియాజ్ వల్లి, రజియా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. కోటీశ్వరుడైన రియాజ్ ను వివాహం చేసుకున్న రజియా (46) ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. రజియా, రియాజ్ వల్లి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి రియాజ్, రజియా దంపతులు హ్యాపీగానే ఉన్నారని వారి బంధువులు అంటున్నారు.

 రియల్ ఎస్టేట్ వ్యాపారం

రియల్ ఎస్టేట్ వ్యాపారం

రియాజ్ వల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న రియాజ్ కోట్లు సంపాధించాడు. రియాజ్, రజియా దంపతుల ఇంట్లో ఎప్పుడూ భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. వ్యాపారం కోసం రియాజ్ ప్రతినిత్యం లక్షల లక్షల డబ్బు (లిక్విడ్ క్యాష్) ఇంట్లోనే పెట్టుకుంటున్నాడని సమాచారం.

 వ్యాపారం కోసం భర్త...... ఫ్రెండ్స్ కోసం భార్య

వ్యాపారం కోసం భర్త...... ఫ్రెండ్స్ కోసం భార్య

ప్రతిరోజూ రియాజ్ వ్యాపారం కోసం బయట తిరుగుతున్నాడు. భర్త రియాజ్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య రజియా కూడా స్నేహితులను కలవడానికి బయటకు వెలుతుంది. బయటకు వెలుతన్న రజియా ఆమె భర్త రియాజ్ ఇంటికి తిరిగి వచ్చే ముందే ఆమె ఇంటికి చేరుకుంటున్నది. కొన్ని సంవత్సరాల నుంచి రియాజ్, రజియా దినచర్యగా మారిపోయిందని సమాచారం.

 ఇంటికి వెళ్లి చూస్తే భార్య మాయం

ఇంటికి వెళ్లి చూస్తే భార్య మాయం

ఇటీవల కాలంలో రజియా కారు ఇంట్లో పెట్టి ఇమ్రాన్ (32) ఆటోలో తిరుగుతోందని తెలిసింది. అక్టోబర్ 13వ తేదీ ఉదయం రియాజ్ వ్యాపారం పని నిమిత్తం బయటకు వెళ్లాడు. భర్త రియాజ్ బయటకు వెళ్లిన రెండు మూడు గంటల తరువాత అతని భార్య రజియా కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే రోజు రాత్రి రియాజ్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్య రజియా కనపడకపోవడంతో రియాజ్ హడలిపోయాడు.

 చేతి ఖర్చుల కోసం రూ. 47 లక్షలతో జంప్

చేతి ఖర్చుల కోసం రూ. 47 లక్షలతో జంప్

ఇంట్లో భార్య రజియా లేకపోవడంతో రియాజ్ ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాడు. భార్య రజియా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రియాజ్ ఆమె ఆచూకి తెలుసుకోవడం కోసం ఆమె ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఆరా తీశాడు. బంధువుల ఇళ్లలో కూడా రజియా లేకపోవడంతో రియాజ్ హడలిపోయాడు. ఇంట్లో బీరువాలో చూసిన రియాజ్ మైండ్ బ్లాక్ అయ్యింది. రెండు రోజుల క్రితం ఇంట్లో పెట్టిన రూ. 47 లక్షల క్యాష్ తో పాటు బంగారు నగలు మాయం కావడంతో రియాజ్ బిత్తర పోయాడు.

 ఆటో డ్రైవర్ కూడా జంప్ జిలాని

ఆటో డ్రైవర్ కూడా జంప్ జిలాని

తన భార్య రజియా కనపడటం లేదని, ఇంట్లో ఉన్న రూ. 47 లక్షలు, బంగారం మాయం అయ్యిందని రియాజ్ ఇండోర్ లో పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు రంగంలోకి దిగి కోటీశ్వురడు రియాజ్ భార్య రజియా కోసం గాలించారు. రెండు రోజుల తరువాత రజియా ఆమె కంటే 13 ఏళ్లు తక్కువ వయసు ఉన్న ఆటో డ్రైవర్ ఇమ్రాన్ (32)తో లేచిపోయిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

 రోజూ డ్రాప్ చేశాడు.... ఆరోజు పికప్ చేసుకుని చెక్కేశాడు

రోజూ డ్రాప్ చేశాడు.... ఆరోజు పికప్ చేసుకుని చెక్కేశాడు

ప్రతిరోజూ బయటకు వెలుతున్న తన భార్య రజియాను ఆటో డ్రైవర్ ఇమ్రాన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంటాడని, ఆ రోజు మాత్రం కేటుగాడు ఆమెను పికప్ చేసకుని వెళ్లిపోయి నా కొంప ముంచేశాడని వ్యాపారవేత్త రియాజ్ లబోదిబో అంటున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి కోటీశ్వురడి భార్య రజియాకు, ఆటో డ్రైవర్ ఇమ్రాన్ కు పరిచయం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 ఆటో డ్రైవర్ ఇంట్లో రూ. 33 లక్షలు స్వాధీనం

ఆటో డ్రైవర్ ఇంట్లో రూ. 33 లక్షలు స్వాధీనం

కోటీశ్వరుడి భార్య రజియాను లేపుకుపోయిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ ఇంటిలో సోదాలు చేసినా పోలీసులకు ఎలాంటి క్లూ చిక్కలేదు. ఇదే సమయంలో ఇమ్రాన్ బెస్ట్ ఫ్రెండ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ స్నేహితుడి ఇంట్లో దాచిపెట్టిన రూ. 33 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ రూ. 33 లక్షలు స్నేహితుడి దగ్గర ఇచ్చి రూ. 14 లక్షలు తీసుకుని ఆంటీతో చెక్కేశాడని వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ లోని

 మొబైల్ ఫోన్ ట్రేస్ చేస్తుంటే జస్ట్ మిస్ !

మొబైల్ ఫోన్ ట్రేస్ చేస్తుంటే జస్ట్ మిస్ !

ఉజ్జయిని, ఖాండ్వా, జవ్రా ప్రాంతాల్లోని మొబైల్ టవర్ల కింద ఆటో డ్రైవర్ ఇమ్రాన్ మొబైల్ ఫోన్ పని చేసిందని, ఆ పరిసర ప్రాంతాల్లోనే వారు తలదాచుకుని ఉంటారని గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఆ రోజు కుర్రాడితో కలిసి చెక్కేసిన కోటీశ్వరుడి భార్య ఈ రోజు వరకు అడ్రస్ లేదు. రోజూ ఇంటి దగ్గర భార్యను డ్రాప్ చేస్తున్న ఆటో డ్రైవర్ చివరికి నా జీవితంలో లేకుండా పికప్ చేసుకుని వెళ్లిపోయాడని ఆ వ్యాపారి లబోదిబో అంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నాడు.

English summary
Illegal affair: The wife of a millionaire man ran away with an auto driver Indore in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X