• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Aunty: ప్రియుడితో ఆంటీ ఎస్కేప్, ప్రియుడికి యముడైన కొడుకు, పక్కాప్లాన్, సినిమా స్కెచ్, ఫినిష్ !

|

ముంబాయి/చెన్నై: సంతోషంగా భర్తతో కాపురం చేసిన భార్యకు ఓ కొడుకు పుట్టాడు. భర్తతో కాపురం చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్న భార్య జీవితంలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. రెండు సంవత్సరాలు ప్రియుడితో అక్రమ సంబంధం సాగించిన భార్య ఆమె కొడుకుని పిలుచుకుని ప్రియుడితో కలిసిపారిపోయింది. 10 సంవత్సరాలు ప్రియుడితో కులికిన మహిళకు రానురాను 70 mm సినిమా కనపడుతూ వచ్చింది. ప్రియుడు పెట్టే చిత్రహింసలతో ఆమె విసిగిపోయింది. ప్రియురాలితో పాటు ఆమె కొడుక్కి అతను నరకం చూపించాడు. తన తల్లి జీవితాన్ని నాశనం చేశాడని కసి పెంచుకున్న ఆ బాలుడు హాలీవుడ్ సినిమాలో లాగా అమ్మ రంకు మొగుడి మీద రగిలిపోయాడు. ఆంటీ ప్రియుడికి ఆమె కొడుకే యముడిగా మారడంతో పోలీసులు హడలిపోయారు.

EX wife: భార్యను పీల్చిపిప్పి చేసిన ప్రియుడు, రసగుల్లా తినిపించిన భర్త, స్వీట్ మసాజ్, రూ. 10 లక్షలు !EX wife: భార్యను పీల్చిపిప్పి చేసిన ప్రియుడు, రసగుల్లా తినిపించిన భర్త, స్వీట్ మసాజ్, రూ. 10 లక్షలు !

17 ఏళ్ల క్రితం పెళ్లి

17 ఏళ్ల క్రితం పెళ్లి

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సంతోష్, రీనా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉండేవాళ్లు. 17 సంవత్సరాల క్రితం సంతోష్, రీనాలకు వివాహం జరిగింది. 14 సంవత్సరాల క్రితం సంతోష్, రీనా దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటున్న రీనా జీవితంలో రాజేష్ అనే యువకుడు ఎంట్రీ ఇచ్చాడు.

ప్రియుడితో ఎస్కేప్

ప్రియుడితో ఎస్కేప్

14 సంవత్సరాల క్రితం రీనా అక్రమ సంబంధం విషయం అతని భర్త సంతోష్ కు తెలిసిపోయింది. తరువాత సంతోష్ భార్య రీనాను పట్టుకుని చితకబాదేశాడు. తరువాత భర్తను వదిలేసి ప్రియుడు రాజేష్ తో కలిసి జీవించాలని రీనా డిసైడ్ అయిపోయింది. 4 సంవత్సరాల వయసు ఉన్న కొడుకుని పిలుచుని రీనా ప్రియుడితో కలిసిపారిపోయింది.

 అక్రమ సంబంధం అంటూ సినిమా చూపించాడు

అక్రమ సంబంధం అంటూ సినిమా చూపించాడు

రీనా, రాజేష్ అహ్మదాబాద్ లోని డాని లిమ్డా ప్రాంతంలో కాపురం పెట్టారు. నువ్వు నాతే వచ్చేస్తే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని నమ్మించి వెంట తీసుకెళ్లిన రీనాకు ఆమె ప్రియుడు రాజేష్ రానురాను నరకం చూపించాడు. రీనా సంపాధించే డబ్బుతో రాజేష్ ఎంజాయ్ చేస్తున్నాడు రాత్రి ఇంటికి వెలుతున్న రాజేష్ నీకు వేరే వాళ్లతో అక్రమ సంబంధం ఉందని రీనాను పట్టుకుని చికతకబాదేస్తున్నాడు. అడ్డు వెళ్లిన రీనా కొడుకుని అతను చితకబాదుతున్నాడు.

 అమ్మ ప్రియుడి హత్యకు కొడుకు స్కెచ్

అమ్మ ప్రియుడి హత్యకు కొడుకు స్కెచ్


మనం ఎక్కడికైనా వెళ్లిపోదామని కొడుకు రీనాకు చాలా కాలం నుంచి చెబుతున్నాడు. అయితే రీనా మాత్రం ఇల్లు వదిలి రావడానికి నిరాకరించిందని తెలిసింది. రోజూ ఇంటికి వచ్చి తన తల్లి రీనాను, తనను చితకబాదేస్తున్న అమ్మ రంకు మొగుడు రాజేష్ ను చంపేయాలని రీనా కొడుకు డిసైడ్ అయ్యాడు.

అమ్మ ప్రియుడికి కొడుకే యముడు

అమ్మ ప్రియుడికి కొడుకే యముడు

రీనా కొడుకు ఓ స్నేహితుడి సహాయంతో షాప్ లో ఓ పదునైన కత్తి తీసుకున్నాడు. ఆ కత్తి బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అమ్మ ప్రియుడు రాజేష్ కు మాయమాటలు చెప్పిన రీనా కొడుకు రాజేష్ ను అతని బైక్ లో అహ్మదాబాద్ లోని బెహ్రాంపూరాలోని కాలికో మిల్ కాంపౌండ్ లోకి పిలుచుకుని వెళ్లాడు. అక్కడ రాజేష్ ను వెనుక నుంచి ఆ బాలుడు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. అమ్మ ప్రియుడు రాజేష్ ప్రాణం పోయిందని నిర్దారించుకున్న తరువాత ఆ బాలుడు రాజేష్ బైక్ తీసుకుని అక్కడి నుంచి పరారైనాడు.

స్టోరీ మొత్తం చెప్పిన కొడుకు

స్టోరీ మొత్తం చెప్పిన కొడుకు


రాజేష్ శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చెయ్యగా రీనా కొడుకు అనుమానాస్పద స్థితిలో తిరగడం గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిని, తనను రాజేష్ రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, అందుకే నేనే అతన్ని చంపేశానని ఆ బాలుడు అంగీకరించాడు. బాలుడి దగ్గర ఉన్న రాజేష్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మ ప్రియుడిని హత్య చేసిన బాలుడిని అరెస్టు చేసి బాలనేరస్తుల కారాగారాని తరలించి కేసు విచారణ చేస్తున్నామని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా తెలిపింది.

English summary
Illegal relationship: A shocking case was reported from Gujarat's Ahmedabad where a 14-year-old boy from Danilimda stabbed and later bludgeoned his mother's boyfriend to death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X