• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: నా భార్యను చంపేస్తే ఎవరిని పెళ్లి చేసుకోవాలి, గూగుల్ వెతికిన దుబాయ్ మొగుడు !

|

బెంగళూరు/దుబాయ్/ఉడిపి: ఇప్పటికే అక్రమ సంబంధం పెట్టుకుని దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న దుబాయ్ మొగుడు అతని భార్యను చంపేసిన తరువాత ఎవరిని పెళ్లి చేసుకోవాలని అంటూ మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో తెగవెతికేశాడు. దుబాయ్ నుంచి ఉడిపి వచ్చిన విశాలను దారుణంగా హత్య చేసిన కాంట్రాక్టు కిల్లర్ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. విశాల భర్త తనకు కిరాయి ఇచ్చి ఆమెను చంపించాడని కాంట్రాక్టు కిల్లర్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఆమె బంధువులు షాక్ అయ్యారు. దుబాయ్ లో మకాం వేసిన ఆంటీ మొగుడు హత్యకు వేరే రాష్ట్రంలోని కిరాయి హంతకులతో స్కెచ్ వేశాడని వెలుగు చూడటంతో బంధువులు హడలిపోయారు. అక్రమ సంబంధం, ఆస్తి విషయంలో, కొత్తగా కాబోయే భార్య మీద మోజుతో కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేయించిన భర్త నాటకాలు ఆడాడు. భర్త క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాంట్రాక్టు కిల్లర్ కూడా చిక్కిపోవడంతో ఇప్పుడు దుబాయ్ మొగుడి ఫ్రెండ్ ఎస్కేప్ అయ్యాడు.

Wife: భర్తతో విడాకులు, మత్తు మందు ఇచ్చి భార్య జ్యూస్ పిండేసిన లాయర్, రెండు యాంగిల్స్ !Wife: భర్తతో విడాకులు, మత్తు మందు ఇచ్చి భార్య జ్యూస్ పిండేసిన లాయర్, రెండు యాంగిల్స్ !

దుబాయ్ నుంచి వచ్చిన భార్య

దుబాయ్ నుంచి వచ్చిన భార్య

కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన రామక్రిష్ణ, విశాల గాణి (40) దంపతులు కూతురితో కలిసి దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. జూన్ నెల 29వ తేదీన విశాల ఆమె కూతురితో కలిసి ఉడిపి చేరుకుంది. సొంత ఊర్లో కాకుండా ఉడిపి జిల్లాలోని బ్రహ్మావర సమీపంలోని ఉప్పికోటే ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లో కూతురితో కలిసి విశాల బసచేసింది.

అపార్ట్ మెంట్ లో లేపేశారు

అపార్ట్ మెంట్ లో లేపేశారు

జులై 12వ తేదీన విశాల బ్యాంకుకు వెళ్లింది. బ్యాంకులో పని ముగించుకుని అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లోకి వెళ్లింది. తరువాత విశాల బయటకు రాలేదు. అదేరోజు అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో విశాల దారుణ హత్యకు గురైయ్యింది. మరుసటి రోజు విశాల హత్యకు గురైన విషయం వెలుగు చూడటం ఉడిపితో పాటు కర్ణాటకలో కలకలం రేపింది.

అత్తారింటికి కూతుర్ని పంపించింది

అత్తారింటికి కూతుర్ని పంపించింది

విశాల హత్యకు గురైన రెండు రోజు ముందు కూతురిని ఆమె భర్త రామక్రిష్ణ తల్లిదండ్రుల దగ్గరకు పంపించింది. దుబాయ్ నుంచి వచ్చిన కొన్ని రోజులకే విశాల హత్యకు గురికావడంతో ఉడిపి ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెలిసినవాళ్లే విశాలను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. విశాల హత్యకు గురి కావడంతో దుబాయ్ లో ఉన్న ఆమె భర్త రామక్రిష్ణ (42) ఉడిపి చేరుకున్నాడు.

నా భార్యను నేనే చంపించాను

నా భార్యను నేనే చంపించాను

భార్య విశాల హత్యకు గురైయ్యిందని ఆమె భర్త రామక్రిష్ణకు ఏమాత్రం ఫీలింగ్ లేదని, రామక్రిష్ణ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. విశాల భర్త రామక్రిష్ణను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో రామక్రిష్ణ షాకింగ్ విషయాలు చెప్పడంతో పోలీసులు, విశాల బంధువులు బిత్తరపోయారు.

కాంట్రాక్టు కిల్లర్ అరెస్టు

కాంట్రాక్టు కిల్లర్ అరెస్టు

విశాలను హత్య చేసిన కాంట్రాక్టు కిల్లర్, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నివాసి స్వామినాథ్ నిషాద్ (38) అనే వ్యక్తిని అరెస్టు చేశామని ఉడిపి జిల్లా ఎస్పీ ఎన్. విష్ణువర్దన్ మీడియాకు చెప్పారు. విశాలను హత్య చెయ్యడానకి ఆమె భర్త రామక్రిష్ణ తనకు రూ. 2 లక్షలు ఇచ్చాడని స్వామినాథ నిషాద్ అంగీకరించాడని ఎస్పీ విష్ణవర్దన్ మీడియాకు చెప్పారు. రామక్రిష్ణ దగ్గర కు రూ. 2 లక్షలు తీసుకుని తానే విశాలను హత్య చేశానని కాంట్రాక్టు కిల్లర్ నిషాద్ స్టేట్ మెంట్ ఇచ్చాడని ఉడిపి జిల్లా ఎస్పీ విష్ణువర్దన్ మీడియాకు చెప్పారు.

మార్చి నెలలో ఉడిపిలో డీల్

మార్చి నెలలో ఉడిపిలో డీల్

దుబాయ్ లో ఉన్న విశాల భర్త రామక్రిష్ణ కొన్ని నెలల నుంచి వేరే మహిళను వివాహం చేసుకోవాలని మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో తెగగాలించాడని విచారణలో వెలుగు చూసిందని ఎస్పీ విష్ణువర్దన్ అన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలో రామక్రిష్ణ ఉడిపిలో ఉన్నాడని, ఆ సమయంలో ఓస్నేహితుడి ద్వారా కాంట్రాక్టు కిల్లర్ స్వామినాథ్ నిషాద్ ను అక్కడికి పిలుపించుకున్నాడని, మార్చి 27వ తేదీన భార్య విశాలను హత్య చెయ్యడానికి రూ. 2 లక్షలు ఇచ్చాడని ఎస్పీ విష్ణువర్దన్ అన్నారు.

పిన్ టూ పిన్ క్లూ ఇచ్చిన భర్త

పిన్ టూ పిన్ క్లూ ఇచ్చిన భర్త

మార్చిలో ఉడిపి సమీపంలోని బ్రహ్మావర్ లో మకాం వేసిన రామక్రిష్ణ తరువాత కాంట్రాక్టు కిల్లర్ ను అతని భార్య విశాలకు పరిచయం చేశాడు. జులై 11వ తేదీన భార్యకు పార్శిల్ ఇవ్వమని చెప్పి కాంట్రాక్టు కిల్లర్ ను విశాల ఉంటున్న అపార్ట్ మెంట్ కు పంపించాడు. భర్త పంపించిన వ్యక్తి దగ్గర విశాల పార్శిల్ తీసుకుంది. జులై 14వ తేదీన మరోసారి పార్శిల్ ఇచ్చే ముసుగులో విశాలను స్వామినాథన్ చార్జింగ్ వైర్ తో హత్య చేయించాడని ఉడిపి జిల్లా ఎస్పీ విష్ణువర్దన్ మీడియాకు చెప్పారు.

భార్యను చంపేస్తే ఎవరిని పెళ్లి చేసుకోవాలి ?

భార్యను చంపేస్తే ఎవరిని పెళ్లి చేసుకోవాలి ?

ఇప్పటికే అక్రమ సంబంధం పెట్టుకుని దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న దుబాయ్ మొగుడు రామక్రిష్ణ అతని భార్య విశాలను చంపేసిన తరువాత ఎవరిని పెళ్లి చేసుకోవాలని అంటూ గత ఫిబ్రవరి నెల నుంచి మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో తెగవెతికేశాడ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రామక్రిష్ణకు కాంట్రాక్టు కిల్లర్ ను పరిచయం చేసిన అతని ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాల హత్య కేసును తొందరగా చేదించి ఆమె భర్తను, కాంట్రాక్టు కిల్లర్ ను అరెస్టు చేసిన పోలీసులకు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ రూ. 50 వేల బహుమానం ప్రకటించి ప్రశంసాపత్రాలు అందించారు.

English summary
Illegal affair: The arrested accused is Swaminath Nishad,38, from Gorakhpur in Uttar Pradesh. He along with another contract killer had allegedly strangled 35-year-old Vishala by using a power cable at her apartment in Udupi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X