• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: 35 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్, ఎయిర్ పోర్టు పక్కన సైలెంట్ గా చంపేసిన వార్డు బాయ్ !

|

ముంబాయి/ చెన్నై: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో మహిళను పరిచయం చేసుకున్న ఆసుపత్రి వార్డు బాయ్ ఆమెకు ఐలవ్ యూ చెప్పాడు. తానూ ఖాళీగానే ఉన్నానని అనుకున్న ఆమె వార్డు బాయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రికి వెళ్లి వస్తున్న మహిళతో వార్డు బాయ్ జల్సా చేశాడు. ఎక్కడ పడితే అక్కడ వార్డుబాయ్ ఆమెతో తిరిగి మస్త్ మజా చేశారు. వార్డుబాయ్, మహిళ అక్రమ సంబంధం విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే చిన్న విషయంలో తేడా వచ్చింది. ప్రియురాలిని నమ్మించి ఎయిర్ పోర్టు సమీపంలోకి పిలిపించిన వార్డు బాయ్ కెటామిన్ మందు, విషం, డ్రగ్స్ కలిపిన ఇంజక్షన్ వేసి ఆమెను సైలెంగా చంపేశాడు. ఆమె మరణించిందా, లేదా అని పూర్తిగా నిర్దారించుకున్న తరువాత ప్రియుడు పరారైనాడు. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో ఒళ్లంతా విషంతో రంగు మారిపోయిన మహిళ మృతదేహం చిక్కడంతో ఇదేమి వ్యాధి దేవుడా అంటూ పోలీసులు హడలిపోయారు.

Lady doctor: బిడ్డ రూ. 16 లక్షలకు డీల్, ఏడాదికి కిలాడీ డాక్టర్ ?, డీఎన్ఏ పరీక్ష, రష్మీ స్కెచ్ !Lady doctor: బిడ్డ రూ. 16 లక్షలకు డీల్, ఏడాదికి కిలాడీ డాక్టర్ ?, డీఎన్ఏ పరీక్ష, రష్మీ స్కెచ్ !

 ఎయిర్ పోర్టు పక్కన మహిళ మృతదేహం

ఎయిర్ పోర్టు పక్కన మహిళ మృతదేహం

మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబాయి నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, కోవిడ్ మరణాల కేసులు పెరిగిపోతున్నాయి. నవీ ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నిర్జనప్రదేశంలో 35 ఏళ్ల మహిళ శవం కనపడటంతో హడలిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 స్టోరీ చెప్పిన సోదరుడు

స్టోరీ చెప్పిన సోదరుడు

పోలీసులు మహిళ మృతదేహం పరిశీలించడంతో వారి మైండ్ బ్లాక్ అయ్యింది. కరోనాతో ఆమె చనిపోలేదని, ఇదేదో కొత్త వ్యాధిలాగా ఉందని, అందుకే శరీరం రంగు పూర్తిగా మారిపోయిందని పోలీసులు ఆందోళన చెందారు. మహిళ శరీరంలోకి విషయం ఇంజెక్షన్ వెయ్యడంతో ఆమె చనిపోయిందని వెలుగు చూసింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన మహిళ ఫోటోలను పల్వేల్, నానోషి ప్రాంతాల్లో పంచిపెట్టారు. ఆ సమయంలో ఓ వక్తి వచ్చి ఆమె నా సోదరి అంటూ పర్వేల్ పోలీసులకు ఓ స్టోరీ చెప్పాడు.

 వార్డు బాయ్ తో లవ్ స్టోరీ

వార్డు బాయ్ తో లవ్ స్టోరీ

మరణించిన తన సోదరి అని ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. తన సోదరి రియా (పేరు మార్చడం జరిగింది) అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటుందని అతను పోలీసులకు చెప్పాడు. ఆసుపత్రిలో వార్డు బాయ్ గా పని చేసే చంద్రకాంత్ గైకర్ (35) అనే వ్యక్తితో నా సోదరి రియా అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె సోదరుడు పోలీసులకు చెప్పాడు.

 ఎంజాయ్ చేసిన వార్డు బాయ్

ఎంజాయ్ చేసిన వార్డు బాయ్

రియా చూడటానికి ఎర్రగా, లావుగా, పొడవుగా ఉంటుంది, ఆసుపత్రికి వెళ్లి వచ్చే సమయంలో వార్డు బాయ్ చంద్రకాంత్ తో రియాకు పరిచయం అయ్యింది. ఆ సమయంలో రియాను వలలో వేసుకున్న చంద్రకాంత్ ఆమెతో సుమారు 9 నెలల నుంచి పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చంద్రకాంత్ తో రియా తిరుగుతోందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసినా వారు మాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

 ఆ ఒక్క విషయానికి చంపేయాలని స్కెచ్

ఆ ఒక్క విషయానికి చంపేయాలని స్కెచ్

ప్రియుడు చంద్రకాంత్ తో కొన్ని నెలల నుంచి ఎంజాయ్ చేస్తున్న రియా తన ప్రియుడిని పెల్లి చేసుకుని రోజూ స్వర్గం చూడాలని డిసైడ్ అయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలని రియా ఆమె ప్రియుడు చంద్రకాంత్ మీద ఒత్తిడి చెయ్యడం మొదలుపెట్టింది. చంద్రకాంత్ కు అంతకు ముందే పెళ్లి జరిగింది. రియాకు కూడా పెళ్లి జరిగి భర్త లేడని చంద్రకాంత్ కు తెలిసింది. పెళ్లి విషయం తెరమరుగు కావాలంటే రియాను చంపేయాలని చంద్రకాంత్ డిసైడ్ అయ్యాడు.

 విషం, డ్రగ్స్ తో ఇంజక్షన్..... ప్రియురాలు ఫినిష్

విషం, డ్రగ్స్ తో ఇంజక్షన్..... ప్రియురాలు ఫినిష్

నీ జబ్బులు తగ్గిపోవడానికి వైద్యుల దగ్గర మంచి ఇంజెక్షన్ లు, మందులు తెప్పించానని, నువ్వు వస్తే వాటిని ఇస్తానని చంద్రకాంత్ అతని ప్రియురాలు రియాకు ఫోన్ చేసి చెప్పాడు. పక్కా స్కెచ్ ప్రకారం ఎయిర్ పోర్టు సమీపంలోని నిర్జనప్రదేశంలోకి పిలిపించుకున్న చంద్రకాంత్ ఆమెతో గంటపాటు ఎంజాయ్ చేశాడు. తరువాత ఆమెకు డ్రగ్స్, విషం, కెటామిన్ మందు మిక్స్ చేసిన ఇంజెక్షన్ వేసి ఆమెను చంపేశాడు. ప్రియురాలు చనిపోయిందా, లేదా ? అని ఆమె చెయ్యిపట్టుకుని నాడి పరిశీలించిన చంద్రకాంత్ అక్కడి నుంచి పరారైనాడు.

 చంద్రకాంత్ తో ఒక్కరేనా ? ఇంకా ఉన్నారా

చంద్రకాంత్ తో ఒక్కరేనా ? ఇంకా ఉన్నారా

మొదట చంద్రకాంత్ తాను రియాను హత్య చెయ్యలేదని అమాయకంగా నాటకాలు ఆడాడని, రెండుసార్లు బెండ్ తియ్యడంతో చంద్రకాంత్ తాను విషం కలిపిన ఇంజెక్షన్ వేసి ప్రియురాలిని హత్య చేశానని అంగీకరించాడని పన్వేల్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అజయ్ కుమార్ ల్యాండ్గే స్థానిక మీడియాకు చెప్పారు. జూన్ 5వ తేదీ వరకు తమ కస్టడీకి ఇచ్చారని, అతను ఇంతకు ముందు ఇలాగే ఎవరినైనా ఇలాగే హత్య చేశాడా అని విచారణ చేస్తున్నామని ఇన్స్ పెక్టర్ అజయ్ కుమార్ మీడియాకు చెప్పారు.

English summary
Illegal affair: The Panvel City police arrested a ward boy on Monday for killing his 35-year-old girlfriend by injecting her with Ketamine and other drugs. The police said she insisted on marrying him, but as she was suffering from a terminal disease, the accused didn’t want to marry her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X