• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: రెండో భార్య మీద డబుల్ డౌట్, నాటుకోడిలో విషం కలిపిన భార్య, పక్కింటోడు !

|

చెన్నై/వేలూరు/ చిత్తూరు: మొదటి భార్యతో కాపురం చేసిన వ్యక్తి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేసి మరో ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. 58 ఏళ్ల వయసులో ఉన్న భర్తకు అతని రెండో భార్య మీద అనుమానం వచ్చింది. తనకు తన భార్యకు 13 సంవత్సరాలు తేడా ఉందని, అందుకే తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త రగిలిపోయాడు. భార్య అక్రమ సంబంధం విషయంలో గొడవపడుతున్న భర్త ఆమెను ప్రతిరోజు చితకబాదేస్తున్నాడు. భర్త టార్చర్ తట్టుకోలేని భార్య అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యింది. మంచి నాటుకోడి కూర చేసిన భార్య అందులో విషం కలిపి భర్తకు పెట్టింది. భర్తతో పాటు పక్కింటిలో నివాసం ఉంటున్న అతని బంధువు కూడా నాటుకోడి కూర తినడంతో ఆసుపత్రిపాలైనారు. భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. విషం కలిపిన ఆహారం తిన్న బంధువు ఇప్పుడు ఆసుపత్రిలో యముడితో పోరాటం చేస్తున్నాడు.

Illegal affair: కత్తిలాంటి పెళ్లానికి కన్నింగ్ బుద్ది, భర్తను చంపేస్తే అతని ఉద్యోగం, ప్రియుడు ఫ్రీ !Illegal affair: కత్తిలాంటి పెళ్లానికి కన్నింగ్ బుద్ది, భర్తను చంపేస్తే అతని ఉద్యోగం, ప్రియుడు ఫ్రీ !

 మొదటి భార్య చనిపోయింది

మొదటి భార్య చనిపోయింది

తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని వేలూరు జిల్లా (తమిళనాడు)లోని ఆనకట్టు సమీపంలో అగరం పుత్తమనై గ్రామంలో సూరిముత్తు (58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సూరిముత్తుకు గతంలో వివాహం కావడంతో ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. అనారోగ్య కారణంగా సూరిముత్తు భార్య 14 సంవత్సరాల క్రితం మరణించింది.

రెండో భార్యతో కాపురం

రెండో భార్యతో కాపురం

మొదటి భార్య చనిపోయిన సంవత్సరం తరువాత సొంతంగా వ్యవసాయం చేస్తున్న సూరిముత్తు మరో ఆమెను వివాహం చేుకోవాలని అనుకున్నాడు. 12 సంవత్సరాల క్రితం సూరిముత్తు నిర్మల (45) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. సూరిమత్తు, నిర్మలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూరిముత్తు మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు, రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రెండో భార్య మీద అనుమానం

రెండో భార్య మీద అనుమానం


మూడు సంవత్సరాల నుంచి రెండో భార్య నిర్మలా మీద ఆమె భర్త సూరిమత్తుకు అనుమానం పెరిగిపోయింది. 58 ఏళ్ల వయసులో ఉన్న సూరిముత్తుకు అతని రెండో భార్య నిర్మలా మీద అనుమానం వచ్చింది. తనకు తన రెండో భార్య నిర్మలాకు 13 సంవత్సరాలు తేడా ఉందని, అందుకే తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త సూరిముత్తు రగిలిపోయాడు.

 బెండ్ తీస్తున్న భర్త

బెండ్ తీస్తున్న భర్త

రెండో భార్య నిర్మలా అక్రమ సంబంధం విషయంలో గొడవపడుతున్న భర్త సూరిముత్తు ఆమెను ప్రతిరోజు చితకబాదేస్తున్నాడు. కుటుంబ సభ్యులు, పిల్లలు బంధువులు ఎంత నచ్చచెప్పినా సూరిముత్తు మాత్రం ఆమె భార్య నిర్మలాను బెండ్ తీస్తున్నాడు. భర్త సూరిముత్తు టార్చర్ తట్టుకోలేని భార్య నిర్మలా అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యింది.

నాటుకోడి కూరలో విషం మిక్స్

నాటుకోడి కూరలో విషం మిక్స్


ఇంట్లో భార్య నిర్మలాతో గొడవపడిన సూరిముత్తు ఆమెను చితకబాది అక్కడి నుంచి పొలంలోకి వెళ్లిపోయాడు. మద్యాహ్నం నాటుకోడి కోసి వంట చేసిన నిర్మలా అందులో విషం కలిపి ఆ భోజనం తీసుకుని పొలం దగ్గరకు వెళ్లి భర్త సూరిముత్తుకు ఇచ్చింది. పొలం దగ్గర సూరిముత్తుతో పాటు అక్కడే పని చేస్తున్న అతని చిన్నమ్మ కొడుకు కందరాజ్ విషం కలిపిన నాటుకోడితో పాటు నిర్మలా తీసుకెళ్లిన ఆ భోజనం తిన్నారు.

 మొగుడు ఔట్.... ఐసీయూలో పక్కింటోడు

మొగుడు ఔట్.... ఐసీయూలో పక్కింటోడు


భోజనం చేస్తున్న సమయంలో కూర చేదుగా ఉందని అనుమానం రావడంతో సూరిముత్తు, కందరాజ్ పక్క పొలంలో ఉన్న వారికి పిలిచి ఆ భోజనం తినాలని చెప్పారు. కూరలో ఏదో తేడా ఉందని పక్క పొలం వాళ్లు చెబుతున్న సమయంలో సూరిముత్తు, అతని సోదరుడు కందరాజ్ వాంతులు చేసుకుని అప్పటికే శరీరంలోకి విషం చేరిపోవడంతో కుప్పకూలిపోయారు. వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సూరిముత్తు ప్రాణాలు పోవడంతో అతని సోదరుడు కందరాజ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

టార్చర్ తట్టుకోలేకపోయాను.... అతను తింటాడునుకోలేదు

టార్చర్ తట్టుకోలేకపోయాను.... అతను తింటాడునుకోలేదు

భోజనం చేసిన నిర్మలాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నేనే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని తన భర్త సూరిముత్తు నిత్యం తనను చితకబాది టార్చర్ పెడుతున్నాడని. అందుకే భోజనంలో విషయం కలిపానని, ఆ భోజనం కందరాజ్ తింటాడు అని నేను ఊహించలేదని నిర్మలా పోలీసులకు చెప్పింది.

 ఆంధ్రా బార్డర్ లో హాట్ టాపిక్

ఆంధ్రా బార్డర్ లో హాట్ టాపిక్

నిర్మలాను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధం గురించి ప్రశ్నించిన భర్త సూరిముత్తుకు భోజనంలో విషం కలిపి పెట్టడం చిత్తూరు- వేలూరు సరిహద్దులో హాట్ టాపిక్ అయ్యింది. రెండో భార్య నిర్మలా మీద అనుమానంతో ఆమెను టార్చర్ పెట్టడం వనే సూరిముత్తు భార్య చేతిలోనే హత్యకు గురైనాడని వేలూరు జిల్లా పోలీసులు అంటున్నారు.


నిర్మలా, సూరిముత్తు దంపతుల గొడవ కారణంగా విషం కలిపిన కోడి కూర తినేసిన కందరాజ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు అంటున్నారు. కందరాజ్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని అతని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద దంపతుల గొడవతో పక్కింటోడి ప్రాణం మీదకు రావడంతో ఆ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

English summary
Illegal affair: Wife killed husband near Vellore in Tamil Nadu and arrested near Chittoor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X