• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: 9 నెలలకు ఇంటికి వెళ్లిన భర్త, చేతిలో బిడ్డను పెట్టిన భార్య, ఇత్తడి బిందె, ఆస్తికలు !

|

చెన్నై/ మదురై/ కల్లకురిచి: కాంట్రాక్టు పనులపై బెంగళూరు వెళ్లిన భర్త కొన్ని నెలల తరువాత ఇంటికి తిరిగి వెళ్లే సరికి భార్య ఆయన చేతిలో బిడ్డను పెట్టింది. షాక్ కు గురైన భర్త ఆరా తియ్యగా భార్య అక్రమ సంబంధం బయటపడింది. తన భార్యకు పుట్టిన బిడ్డకు తన పోలికలు ఏమాత్రం లేవని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై దంపతుల మద్య గొడవలు పెద్దవి అయ్యాయి. భార్య, ఆమె ప్రియుడు కలిసి పక్కాప్లాన్ ప్రకారం భర్తను ఇత్తడి బిందెతో చంపేశారు. శవం కూడా చిక్కకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి అస్తికలు కూడా నదిలో కలిపేసి సాక్షాలు మొత్తం పంచభూతాల్లో కలిపేసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. అయితే ఎక్కడో తేడా రావడంతో అందరూ అడ్డంగా బుక్కైపోయారు.

Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!

 భర్త కాంట్రాక్టర్

భర్త కాంట్రాక్టర్

తమిళనాడులోని కల్లకురిచి జిల్లా ఉలుండూర్ పేట్ సమీపంలోని అత్తూరు గ్రామానికి చెందిన బాలమురుగన్ కొన్ని సంవత్సరాల క్రితం మణిమగలై అనే యువతిని వివాహం చేసుకున్నాడు. బాలమురుగన్, మణిమగలై దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాలమురుగన్ చిన్నచిన్న కాంట్రాక్టు పనులు తీసుకుని కూలీల పెట్టి వారి దగ్గర భవన నిర్మాణం పనులు చేయిస్తున్నాడు.

 బెంగళూరులో కాంట్రాక్టు పని

బెంగళూరులో కాంట్రాక్టు పని

బెంగళూరులో తెలిసిన వ్యక్తి వలన బాలమురుగన్ కు భవన నిర్మాణ కాంట్రాక్టు పని వచ్చింది. భార్య మణిమగలై, ఇద్దరు కుమార్తెలను గ్రామంలో వదిలిపెట్టిన బాలమురుగన్ బెంగళూరు వెళ్లాడు. కొన్ని నెలల తరువాత బెంగళూరులో కాంట్రాక్టు పని పూర్తికావడంతో బాలమురుగన్ 8 నెలల తరువాత సొంత గ్రామానికి వెళ్లాడు. నీ భార్య 9 నెలల గర్బవతి అని, ఆమె ముండియంబక్కం ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో కాన్ఫు కోసం చికిత్స పొందుతున్నదని బంధువులు సమాచారం ఇవ్వడంతో షాక్ కు గురైనాడు.

 బిడ్డకు నా పోలికలు లేవు.... ఏం చెయ్యాలి ?

బిడ్డకు నా పోలికలు లేవు.... ఏం చెయ్యాలి ?

నీ భార్య మణిమగలైకి, నీ సమీప బంధువు మణికందన్ కు అక్రమ సంబంధం ఉందని, నువ్వు ఊర్లో లేని సమయంలో ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తెగతిరిగేశారని గ్రామంలోని చాలా మంది బాలమురుగన్ కు చెప్పారు. భార్య మణిమగలైకి పుట్టిన బిడ్డకు తన పోలికలు ఏమాత్రం లేవని బాలమురుగన్ కు అనుమానం ఎక్కువ అయ్యింది. ఈ బిడ్డ నా బిడ్డకాదని, నేను ఆ బిడ్డను పెంచడానికి అంగీకరించనని చెప్పిన బాలమురుగన్ భార్య మణిమగలైకు తేల్చి చెప్పి వెళ్లిపోయాడు. ఆరు నెలల క్రితం భార్యతో గొడవపడిన బాలమురుగన్ తరువాత ఎవ్వరికీ కనపడలేదు. ఇన్ని రోజులు బాలమురుగన్ బెంగళూరులో మళ్లీ పనులు చెయ్యడానికి వెళ్లి ఉంటాడని అతని బంధువులు అనుకున్నారు.

మా బావ కనపడటం లేదు

మా బావ కనపడటం లేదు

బాలమురుగన్ సోదరి, ఆమె భర్త గోవిందరాజ్ తిరుకోవిల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బాలమురుగన్ గత ఐదు నెలల నుంచి కనపడకపోవడంతో అతని బావ గోవిందరాజ్ కు అనుమానం వచ్చి తిరునవూర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి విచారణ చేశారు. బాలమురుగన్ కనపడలేదని అతని భార్య మణిమగలై ఏమాత్రం చింతలేదని, ఆమె సంతోషంగా ఉందని వెలుగు చూసింది.

ఏమో... నాకేం తెలుసు ?

ఏమో... నాకేం తెలుసు ?

పోలీసుల విచారణలో మణిమగలై, మణికందన్ ల అక్రమ సంబంధం బయటపడింది. పోలీసులు బాలమురుగన్ ఎక్కడ అని అతని భార్య మణిమగలైని విచారణ చెయ్యగా ఏమో ? నాకేం తెలుసు ? ఎక్కడ ఉన్నాడో ? ఏం చేస్తున్నాడో ? తెలీదు అంటూ నాటకం ఆడింది. అయితే పోలీసులు బాలమురుగన్ భార్య మణిమగలై, ఆమె ప్రియుడు మణికందన్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

  North Korea ను తాకిన Coronavirus.. Lockdown ప్రకటించిన Kim || Onendia Telugu
   ఇత్తడి బిందెతో చంపి పంచభూతాల్లో కలిపేశారు

  ఇత్తడి బిందెతో చంపి పంచభూతాల్లో కలిపేశారు

  బాలమురుగన్ మా అక్రమ సంబంధానికి అడ్డుపడుతాడని భయంతో భర్తను చంపేయాలని అతని భార్య ప్రియుడు మణికందన్ కు చెప్పింది. ఐదు నెలల క్రితం కొలను దగ్గర నీళ్లు పట్టుకోవడానికి ఇత్దడి బిందె తీసుకుని బాలమురుగన్ వెళ్లాడని, అదే టైమ్ లో అతని బిందె, సుత్తి తీసుకుని అతని తల మీద దాడి చేసి కొలనులో ముంచి చంపేశామని మణికందన్ అంగీకరించాడు. తరువాత మణికందన్, అతని సోదరుడు ధనశేఖర్ కలిసి బాలమురుగన్ శవం సంచిలో మూటకట్టి బైక్ లో తీసుకుని వెళ్లి స్మశానంలో పెట్రోల్ పోసి నిప్పంటించి బూడిద చేశామని అంగీకరించారు. శవం పూర్తిగా కాలిపోయిన తరువాత పెద్దపెద్ద ఎముకలను రాళ్లుతో పొడిచేసి ఆ అస్తికలు, బూడిద తీసుకెళ్లి నదిలో కలిపేశామన భార్య మణిమగలై, ఆమె ప్రియుడు మణికందన్ అంగీకరించారు. మణిమగలై, ఆమె ప్రియుడు మణికందన్, అతని సోదరుడు ధనశేఖర్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

  English summary
  Kallakurichi: Wife murdered her husband because of her illegal relationship. Police arrested wife, paramour and his brother.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X