Illegal affair: టక్కులాడి భార్య, టెక్కీ ప్రియుడు, భర్తను చంపేసి శవాన్ని కారు డిక్కీలో వేసి నేరుగా !
భోపాల్/ బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భర్త ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నారు. పగలు మొత్తం ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్య తన కంటే వయసులో చిన్నవాడైన సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో పరిచయం పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. విషయం తెలుసుకున్న భర్త అతని భార్య అక్రమ సంబంధాన్ని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే భర్త ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న భార్య ఆమె టెక్కీ ప్రియుడితో మస్త్ మజా చేసింది. రానురాను తన భర్త తన సంతోషానికి అడ్డుపడుతున్నాడని ఆగ్రహంతో ఊగిపోయిన భార్య ఆమె టెక్కీ ప్రియుడి సహాయంతో బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తకు పెట్టి చంపేసింది. భర్త శవాన్ని మాయం చెయ్యడానికి అతని భార్య అనేక రకాలుగా ప్రయత్నించింది. చివరికి భర్త శవాన్ని గోనె సంచిలో మూటకట్టుకుని కారు డిక్కీలో వేసుకుని ప్రియుడితో కలిసి భార్య పోలీస్ స్టేషన్ చేరుకోవడం కలకలం రేపింది.
Illegal affair: భర్త లేడు, నాటుకోడి లేడీతో మేస్త్రీ మస్త్ మజా, చంపేసి శవం పక్కన నిద్రపోయి !

సంతోషంగా కాలం గడిపిన దంపతులు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కటారా హిల్స్ ప్రాంతంలో ధనరాజ్ మీనా (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ధనరాజ్ మీనా ఇంట్లో చూపించిన సంగీతా మీనా (34) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ధనరాజ్ మీనా, సంగీతా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్య
వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల పాటు సంగీతా ఆమె భర్త ధనరాజ్ మీనాతో చాలా హ్యాపీగా సినిమాలు, షికార్లకు తిరిగింది. సంగీతా మీనా భర్త ధనరాజ్ మీనా ప్రతిరోజూ ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నారు. సంగీతా మీనా పగలు మొత్తం ఇంట్లో ఖాళీగా ఉంటున్నది. భర్త ధనరాజ్ మీనా ఇంట్లో లేని సమయంలో సంగీతా మీనా బుద్ది మారిపోయింది.

టక్కులాడి మేడమ్ కు టెక్కీ ప్రియుడు
భోపాల్ లోని కటారా హిల్స్ ప్రాంతంలోని సాగర్ గోల్డెన్ పార్క్ కాలనీలో ఆశిష్ పాండే (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆశిష్ పాండ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం సంగీతా మీనా, టెక్కీ ఆశిష్ పాండేకి పరిచయం అయ్యింది. ఆశిష్ పాండే, సంగీతా మీనా ఫోన్లు నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

వర్క్ ఫ్రమ్ మేడమ్ ఇల్లు
కరోనా వైరస్ పుణ్యామా అంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇంటి దగ్గరే ఉంటున్న ఆశిష్ పాండే గ్యాప్ చిక్కిప్పుడు సంగీతా మీనా ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో తనకంటే వయసులో చిన్నవాడైన ఆశిష్ పాండేతో సంగీతా మీనా అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ధనరాజ్ మీనా బయటకు వెళ్లడం ఆలస్యం వెంటనే ప్రియుడు ఆశిష్ పాండేని ఇంటికి పిలిపించుకుంటున్న సంగీతా మీనా అతనితో ఎంజాయ్ చేసింది.

టామ్ టామ్ అయిపోయింది.... అడ్డుకున్న భర్త
సంగీతా మీనా, ఆశిష్ పాండే అక్రమ సంబంధం గురించి స్థానికులు తెలిసి టామ్ టామ్ అయిపోయింది. భార్య సంగీతా మీనా అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ఆమె భర్త ధనరాజ్ కోపంతో రగిలిపోయాడు. భార్య సంగీతా మీనా, ఆశిష్ పాండే అక్రమ సంబంధాన్ని అడ్డుకోవడానికి ధనరాజ్ మీనా అనేక ప్రయత్నాలు చేశాడు.

భర్త ఎత్తులకు భార్య పైఎత్తులు
భర్త ధనరాజ్ మీనా అతని భార్య సంగీతా మీనాను కట్టడి చెయ్యడానికి ఇప్పటి వరకు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే భర్త ధనరాజ్ మీనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న అతని భార్య సంగీతా మీనా ఆమె టెక్కీ ప్రియుడు ఆశిస్ పాండేతో కలిసి వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మస్త్ మజా చేస్తూ వచ్చింది.

నిద్రమాత్రలు మిక్స్ చేసి భర్తను సుత్తితో కోట్టి చంపేసిన భార్య
రానురాను తన భర్త ధనరాజ్ తన సంతోషానికి అడ్డుపడుతున్నాడని ఆగ్రహంతో ఊగిపోయిన అతని భార్య సంగీతా మీనా ఆమె టెక్కీ ప్రియుడు ఆశిష్ పాండే సహాయంతో బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తకు పెట్టింది. తరువాత సంగీతా మీనా, ఆమె ప్రియుడు ఆశిష్ పాండే కలిసి సుత్తి, కర్రలు తీసుకుని నిద్రమత్తులో ఉన్న ధనరాజ్ మీనా తల మీద చితకబాదేసి అతన్ని ఇంట్లోనే చంపేశారు.

భర్త శవం కారు డిక్కీలో వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భార్య
భర్త ధనరాజ్ మీనా శవాన్ని మాయం చెయ్యడానికి అతని భార్య సంగీతా మీనా, ఆమె ప్రియుడు ఆశిష్ పాండే అనేక రకాలుగా ప్రయత్నించారు. కచ్చితంగా పోలీసులకు చిక్కిపోతామని సంగీతా మీనా, ఆమె ప్రియుడు ఆశిష్ పాండే అనుకున్నారని, తరువాత శవాన్ని గోనె సంచిలో మూటకట్టి కారు డిక్కీలో వేసుకుని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారని సీనియర్ పోలీసు అధికారి రాజేష్ భడోరియా స్థానిక మీడియాకు చెప్పారు. టెక్కి ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను అతని భార్య దారుణంగా హత్య చేసిందని వెలుగు చూడటం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.