
Illegal affair: బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను స్పాట్ లో చంపేసింది!
ముంబాయి/ శివాజీనగర్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో భార్య ఉద్యోగం చెయ్యడానికి వెళ్లింది. తనతో పాటు పని చేస్తున్న వ్యక్తితో ఆమె చనువుపెంచుకుంది. రానురాను చనువు పెరిగిపోవడం, ఒకే చోట పని చేస్తుండటంతో ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న భార్య ఎప్పుడుపడితే అప్పుడు బయటకు వెళ్లి వస్తుండటంతో దంపతుల మద్య గొడవలు ఇంకా పెద్దవి అయ్యాయి.
ఇంతకాలం పెద్దలు దంపతులకు సర్దిచెబుతూ వస్తున్నారు. ఊరికి వెళ్లిన భర్త అర్దరాత్రి దాటిన తరువాత ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బెడ్ రూమ్ లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య ఆమె భర్తకు అడ్డంగా చిక్కిపోయింది. ఆ సమయంలో గొడవ పెద్దది కావడంతో భార్య, ఆమె ప్రియుడు కలిసి కత్తులతో భర్తను దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది.

కొంతకాలం హ్యాపీ
ముంబాయిలోని శివాజీనగర్ లో జమీల్ ఖాన్ అకా షంషేర్ అలియాస్ జమీల్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నజీరా (32) అనే యువతిని జమీల్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న జమీల్, నజీరా దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. జమీల్, నజీరా దంపతులకు రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు.

భార్యను నిర్లక్షం చేసిన భర్త
కొడుకు పుట్టిన తరువాత జమీర్, నజీరా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో జమీల్ పనిపాట చెయ్యకుండా నిర్లక్షం చెయ్యడంతో బిడ్డను పోషించలేక నజీనా ఇబ్బందులు ఎదుర్కొనిందని తెలిసింది. గత ఏడాది నజీరా శివాజీనగర్ సమీపంలో ఉద్యోగంలో చేరి జీతం తీసుకుంటూ ఆమె బిడ్డను పోషించుకుంటున్నది.

పనిచేసే చోట ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిన నజీరా తనతో పాటు పని చేస్తున్న సద్రే ఆలం అలియాస్ ఆలం (35) అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. రానురాను నజీరా సాటి ఉద్యోగి ఆలంతో చనువుపెంచుకుంది. నజీరా, ఆలంలకు ఎక్కువ చనువు పెరిగిపోవడం, ఒకే చోట పని చేస్తుండటంతో ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు.

భర్తకు మ్యాటర్ లీక్
ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న నజీరా ఎప్పుడుపడితే అప్పుడు బయటకు వెళ్లి వస్తుండటంతో ఆమె భర్త జమీర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదే విషయంలో జమీల్, నజీరా దంపతుల మద్య గొడవలు ఇంకా పెద్దవి అయ్యాయి. ఇంతకాలం జమీల్, నజీరా దంపతులకు వాళ్ల పెద్దలు సర్దిచెబుతూ వస్తున్నారు.

బెడ్ రూమ్ లో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య
ఆదివారం ఊరికి వెళ్లిన జమీల్ సోమవారం వేకువ జామున ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బెడ్ రూమ్ లో ప్రియుడు ఆలంతో ఎంజాయ్ చేస్తున్న భార్య నజీరా ఆమె భర్త జమీల్ కు అడ్డంగా చిక్కిపోయింది. ఆ సమయంలో జమీల్, నజీరా, ఆలంల మద్య గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో ప్రియుడు ఆలంతో కలిసి నజీరా ఆమె భర్త జమీల్ ను చితకబాదేసింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
సహనం కోల్పోయిన నజీరా ఆమె ప్రియుడు ఆలంతో కలిసి కత్తులతో భర్త జమీల్ ను దారుణంగా పొడిచేశారు. తీవ్రగాయాలైన భర్త జమీల్ ను నజీరా, ఆమె ప్రియుడు ఆలం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై జమీల్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జమీల్ ను హత్య చేసిన నజీరా, ఆమె ప్రియుడు ఆలంను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.