Khiladi wife: భార్యకు ప్రియుడి చీమ కుట్టింది, భర్తను 13 సార్లు కత్తులతో పొడిచి, క్లైమాక్స్ లో భార్య ? !
చెన్నై/తిరుప్పూర్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. కొన్ని సంవత్సరాలు భర్తతో చక్కగా కాపురం చేసిన భార్యకు తరువాత చీమకుట్టింది. గతంలో పరిచయం ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న భర్త డబ్బు సంపాదనలో పడిపోయి అతని భార్య గురించి పట్టించుకునే విషయంలో కొంచెం నిర్లక్షం చేశాడు. ఈ విషయం భార్యకు కలిసి వచ్చింది. కొంతకాలం తరువాత భర్తకు అతని భార్య అక్రమ సంబందం విషయం తెలిసిపోయింది. భార్యను చితకబాదిన భర్త ఇంకోసారి ఈ విషయం నాకు తెలిస్తే నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తన విలాసాలకు తన భర్త అడ్డుపడుతున్నాడని, తనను చంపేస్తాడని భార్య భయపడిపోయింది. భార్య ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి కిరాయి రౌడీలతో డీల్ మాట్లాడింది. కిరాయి రౌడీలు, భార్య, ఆమె ప్రియుడు కలిసి పక్కాప్లాన్ వేశారు. బైక్ లో వెలుతున్న భర్తను 13 సార్లు కత్తులతో పొడిచి స్పాట్ లో చంపేశారు. చేసినపాపం ఊరికేపోదని ప్రియుడు, కొందరు కిరాయి హంతకులు పోలిసులకు చిక్కిపోయారు. భర్త హత్య కేసులో కిలాడీ లేడీ మాత్రం తప్పించుకుంది.
Sketch:
టేస్ట్
మార్చిన
భార్య,
మ్యాటర్
లీక్,
లిక్కర్
పార్టీలో
ప్రియుడితో
కలిసి
భర్తను
చంపిన
భార్య
!

ఇద్దరు పిల్లల తల్లి
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం సమీపంలో గోపాల్ (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సుశీల (35) అనే మహిళను గోపాల్ పెళ్లి చేసుకున్నాడు. గోపాల్ ను వివాహం చేసుకున్న సుశీల ఆమె భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. కొన్ని సంవత్సరాలు భర్త గోపాల్ తో సుశీల చక్కగా కాపురం చేసింది.

భార్యకు ప్రియుడు అనే చీమ కుట్టింది
గోపాల్ అతని భార్య సుశీల, పిల్లలతో కలిసి వాటర్ ట్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. భర్త గోపాల్ తో చక్కగా కాపురం చేస్తున్న సుశీల జీవితంలోకి మారిస్ అనే వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కథ మలుపుతిరిగింది. సుశీల జీవితంలో మారిస్ అనే చీమకుట్టింది. గతంలో పరిచయం ఉన్న మారిస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న సుశీల అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

భర్తకు చాలా లేట్ గా మ్యాటర్ తెలిసింది
గోపాల్ తిరుప్పూర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న గోపాల్ డబ్బు సంపాదనలో పడిపోయి అతని భార్య సుశీల గురించి పట్టించుకునే విషయంలో కొంచెం నిర్లక్షం చేశాడు. గోపాల్ ఆర్థిక ఇబ్బందుల విషయం అతని భార్య సుశీలకు బాగా కలిసి వచ్చింది. కొంతకాలం తరువాత సుశీల అక్రమ సంబంధం విషయం ఆమె భర్త గోపాల్ కు తెలిసిపోయింది.

భర్త హత్యకు రూ. 6 లక్షలు డీల్
భార్య
సుశీలను
చితకబాదిన
గోపాల్
ఇంకోసారి
నీ
ప్రియుడు
మారిస్
విషయం
నాకు
తెలిస్తే
నిన్ను,
వాడిని
ఇద్దరిని
చంపేస్తానని
వార్నింగ్
ఇచ్చాడు.
తన
విలాసాలకు
తన
భర్త
గోపాల్
అడ్డుపడుతున్నాడని,
నన్ను
చంపేస్తాడని
సుశీల
భయపడిపోయింది.
సుశీల,
ఆమె
ప్రియుడు
మారిస్
తో
కలిసి
భర్త
గోపాల్
చంపడానికి
కిరాయి
రౌడీలతో
రూ.
6
లక్షలకు
డీల్
మాట్లాడుకున్నారు.

13 సార్లు పొడిచి చంపేశారు
ఈనెల
4వ
తేదీ
రాత్రి
గోపాల్
పని
ముగించుకుని
బైక్
లో
ఇంటికి
బయలుదేరాడు.
మార్గం
మద్యలో
సుశీల
ప్రియుడు
మారిస్
తో
పాటు
కిరాయి
రౌడీలు
గోపాల్
ను
అడ్డగించి
అతన్ని
కత్తులతో
పొడిచేశారు.
గోపాల్
శరీరంలో
13
కత్తిపోట్లు
పడటంతో
అతను
స్పాట్
లో
చనిపోయాడు.
విషయం
గుర్తించిన
స్థానికులు
పోలీసులకు
సమాచారం
ఇచ్చారు.

భార్య అసలు మ్యాటర్ లీక్
పోలీసు జాగిలాలు గోపాల్ హత్యకు గురైన ప్రాంతం నుంచి కొద్ది దూరం వెళ్లి నిలిచిపోయారు. పోలీసుల విచారణలో సుశీల, మారిస్ మ్యాటర్ బయటకు వచ్చింది. సుశీల, మారిస్ లు ఫోన్ లో లెక్కలేనన్నిసార్లు మాట్లాడుకున్న విషయం గుర్తించిన తిరుప్పూర్ పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రియుడి ఫ్రెండ్ ఇంట్లో మకాం వేసిన భార్య
గోపాల్ హత్య కేసులో అతని భార్య సుశీల ప్రియుడు మారిస్ తో పాటు కిరాయి హంతకులు వినోద్, మణికందన్, విజయ్, ఉల్లంకేశ్వరన్, మదన్ కుమార్ లను అరెస్టు చేశారు. భర్త గోపాల్ హత్య కేసులో అతని భార్య, కిలాడీ లేడీ సుశీల మాత్రం తప్పించుకుంది. అయితే పోలీసులు మారిస్ స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్న సుశీలను అరెస్టు చేశారు.