వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ సంబంధం పెట్టుకుందని నడిబజారులో వదిలేశాడు.. ఇంతకీ ఎవరినో తెలుసా?

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం : పెంపుడు జంతువులను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేవారు చాలా మంది ఉన్నారు. వాటికి ఏం జరిగినా తట్టుకోలేని వారు కనిపిస్తారు. ఒకవేళ ప్రేమగా పెంచుకుంటున్న కుక్క, పిల్లి కనిపించకుండా పోతే అల్లాడిపోయేవారు ఎందరో. అలాంటిది ఓ వ్యక్తి తాను ప్రాణప్రదంగా పెంచుకుంటున్న కుక్కను బజారులో వదిలేశాడు. అందుకు కారణాన్ని దాని మెడలో కట్టిన నోట్‌లో వివరించాడు. ఇంతకీ ఆ రీజన్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి

కుక్క మెడలో నోట్

కుక్క మెడలో నోట్

తిరువనంతపురంలోని ఓ బిజీ రోడ్డులో పొమేరియన్ జాతికి చెందిన ఓ కుక్క అటు ఇటూ తిరుగుతోంది. ఎటు పోవాలో తెలియక తికమకపడుతోంది. అది చూసిన కొందరు వ్యక్తులు ఆ కుక్కను దగ్గరకు తీసుకున్నారు. దాని మెడలో ఒక నోట్ వేళ్లాడటాన్ని గమనించి ఏంటో చదివారు. ఆ నోట్‌లో కుక్కకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. టాప్ బ్రీడ్‌కు చెందిన ఆ కుక్క చాలా మంచిదని, ఎక్కువగా తినదని, ఐదు రోజులకు ఒకసారి స్నానం చేసుకోవడానికి ఇష్టపడుతుందని రాసుంది. కేవలం అరవడమే కాని కరవడం తెలియని దాని వయసు మూడేళ్లని, మిల్క్, బిస్కెట్, ఎగ్స్‌కు ఇష్టంగా తింటుందని దాని ఆహారపు అలవాట్లను వివరించారు.

అక్రమ సంబంధమే కారణం

అక్రమ సంబంధమే కారణం

కుక్క మెడలో ఉన్న నోట్‌లో దాన్ని అలా అనాధగా వదిలేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. అది చూసిన వాళ్లు షాకయ్యారు. ఆ కుక్క పక్కింట్లో ఉండే మరో శునకంతో అక్రమ సంబంధం పెట్టుకుందని రాసుంది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకే తాము దాన్ని వదిలేయాల్సి వస్తోందని నోట్‌లో దాని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

కుక్క ఫోటోతో పాటు దాని మెడలోని నోట్‌ను జంతువుల హక్కుల కార్యకర్త శ్రీదేవీ ఎస్ కర్తా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్రమ సంబంధం పెట్టుకుందని కుక్కను నడిబజారులో వదిలేసిన ఘటనపై కొందరు సెటైర్లు వేస్తుండగా మరికొందరు యజమాని చేసిన పనిని తప్పుబడుతున్నారు.

English summary
Owner abandoned his pet in Thiruvananthapuram. reason behind this decision is Illegal affair with neighbour dog! abondoned dog with a note on the collar says that, this is a top breed, with good behaviour. No need of heavy food. No diseases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X