Illegal affair: ప్రియుడి కోసం మొగుడిని ఏం చేసిందంటే ?, అర్దరాత్రి హైడ్రామా, నాటకాలు, కట్ చేస్తే !
చెన్నై/ తుత్తుకూడి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త డ్రైవర్ కావడంతో రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. ఇంటికి వెళ్లిన సమయంలో భర్త మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్నాడు. పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త భోజనం చేసి నిద్రపోయాడు. అర్దరాత్రి భర్తకు మెలుకువ వచ్చి నిద్రలేచి చూడగా అతని భార్య పక్కరూమ్ లో కుర్చుని ఓ వ్యక్తితో పిచ్చపాటిగా బూతులు మాట్లాడుతున్న విషయం గమనించాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. కొన్ని రోజుల తరువాత అనారోగ్యంగా ఉందని భర్త ఇంటి బయట నిద్రపోయాడు. ఉదయం భర్త శవమై కనిపించాడు.
భర్త గొంతును కత్తితో కోసి కడుపులో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం వెలుగు చూసింది. నా భర్తను దొంగలు చంపేశారని భార్య లబోదిబో అని ఆర్తనాదాలు చేసింది. పోలీసులు హత్యకు గురైన భర్త, అతని భార్య మొబైల్ ఫోన్ నెంబర్ డేటాలు పరిశీలించారు. అప్పుడు కిలాడీ లేడీ మొబైల్ ఫోన్ నెంబర్ కు ఆమె ప్రియుడు లెక్కలేనన్నిసార్లు ఫోన్లు చేశాడని, గంటలు గంటలు మాట్లాడాడని వెలుగు చూసింది. భార్య కామానికి ఆమె భర్త బలి అయ్యాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Illegal affair: పిల్లల తల్లితో పెళ్లికి సిద్దం, భార్యకు విడాకులు ఇవ్వలేదు, లవర్ మీద యాసిడ్ దాడితో !

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని పేరురాణి గ్రామంలో కరుప్పస్వామి (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం కరుప్పస్వామి కుటుంబ సభ్యులు చూపించిన కనకలక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కరుప్పస్వామి, కనకలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.

ఎంజాయ్ చేస్తున్న డ్రైవర్ మొగుడు
పిల్లలు పుట్టిన తరువాత కరుప్పస్వామి, కనకలక్ష్మి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కరుప్పస్వామి డ్రైవర్ కావడంతో తమిళనాడు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. ఇంటికి వెళ్లిన సమయంలో కరుప్పస్వామి స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ తో ఎక్కువగా కరుప్పస్వామి లిక్కర్ పార్టీలు చేసుకుని మద్యం మత్తులో ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకుని ఆమెను చితకబాదుతున్నాడని తెలిసింది.

అర్దరాత్రి భర్తకు షాక్
గత ఏడాది మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన కరుప్పస్వామి భోజనం చేసి నిద్రపోయాడు. అర్దరాత్రి కరుప్పస్వామికి మెలుకువ వచ్చి నిద్రలేచి చూడగా అతని భార్య కనకలక్ష్మి పక్కరూమ్ లో కుర్చుని ఓ వ్యక్తితో పిచ్చపాటిగా బూతులు మాట్లాడుతున్న విషయం గమనించాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కరుప్పస్వామి అర్దరాత్రి ఎవడితో మాట్లాడుతున్నావు అంటూ పెద్ద కర్ర తీసుకుని అతని భార్య కనకలక్ష్మిని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశాడు.

భర్తను చితకబాదిన పోలీసులు
మరుసటి రోజు కనకలక్ష్మి ఆమె భర్త కరుప్పస్వామి మీద కడంపూర్ పోలీస్ స్టేషన్ లో వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ఆ సందర్బంలో కనకలక్ష్మి బంధువు, డ్రైవర్ రవిచంద్రన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆమెకు సహాయం చేసి పోలీసులతో మాట్లాడి వారికి మామూళ్లు ఇచ్చాడు. అంతే పోలీసులు కరుప్పస్వామిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి బెండ్ తీసి నీ భార్యతో ఇంకోసారి గొడవ చేస్తే నీ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చి పంపించారు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులతో మాట్లాడి భర్త కరుప్పస్వామికి దేహశుద్ది చెయ్యడానికి సహాయం చేసిన రవిచంద్రన్ తో కనకలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ టచ్ లో ఉన్నారు. భర్త కరుప్పస్వామి డ్రైవర్ కావడం, వారంలో ఎక్కువ రోజులు బయట ఉండటంతో ఆ విషయం కనకలక్ష్మికి కలిసి వచ్చింది. భర్త బయటకు వెళ్లిన తరువాత ప్రియుడు రవిచంద్రన్ ను పిలిపించుకుని అతనితో కనకలక్ష్మి ఎంజాయ్ చేసింది.

భర్త దారుణ హత్య
ఈనెల 7వ తేదీన రాత్రి ఇంట్లో భోజనం చేసిన కరుప్పస్వామి కొంచెం అనారోగ్యంగా ఉందని ఇంటి బయట నిద్రపోయాడు. అర్దరాత్రి కనకలక్ష్మి ఆమె ప్రియుడు రవిచంద్రన్ కు ఫోన్ చేసి తన భర్త బయట నిద్రపోతున్నాడని, అతన్ని చంపేయాలని చెప్పింది. అర్దరాత్రి రవిచంద్రన్ పేరూరాణి గ్రామిని వెళ్లి ఇంటి బయట నిద్రపోతున్న ప్రియురాలి భర్త కరుప్పస్వామి గొంతును కత్తితో కోసి అదే కత్తితో అతని కడుపులో పొడిచి చంపేసి బైక్ లో పరారైనాడు.

డ్రామాలు ఆడిన కిలాడీ లేడీ
ఉదయం కరుప్పస్వామి ఇంటి బయట శవమై కనిపించాడు. కరుప్పస్వామి గొంతును కత్తితో కోసి కడుపులో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు. నా భర్తను దొంగలు చంపేశారని కనకలక్ష్మి లబోదిబో అని ఆర్తనాదాలు చేసింది. పోలీసులు హత్యకు గురైన కరుప్పస్వామి, అతని భార్య కనకలక్ష్మి మొబైల్ ఫోన్ నెంబర్ డేటాలు పరిశీలించారు. అప్పుడు కిలాడీ లేడీ కనకలక్ష్మి మొబైల్ ఫోన్ నెంబర్ కు ఆమె ప్రియుడు రవిచంద్రన్ లెక్కలేనన్నిసార్లు ఫోన్లు చేశాడని, గంటలు గంటలు మాట్లాడాడని వెలుగు చూసింది.

బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య
పోలీసులు కనకలక్ష్మిని బెండ్ తీస్తే నా ప్రియుడు రవిచంద్రన్ తో కలిసి తన భర్త కరుప్పస్వామిని హత్య చేయించానని అంగీకరించింది. పోలీసులు కనకలక్ష్మి, ఆమె ప్రియుడు రవిచంద్రన్ ను అరెస్టు చేశారు. భార్య కనకలక్ష్మి కామానికి ఆమె భర్త కరుప్పస్వామి బలి అయ్యాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.