• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భర్తకు బకెట్, ప్రియుడికి జాకెట్, మూడో ఫ్లోర్ లో పెడితో భార్య ఏం చేసిందంటే !

|

చెన్నై: భర్తతో కాపురం చేసుకుంటూ సంతోషంగా కాపురం చేస్తున్న మహిళ జీవితంలో ఓ లేడీస్ టైలర్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు లక్షణంగా జాకెట్లు వేసుకుంటున్న ఆమెకు ఆ లేడీస్ టైలర్ కిటికీల జాకెట్లు కుట్టించాడు. వెరైటీ జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టిన భార్య అప్పటి నుంచి భర్తను పట్టించుకోవడం మొదలు పెట్టింది. కిటికీల జాకెట్లు కుట్టించిన లేడీస్ టైలర్ తోనే ఆమె అక్రమ సంబంధం పెట్టుకునింది.

జాకెట్ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య ఆమె భర్తకు బకెట్ మాత్రం ఇచ్చింది. భార్య, ప్రియుడు బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో ఇంటి యజమాని ఇంటి బయట తాళం వెయ్యడంతో పెద్ద రామయణంతో పాటు పంచాయితీలు జరిగాయి. భార్య దెబ్బతో ఏరియానే మార్చేసిన భర్త ఆమెను మూడో అంతస్తులో పెట్టినా ఆమె మరోసారి భర్తకు సినిమా చూపించింది. ప్రియుడికి కొత్త ఇంటి స్కెచ్ మొత్తం ఇచ్చిన భార్య అర్దరాత్రి నేరుగా ఇంటికి పిలిపించుకునింది. అంతే నిద్రపోతున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య కొడవలితో దారుణంగా నరికి చంపించడం కలకలం రేపింది.

Illegal affair: ముగ్గరు ప్రియులు, ఇద్దరు చాలని, మర్మాంగం చట్నీ, సీసీటీవీల్లో రెండు యంగిల్స్ !Illegal affair: ముగ్గరు ప్రియులు, ఇద్దరు చాలని, మర్మాంగం చట్నీ, సీసీటీవీల్లో రెండు యంగిల్స్ !

 ఇంటీరియర్ డిజైనర్

ఇంటీరియర్ డిజైనర్

చెన్నైలోని కొడంబాక్కంలో కోందడపాణి నివాసం ఉంటున్నాడు, కోదండపాణి కొన్ని సంవత్సరాల క్రితం నిరోషా (36) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఇంటిరీయర్ డిజైనర్ గా కాంట్రాక్టు పనులు చేస్తున్న కోదండపాణి డబ్బులు బాగా సంపాధిస్తు భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు.

 నిరోషాకు కిటికీల జాకెట్లు కుట్టిన లేడీస్ టైలర్

నిరోషాకు కిటికీల జాకెట్లు కుట్టిన లేడీస్ టైలర్

కోడంబాక్కంలో మణికందన్ అనే ఫేమస్ లేడీస్ టైలర్ ఉంటున్నాడు. భర్తతో కాపురం చేసుకుంటూ సంతోషంగా కాపురం చేస్తున్న నిరోషా జీవితంలో లేడీస్ టైలర్ మణికందన్ ఎంట్రీ ఇచ్చాడు. నిరోషా మణికందన్ షాపుకు వెళ్లి జాకెట్లు కుట్టించుకోవడం మొదలు పెట్టింది. అప్పటి వరకు లక్షణంగా జాకెట్లు వేసుకుంటున్న నిరోషాకు ఆ లేడీస్ టైలర్ కిటికీల జాకెట్లు కుట్టించి ఆమెను లొంగదీసుకున్నాడు.

 భర్తకు బకెట్...... ప్రియుడికి జాకెట్

భర్తకు బకెట్...... ప్రియుడికి జాకెట్

వెరైటీ జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టిన నిరోషా అప్పటి నుంచి భర్త కోదండపాణిని పట్టించుకోవడం మొదలు పెట్టి అతనికి ఇంట్లో బకెట్ మాత్రం ఇచ్చింది. కిటికీల జాకెట్లు కుట్టించుకుని కులకడం మొదలుపెట్టిన నిరోషా లేడీస్ టైలర్ మణికందన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి జాకెట్ పూర్తిగా అంకితం చేసేసింది. ప్రియుడు మణికందన్ మోజులో అతని షాపులోనే ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ఇంటికి పిలిపించుకుంటున్న నిరోషా ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

 డోర్ లాక్ చేసి సినిమా చూపించిన ఇంటి ఓనర్

డోర్ లాక్ చేసి సినిమా చూపించిన ఇంటి ఓనర్

కోదండపాణి ఇంటీరియర్ డిజైన్ కాంట్రాక్టు పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లడంతో అతని భార్య నిరోషా ప్రియుడు మణికందన్ ను ఇంటికి పిలిపించుకునింది. ఇంటి లోపల లాక్ చేసుకున్న నిరోషా ప్రియుడు మణికందన్ తో బెడ్ రూమ్ లో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. ఉదయం ఇంట్లోకి వెళ్లిన పరాయి మగాడు సాయంత్రం అయినా బయటకు రాకపోవడంతో నిరోషా నివాసం ఉంటున్న ఇంటి యజమానికి అనుమానం వచ్చి ఇంటి బయట తాళం వేసి నిరోషా భర్త కోదండపాణికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

 ఏరియానే మార్చేసిన మొగుడు

ఏరియానే మార్చేసిన మొగుడు

ఇంటికి వచ్చిన కోదండపాణి తన భార్య నిరోషా, ఆమె ప్రియుడు మణికందన్ ను ఇంట్లో చూసి రగిలిపోయి ఇద్దరిని పట్టుకుని చితకబాదేశాడు. రెండు కుటంబాల పెద్దలు, బంధువులు పంచాయితీలు చేసి కోదండపాణికి సర్దిచెప్పారు. ఇక ముందు బుద్దిగా ఉంటానని నిరోషా భర్త కోదండపాణి కాళ్లు పట్టుకునింది. భార్య నిరోషా దెబ్బతో చెన్నైలోని సైదాపేటలో మూడో అంతస్తులో ఇల్లు చూసిన కోదండపాణి అక్కడికి మకాం మార్చేశాడు.

 ఏ అంతస్తు అయినా, ఎక్కడైనా భార్యకు ఓకే

ఏ అంతస్తు అయినా, ఎక్కడైనా భార్యకు ఓకే

మూడో అంతస్తులో అయితే తనకు కొంచెం సేఫ్ అని భర్త కోదండపాణి బావించినా తనకు ఎక్కడైనా ఓకే, ఏ అంతస్తు అయినా ఓకే అని డిసైడ్ అయిన నిరోషా అక్కడ కూడా ప్రియుడు మణికందన్ ను పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన భార్య నిరోషా ప్రియుడు మణికందన్ ఇక్కడికి కూడా వచ్చి చావడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న కోదండపాణి తల పట్టుకుని కుమిలిపోయాడు. ఇదే విషయంలో దంపతుల మద్య ప్రతిరోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

 ప్రియుడికి కొత్త ఇంటి ప్లాన్ ఇచ్చిన భార్య

ప్రియుడికి కొత్త ఇంటి ప్లాన్ ఇచ్చిన భార్య

తన విలాసాలకు అడ్డు ఉన్న భర్త కోదండపాణిని చంపేయాలని నిరోషా డిసైడ్ అయ్యింది. తాను నివాసం ఉంటున్న ఇంటి మూడో అంతస్తులోకి ఎలారావాలి, వచ్చిన తరువాత తన భర్త కోదండపాణిని ఎలా చంపాలి అంటూ నిరోషా ఆమె ప్రియుడు మణికందన్ కు మొత్తం ఫోన్ లో ప్లాన్ ఇచ్చింది. నువ్వు నా భర్త కోదండపాణిని చంపేస్తే జీవితాంతం నీతోనే ఉంటానని నిరోషా ప్రియుడు మణికందన్ కు చెప్పింది.

 అర్దరాత్రి ప్రియుడితో భర్తను చంపించిన భార్య

అర్దరాత్రి ప్రియుడితో భర్తను చంపించిన భార్య

ఈనెల 19వ తేదీ అర్దరాత్రి దాటిన తరువాత 1 గంట సమయంలో మణికందన్ బ్యాగ్ లో కొడవలి పెట్టుకుని ప్రియురాలు నిరోషా నివాసం ఉంటున్న మూడో అంతస్తులోని ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఇంటి తలుపులు తీసిపెట్టిన నిరోషా ప్రియుడు మణికందన్ ను ఇంట్లోకి పిలుచుకుని భర్త కోదండపాణి ఏ రూమ్ లో నిద్రపోతున్నాడో చూపించింది. నేరుగా రూమ్ లోకి వెళ్లిన మణికందన్ ప్రియురాలు నిరోషా భర్త కోదండపాణి మెడ, తల మీద నరికడంతో అతని ప్రాణాలు అక్కడే పోయాయి. కోదండపాణిని చంపేసిన మణికందన్ తప్పించుకుని పరారైనాడు.

 కోర్టులో లొంగిపోయిన ప్రియుడు

కోర్టులో లొంగిపోయిన ప్రియుడు

మరుసటి రోజు కోదండపాణి హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. ఎవరో దొంగలు వచ్చి చంపేశారని భార్య నిరోషా డ్రామాలు ఆడింది. పోలీసులు నిరోషాను బెండ్ తియ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రియుడిని ఇంటికి పిలిపించి భర్తను చంపించిందని నిరోషాను అరెస్టు చేశారు. ప్రియురాలు నిరోషాను అరెస్టు చేశారని తెలుసుకున్న ప్రియుడు మణికందన్ అతని న్యాయవాది సహాయంతో కల్లకురిచ్చి కోర్టులో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు కల్లకురచ్చి చేరుకుని మణికందన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మూడో అంతస్తులోకి ప్రియుడిని పిలిపించిన నిరోషా భర్త కోదండపాణిని హత్య చేయించడం కలకలం రేపింది.

English summary
Illegal affair: Woman kills husband with boyfriend’s help in Chennai City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X