Illegal affair: రౌడీషీటర్ తో ?, రూ. 400 కోట్ల ఆస్తి, నడిరోడ్డులో అర్చనా రెడ్డిని నరికేసిన రెండో భర్త !
బెంగళూరు/ తిరుపతి: వివాహం చేసుకున్న కోటీశ్వరుల కుమార్తె ఆమె భర్తతో కలిసి కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. సుమారు రూ. 400 కోట్ల ఆస్తికి వారసురాలు అయిన ఆమె భర్తతో గొడవల కారణంగా విడిపోయింది. కూతురు, కొడుకుతో కలిసి విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మహిళ ఫైవ్ స్టార్ హోటల్స్ కు వెలుతూ ఖరీదైన కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. వయసులో చిన్నవాడైన జిమ్ ట్రైనర్ ను రెండో పెళ్లి చేసుకున్న ఆమె అతనితో కాపురం చేసింది. ఇదే సమయంలో ప్రముఖ రౌడీషీటర్ తో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది. ఆస్తి విషయంలో, అక్రమ సంబంధం విషయంలో రెండో భర్తతో గొడవలు జరగడంతో అతనికి దూరంగా ఉంటోంది. కొడుకు. ముగ్గురు బంధువులతో కలిసి సొంత ప్రాంతానికి వెళ్లిన ఆమె రాత్రి ఇన్నోవా కారులో ఇంటికి బయలుదేరింది. పక్కాప్లాన్ వేసుకున్న రెండో భర్త, అతని స్నేహితుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆమె కారు అడ్డగించి ఆమెను కిందకు లాగి వేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపేశాడు. కొడుకు ముందే కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలు అయిన అర్చనా రెడ్డి అనే మహిళ ఆమె రెండో భర్త చేతిలో దారుణ హత్యకు గురి కావడం బెంగళూరులో కలకలం రేపింది.

కోటీశ్వరుడి కుమార్తె
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని అనేకల్ సమీపంలోని జిగణికి చెందిన అర్చనా రెడ్డి అలియాస్ అర్చనా (43) అనే మహిళ తండ్రి కోటీశ్వరుడు. కొన్ని సంవత్సరాల క్రితం అర్చనా రెడ్డి కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అర్చనా రెడ్డి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

భర్తకు విడాకులు ఇచ్చిన అర్చనా రెడ్డి
సుమారు రూ. 400 కోట్ల ఆస్తికి వారసురాలు అయిన అర్చనా రెడ్డికి ఆమె భర్తతో గొడవలు ఎక్కువ కావడంతో పెద్దలు పంచాయితీలు చేశారు. భర్తతో గొడవల కారణంగా అతనితో అర్చనా రెడ్డి విడిపోయింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలోని బెళ్లందూర్ లో కూతురు, కొడుకుతో కలిసి విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో అర్చనా రెడ్డి నివాసం ఉంటున్నది. ఫైవ్ స్టార్ హోటల్స్ కు వెలుతూ ఖరీదైన కార్లలో తిరుగుతున్న అర్చనా రెడ్డి ఎంజాయ్ చేస్తోంది.

జిమ్ ట్రైనర్ తో రెండో పెళ్లి
బెంగళూరులో నివాసం ఉంటున్న నవీన్ కుమార్ అలియాస్ నవీన్ అనే యువకుడు అర్చనా రెడ్డికి పరిచయం అయ్యాడు. వయసులో చిన్నవాడు, జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్న నవీన్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకున్న అర్చనా రెడ్డి ఆమె అపార్ట్ మెంట్ లోనే అతనితో కాపురం చేసింది. అర్చనా రెడ్డి, ఆమె రెండో భర్త నవీన్ కుమార్, ఇద్దరు పిల్లలు అదే అపార్ట్ మెంట్ లో కొన్ని సంవత్సరాలు జీవించారు.

ఆస్తి గొడవలు.... కూతురితో ?
అర్చనా రెడ్డితో కాపురం చేస్తున్న రెండో భర్త నవీన్ కుమార్ ఆమె కూతురితో కూడా చనువుగా ఉండేవాడని తెలిసింది. అర్చనా రెడ్డి కూతురు, నవీన్ కలిసి టూర్లు వెళ్లి తిరిగి వస్తుండటంతో రెండో భర్తను అర్చనా రెడ్డి మందలించింది. ఇదే సమయంలో చెన్నపట్టణలో ఉన్న ఆస్తి విషయంలో అర్చనా రెడ్డికి, ఆమె రెండో భర్త నవీన్ కుమార్ కు గొడవలు మొదలైనాయి.

రెండో భర్త మీద కేసు పెట్టిన అర్చనా రెడ్డి
రానురాను రెండో భర్త నవీన్ తీరుతో విసిగిపోయిన అర్చనా రెడ్డి అతనితో నిత్యం గొడవలు పడటం మొదలు పెట్టింది. ఆస్తి విషయంలో, కూతురి విషయంలో రెండో భర్త నవీన్ కుమార్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తున్నాడని రగిలిపోయిన అర్చనా రెడ్డి అతని మీద జిగణి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. రెండో భర్త నవీన్ కుమార్ మీద కేసు పెట్టిన అర్చనా రెడ్డి అతన్ని ఇంటి నుంచి బయటకు గెంటేసింది.

రౌడీషీటర్ తో అక్రమ సంబంధం ?
బెంగళూరులో పేరు మోసిన ప్రముఖ రౌడీషీటర్ తో అర్చనా రెడ్డికి పరిచయం అయ్యింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి, రెండో భర్త నవీన్ కుమార్ మీద కేసు పెట్టి ఆ ఇద్దరికి దూరంగా ఉంటున్న అర్చనా రెడ్డి రౌడీషీటర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. అర్చనా రెడ్డి జోలికి వస్తే నిన్ను చంపేస్తామని రౌడీషీటర్ ఇప్పటికే అనేకసార్లు ఆమె రెండో భర్త నవీన్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది.

భార్యను చంపేయాలని స్కెచ్ వేసిన రెండో భర్త
అర్చనా
రెడ్డి
దూరం
అయ్యిందని,
తనకు
ఆస్తి
దక్కదని
తెలుసుకున్న
ఆమె
రెండో
భర్త
నవీన్
కుమార్
ఆమెను
చంపేయాలని
స్కెచ్
వేశాడు.
చాలా
రోజుల
నుంచి
అర్చనా
రెడ్డి
హత్యకు
నవీన్
కుమార్
స్కెచ్
వేస్తున్నాడు.
ఎప్పుడూ
ఇన్నోవా
కారులో
డ్రైవర్
తో
పాటు
ఇద్దరు,
ముగ్గురిని
వెంటపెట్టుకుని
తిరుగుతున్న
అర్చనా
రెడ్డిని
హత్య
చెయ్యడానికి
నవీన్
కుమార్
కు
సాధ్యం
కాలేదు.

రాత్రి 11 గంటలకు కారులో ఇంటికి
జిగణిలో పురసభ ఎన్నికలు జరిగాయి. జిగణి వార్డు నెంబర్ 18లో ఓటు వెయ్యడానికి అర్చనా రెడ్డి వెళ్లింది. అయితే ఓటు గల్లంతు కావడంతో అర్చనా రెడ్డి అనేకల్ లోని బంధువుల ఇంటికి వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో కొడుకు, కారు డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు బంధువులతో కలిసి అర్చనా రెడ్డి ఇన్నోవా కారులో హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలోని అపార్ట్ మెంట్ కు బయలుదేరింది.

నడిరోడ్డులో నరికి చంపేసిన రెండో భర్త
అర్చనా రెడ్డి కారులో ఇంటికి బయలుదేరిందని తెలుసుకున్న నవీన్ కుమార్, అతని స్నేహితుడు సంతోష్ మరో కారులో ఆమెను వెంబడించారు. హోసూరు రోడ్డులోని హోస రోడ్డు జంక్షన్ లోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అర్చనా రెడ్డి కారును ఆమె రెండో భర్త నవీన్ కుమార్ అడ్డగించారు. ఆ సమయంలో అర్చనా రెడ్డిని కారులో నుంచి కిందకు లాగిని నవీన్ కుమార్, అతని ఫ్రెండ్ సంతోష్ వేటకోడవళ్లతో ఆమెను దారుణంగా నరికి చంపేశారు.

హడలిపోయిన కొడుకు
తల్లి అర్చనా రెడ్డిని మీద వేటకొడవళ్లతో దాడి చేస్తున్న సమయంలో ఆమె కొడుకు, కారు డ్రైవర్, బంధువులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగు తీశారు. విషయం తెలుసుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి అర్చనా రెడ్డి రెండో భర్త నవీన్ కుమార్, అతని ఫ్రెండ్ సంతోష్ కోసం గాలిస్తున్నారు. ఆస్తి విషయం, అక్రమ సంబంధం విషయంలోనే అర్చనా రెడ్డి హత్యకు గురైయ్యిందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.