• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భర్తను ఎలా చంపాలి ?, గూగుల్ లో వెతికి లేపేసింది, మొబైల్ కాల్ డేటాలో !

|

భోపాల్/చెన్నై: కొన్ని మొబైల్ ఫోన్ కంపెనీలు అన్ లిమిటెడ్ డేటా అందుబాటులోకి తీసుకురావడంతో ఎక్కువ కాలం సోషల్ మీడియాలో కాలం గడిపేస్తున్న కొందరు భార్యలకు అతి తెలివి ఎక్కువైపోయింది. ఇంట్లో పని అయిపోయిన తరువాత సోషల్ మీడియాకు అంకితం అయిపోతున్న కొందరు మహిళలు సోషల్ మీడియాలో చాటింగ్ లు, అన్ లిమిటెడ్ ఔట్ గోయింగ్ కాల్స్ దెబ్బతో పిచ్చపాటి బాతాకానీలు మొదలుపెడుతున్నారు. లాక్ డౌన్ దెబ్బతో భర్త రెండు నెలల నుంచి ఇంట్లో ఉండిపోవడంతో అప్పటికే ఓ కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ ఆ విషయం జీర్ణించుకోలేకపోయింది. ఇదే సమయంలో ప్రియుడితో కలిసి భార్య ఆమె భర్తకు అడ్డంగా చిక్కిపోయింది. భర్త బడితపూజ చెయ్యడంతో భార్య రగిలిపోయింది. భర్తను సులభంగా ఎవ్వరికి డౌట్ రాకుండా ఎలా చంపాలి ?. పోలీసు కేసు అయితే ఎలా తప్పించుకోవాలి ?, శవాన్ని ఎలా మాయం చేయ్యాలి ?, భర్త చనిపోయిన తరువాత కేసు కాకుండా తప్పించుకుని గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడితో ఎలా ఎంజాయ్ చెయ్యాలి ? అంటూ గూగుల్ లో కొన్ని రోజుల పాటు వెతికేసింది. గూగుల్ తల్లి పుణ్యమా అంటూ ప్రియుడి సహాయంతో భర్తను చంపేయడం కలకలం రేపింది. అయితే ఎక్కడో అక్కడ చిన్నపొరపాటు చేసిన భార్య భాగోతం పోలీసులకు మూడు రోజుల్లోనే తెలిసిపోయింది.

Illegal affair: ముగ్గరు ప్రియులు, ఇద్దరు చాలని, మర్మాంగం చట్నీ, సీసీటీవీల్లో రెండు యంగిల్స్ !Illegal affair: ముగ్గరు ప్రియులు, ఇద్దరు చాలని, మర్మాంగం చట్నీ, సీసీటీవీల్లో రెండు యంగిల్స్ !

 కిలాడీ పెళ్లాం

కిలాడీ పెళ్లాం

మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లాలోని ఖేడిపూర్ ప్రాంతంలో అమీర్, తబసం అనే దంపతులు నివాసం ఉంటున్నారు. తబసం చూడటానికి ఎర్రగా, బుర్రగా, యాపిల్ పండులాగా ఉండటంతో ఆమెకు కొంచెం టెక్కుఎక్కువ అని బంధువులు అంటున్నారు. అమీర్ కొంచెం అమాయకుడు కావడంతో తబసం ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది.

భర్త పక్క రాష్ట్రంలో...... బెడ్ రూమ్ లో ప్రియుడు ఫుల్ టైమ్

భర్త పక్క రాష్ట్రంలో...... బెడ్ రూమ్ లో ప్రియుడు ఫుల్ టైమ్

అమీర్ మహారాష్ట్రలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలలో రెండు సార్లు సొంత ఊరికి వెలుతున్న అమీర్ నాలుగైదు రోజులు మాత్రమే భార్యతో ఉంటూ కాపురం చేస్తున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తబసం విరహం తట్టుకోలేక ఇర్ఫాన్ అనే ప్రియుడిని సెట్ చేసుకునింది. వారంలో నాలుగు రోజులు మాత్రమే పార్ట్ టైమ్ గా కాపురం చేస్తున్న అమీర్ ను పక్కనపెట్టిన తబసం ఇర్ఫాన్ తో ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఇరగదీసేసింది.

లాక్ డౌన్ దెబ్బతో భార్యకు ఇబ్బందులు

లాక్ డౌన్ దెబ్బతో భార్యకు ఇబ్బందులు

ఇంతకాలం ప్రియుడు ఇర్ఫాన్ తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన తబసంకు కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో ఇబ్బందులు ఎదురైనాయి. రెండు నెలల ముందు మహారాష్ట్రలో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో అమీర్ పని చేస్తున్న కంపెనీకి సెలవులు ప్రకటించారు. లాక్ డౌన్ ముందు అమీర్ సొంత ఊరికి వచ్చేయడంతో అతని భార్య తబసం ఆమె ప్రియుడు ఇర్ఫాన్ కు కలుసుకోలేకుండా పోయింది.

 కూరగాయలకు వెళ్లిన భర్త

కూరగాయలకు వెళ్లిన భర్త

లాక్ డౌన్ దెబ్బతో రోజూ 24 గంటలు భర్త అమీర్ ఇంట్లోనే ఉండటంతో తబసం ఆమె ప్రియుడు ఇర్ఫాన్ ను కలవలేకుండా, అతనితో మాట్లాడలేక నానా తంటాలు పడింది. ఈనెల మొదటి వారంలో కూరగాయాలు తీసుకురావడానికి భర్త అమీర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మంచి చాన్స్ చిక్కిందని తబసం ఆమె ప్రియుడు ఇర్ఫాన్ ను ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో పని మొదలుపెట్టింది.

 గూట్లో ప్రియుడు..... బెండ్ ఎత్తిన మొగుడు

గూట్లో ప్రియుడు..... బెండ్ ఎత్తిన మొగుడు

బయటకు వెళ్లిన అమీర్ త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో బెడ్ రూమ్ లో భార్య తబసం, ఆమె ప్రియుడు ఇర్ఫాన్ నగ్నంగా ఫుల్ బిజీగా ఉన్న విషయం భర్త అమీర్ కంట్లోపడింది. భర్త అమీర్ వచ్చేశాడని తెలుసుకున్న తబసం ఆమె ప్రియడు ఇర్ఫాన్ ను బెడ్ రూమ్ లోని కబోడ్ లో దాచిపెట్టింది. అప్పటికే సీన్ చూసిన అమీర్ ప్యాంట్ కు వేసుకున్న బెల్ట్ తీసి భార్య తబసం, ఆమె ప్రియుడు ఇర్ఫాన్ ను బొబ్బలు వచ్చేలా చితకబాదేశాడు. ఇంకో సారి ఇలా జరిగిందంటే నీ ప్రాణం తీస్తానని భార్య తబసంను ఆమె భర్త అమీర్ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు.

 భర్తను ఎలా చంపేయాలి అని గూగుల్ లో వెతికేసింది

భర్తను ఎలా చంపేయాలి అని గూగుల్ లో వెతికేసింది

ప్రియుడు ఇర్ఫాన్ తో కలిసి భార్య తబసం ఆమె భర్త అమీర్ కు అడ్డంగా చిక్కిపోవడం, భర్త బడితపూజ చెయ్యడంతో భార్య రగిలిపోయింది. భర్త అమీర్ ను సులభంగా ఎవ్వరికి డౌట్ రాకుండా ఎలా చంపాలి ?. పోలీసు కేసు అయితే ఎలా తప్పించుకోవాలి ?, శవాన్ని ఎలా మాయం చేయ్యాలి ?, భర్త చనిపోయిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడు ఇర్ఫాన్ తో ఎలా ఎంజాయ్ చెయ్యాలి ? అంటూ గూగుల్ లో కొన్ని రోజుల పాటు భార్య తబసం తెగవెతికేసింది.

భర్తకు ఉబ్బసం..... గూగుల్ తల్లి స్కెచ్

భర్తకు ఉబ్బసం..... గూగుల్ తల్లి స్కెచ్

భర్త అమీర్ ఉబ్బసం వ్యాధితో అప్పుడప్పుడు బాధపడుతున్నాడు. భర్త అమీర్ కు ఉబ్బసం ఉన్న విషయం అతని భార్య తబసంకు తెలుసు. ఉబ్బసం తగ్గడానికి అమీర్ కొన్ని మందులు ఉపయోగిస్తున్నాడు. అమీర్ ఉపయోగిస్తున్న మందుల్లో కలపడానికి ముందుగా గూగుల్ లో వెతికి తెలుసుకున్న కొన్ని మందులను ప్రియుడు ఇర్ఫాన్ తో కలిసి తెప్పించుకునింది. జూన్ 18వ తేదీన ఉబ్బసం వ్యాధికి ఉపయోగించే మందులతో పాటు మత్తు మందు కలిపిన మాత్రలను భార్య తబసం ఆమె భర్త అమీర్ తో తినిపించేసింది.

భర్తను సుత్తితో కొట్టి చంపేసిన భార్య, ప్రియుడు

భర్తను సుత్తితో కొట్టి చంపేసిన భార్య, ప్రియుడు

ఉబ్బసం మందులతో పాటు మత్తు మందు మాత్రలు వేసుకున్న అమీర్ స్పృహకోల్పోయాడు. తరువాత ప్రియుడు ఇర్ఫాన్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న భార్య తబసం అమీర్ కాళ్లు, చేతులు కట్టేసింది. అనంతరం తబసం, ఆమె ప్రియుడు ఇర్ఫాన్ కలిసి స్పృహ కోల్పోయిన అమీర్ చాతి మీద సుత్తితో కొట్టి చంపేశారు.

మస్త్ డ్రామా ఆడిన భార్య

మస్త్ డ్రామా ఆడిన భార్య

తన భర్తకు ఉబ్బసం ఉందని, తాను కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లో చొరబడి తన భర్త మీద దాడి చేసి ఆయనకు ఊపిరిరాకుండా చేసి చంపేశారని భార్య తబసం నాటకాలు ఆడింది. అప్పటికే ఇంట్లో వస్తువులు చెల్లా చెదురు చేసింది. భర్త ఉపయోగిస్తున్న మందులను ఆమె మాయం చేసింది. భర్త చనిపోతే మూములుగా భార్య మీద అనుమానం వ్యక్తం చేసే పోలీసులు ఇక్కడా అదే పని చేశారు. తబసం మొబైల్ ఫోన్ కాల్ డేటాను పూర్తిగా పరిశీలించారు.

  COVID Third Wave | Easing COVID 19 Curbs | Oneindia Telugu
  భార్య, ప్రియుడిని పట్టించిన మొబైల్ కాల్ డేటా, గూగుల్

  భార్య, ప్రియుడిని పట్టించిన మొబైల్ కాల్ డేటా, గూగుల్

  భార్య తబసం భర్త చనిపోయిన తరువాత రెండు రోజులు గంటలు గంటలు ఇర్ఫాన్ తో మాట్లాడిందని పోలీసులు తెలుసుకున్నారు. ఇదే సమయంలో గూగుల్ ఓ వ్యక్తిని చంపడం ఎలా ? అంటూ తబసం తెగవెతికేసిందని పోలీసులు గుర్తించారు. తబసం, ఇర్ఫాన్ ను బెండ్ తీస్తే ఇద్దరూ అమీర్ ను హత్య చేసిన విషయం అంగీకరించారని, ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. గూగుల్ లో వెతికి భర్తను భార్య దారుణంగా చంపేసిందని తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు.

  English summary
  Illegal affair: An internet search history of “methods to kill” has helped the Madhya Pradesh police put a murder case to bed. A woman in the state’s Harda district allegedly murdered her husband with her lover’s help, reportedly after running a chilling internet search for ways to murder somebody, and how to dispose of the body.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X