• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: భార్యతో ప్రియుడు జల్సాలు, భర్తకు చేతులు విరిచేసిన సచిన్, బర్త్ డే పార్టీలో మాస్క్ లు

|

ముంబాయి/ బెంగళూరు: సిటీలో దిక్కులేనంతమంది పెళ్లి కాని అమ్మాయిలు ఉంటే ఓ యువకుడికి వివాహం అయిన యువతి మీద మోజు పడింది. సందట్లో సడేమియా అంటూ ఆ యువతి కూడా ఆ యువకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే అప్పటి నుంచి భర్తకు తెలీకుండా భార్య ఆమె ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను బెండ్ తీస్తున్నాడు. తన ప్రియురాలిని ఆమె భర్త టార్చర్ చేస్తున్నాడని ప్రియుడు రగిలిపోయాడు. రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాలో బావ కళ్లలో ఆనందం చూడటానికి తాను ఓ లీడర్ ను చంపేస్తానని ఓ వ్యక్తి ఎలా చెప్పాడో అలాగే ప్రియురాలి భర్త రెండు చేతులు విరిచేసి చంపేయడానికి ప్రయత్నించాడు. బర్త్ డే పార్టీలో మాస్క్ లు వేసుకుని మరీ అనుకున్న పని పూర్తి చేసిన ప్రియుడు తన ప్రియురాలి కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించి కటకటాలపాలైనాడు.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

 పెళ్లైన మహిళతో లవ్

పెళ్లైన మహిళతో లవ్

దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలోని సమతా నగరలో నివాసం ఉంటున్న సచిన్ యాదవ్ అనే యువకుడు పనిపాట లేకుండా స్నేహితులతో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సమతా నగర్ లో ముఖేష్, మీనాక్షి సిన్హా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నాడు. మీనాక్షి సిన్హా మీద మనుసు పారేసుకున్న సచిన్ ఆమెను వలలో వేసుకోవడానికి ప్రయత్నించాడు.

ప్రియురాలు పిలిచింది

ప్రియురాలు పిలిచింది

తన కోసం సచిన్ యాదవ్ తిరుగుతున్నాడని గమనించిన మీనాక్షి మొదట బెట్టుచేసినా తరువాత అతనితో ఎంజాయ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రియురాలు పిలిచిందని ఉబ్బిపోయిన సచిన్ ఇక ముంబాయి నగరంలో పెళ్లి కాని అమ్మాయి ఎవ్వరూ లేరు అనే టైపులో మీనాక్షి తనకు సర్వస్వం అని భావించి ఆమె వెంట తిరిగాడు.

భర్తకు తెలిసి భార్యకు బెండ్ తీశాడు

భర్తకు తెలిసి భార్యకు బెండ్ తీశాడు

భర్త లేని సమయంలో మీనాక్షి ఇంటి నుంచి బయటకు వెళ్లి ప్రియుడు సచిన్ తో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేసింది. తన భార్య మీనాక్షి ఎవరితోనో తిరుగుతుందని అనుమానం రావడంతో భర్త ముఖేష్ కు మండిపోయింది. ఇక ఆరోజు నుంచి భర్త ముఖేష్ రాత్రి అయితే ఫుల్ గా మందు వేసుకుని ఇంటికి వెళ్లి భార్య మీనాక్షికి బెండ్ తియ్యడం మొదలుపెట్టాడు.

రక్తచరిత్ర సినిమా గుర్తుకు వచ్చింది

రక్తచరిత్ర సినిమా గుర్తుకు వచ్చింది

రామ్ గోపాల్ వర్త తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో తన బావ కళ్లలో ఆనందం చూడటానికి ఆయన ప్రత్యర్థిని నేను చంపేస్తానని ఓ వ్యక్తి ఎలా పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడో అలాగే ప్రియుడు సచిన్ అతని ప్రియురాలు మీనాక్షికి చెప్పాడు. నీ భర్త ముఖేష్ కాళ్లు, చేతులు తీసేస్తామని సచిన్ అతని ప్రియురాలు మీనాక్షికి చెప్పి ఓదార్చాడు.

బర్త్ డే పార్టీలో స్కెచ్

బర్త్ డే పార్టీలో స్కెచ్

గత శనివారం రాత్రి ముఖేష్ స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లాడు. తన భర్త ముఖేష్ బర్త్ డే పార్టీకి వెళ్లాడని మీనాక్షి ఆమె ప్రియుడు సచిన్ కు సమాచారం ఇచ్చింది. మంచి చాన్స్ చిక్కిందని సచిన్ అతని సోదరుడు ఆకాష్ యాదవ్, ప్రాణస్నేహితుడు సాగర్ గుప్తాలను వెంట పెట్టుకుని బర్త్ డే పార్టీకి వెళ్లాడు. సచిన్, సాగర్, ఆకాష్ ముగ్గురు ముఖాలకు మాస్క్ లు వేసుకుని ప్రియురాలి భర్త ముఖేష్ ను పట్టుకుని బర్త్ డే పార్టీ సమీపంలోని లాక్కెళ్లి అతని చేతులు విసిరేసి బలమైన రాడ్ తో అతని తల మీద తీవ్రగాయాలు చేసి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు. లిక్కర్ మత్తులో ఉన్న ముఖేష్ ఏమీ చెయ్యలేక దెబ్బలు తిని కుప్పకూలిపోయాడు.

మాస్క్ ల దెబ్బతో అయోమయం

మాస్క్ ల దెబ్బతో అయోమయం

ముఖేష్ పై హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న సమతా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. బర్త్ డే పార్టీ సమయంలో అక్కడికి ఎవరెవరు వచ్చారు అంటూ సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. బర్త్ డే పార్టీకి హాజరై వారు కూడా ముఖాలకు మాస్క్ లు వేసుకున్న సచిన్, సాగర్, ఆకాష్ లను గుర్తించలేకపోయారు. ఇదే సమయంలో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేసినా ఎలాంటి క్లూ చిక్కలేదు.

పక్కింటోళ్లు ఊరికే ఉంటారా ?

పక్కింటోళ్లు ఊరికే ఉంటారా ?

పోలీసులకు అనుమానం వచ్చి ముఖేష్ ఇంటి చుట్టుపక్కల వాళ్లను విచారణ చేశారు. ఆ సమయంలో ముఖేష్ భార్య మీనాక్షి కోసం ఓ యువకుడు వచ్చి వెలుతుంటాడని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మీనాక్షికి ట్రీట్ మెంట్ ఇవ్వడంతో సచిన్ పేరు బయటకు వచ్చింది. సచిన్, అతని సోదరుడు ఆకాష్ యాదవ్ ను అరెస్టు చేశామని, పరారైన సాగర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. భార్య మీనాక్షి ప్రియుడు సచిన్ అండ్ గ్యాంగ్ చేతిలో తీవ్రగాయాలైన ముఖేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమతా నగర్ పోలీసులు తెలిపారు.

English summary
Illegal affair: Young man beats lover husband teach him lesson in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X