• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ప్రియుడికి పాండ్స్ పౌడర్, భర్తకు రిన్ పౌడర్, పండగ రోజు పాత మొగుడేనా ? ఓల్డ్ స్టాక్

|

చెన్నై/ తిరుచ్చి/ మదురై: భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నా భార్య పరాయి పురుషుడి వలలో పడింది. ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న భార్య ప్రియుడికి పాండ్స్ పౌడర్ ఇచ్చి ఇంట్లో భర్తకు రిన్ పౌడర్ ఇచ్చింది. పండగ రోజు పాత మొగుడేనా, ఓల్డ్ స్టాక్ వద్దని భార్య డిసైడ్ అయ్యింది. భార్య ఉద్యోగానికి వెళ్లి వస్తున్నదని భర్త ఆమె వ్యక్తిగత విషయాలు పట్టించుకోవడంలో కొంచెం నిర్లక్షం చేశాడు. ఇదే సమయంలో ఉదయం ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన భార్య గుడిలో ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుని జెండా ఎత్తేసింది. తనకు న్యాయం చెయ్యాలని, నా భార్య నాకు కావాలని భర్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే ప్రియుడు ఓ పోలీసు అధికారి కొడుకు కావడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

Bedroom effect:తల్లికి తాటి బెల్లం, కూతురికి ?ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్, బెడ్ రూమ్ లోకి తల్లి ఎంట్రీతో

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని ఎడమలపట్టి పుత్తూర్ లో కుమారవేల్ (44), ఆశా (40) దంపతులు నివాసం ఉంటున్నారు. 2013లో కుమారవేల్, ఆశా ఇష్టపడంతో పెద్దలు ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిపించారు. కుమారవేల్, ఆశా దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త కుమారవేల్, ఇద్దరు పిల్లలతో కలిసి సంవత్సరం క్రితం వరకు ఆశా చాలా సంతోషంగానే సంసారం చేసింది.

 ఆసుపత్రిలో అభిషేక్ ఎంట్రీ

ఆసుపత్రిలో అభిషేక్ ఎంట్రీ

తిరుచ్చిలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆశా ఉద్యోగం చేస్తున్నది. ఉదయం నిద్రలేచి శుభ్రంగా సింగారించుకుని ఆశా తిరుచ్చిలో ఉద్యోగానికి వెలుతున్నది. కుమారవేల్ కూడా ప్రతిరోజు తిరుచ్చి వెళ్లి ఇంటీరియర్ డిజైరన్ గా పని చేస్తూ చేతి నిండా డబ్బులు సంపాధిస్తున్నాడు. సంవత్సరం క్రితం ఆసుపత్రిలో ఆశాకు అభిషేక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆశా, అభిషేక్ పరిచయం ఫోన్ నెంబర్లు మార్చుకునే వరకు వెళ్లింది.

 ఓల్డ్ స్టాక్ అవసరమా ?

ఓల్డ్ స్టాక్ అవసరమా ?

పెళ్లి జరిగి 6 సంవత్సరాలు అయ్యింది, తన భర్త కుమారవేల్ తో కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇంకా ఓల్డ్ స్టాక్ అవసరమా, పండగరోజు కూడా పాత మొగుడేనా అంటూ ఆశా ఆలోచించింది. ప్రతిరోజు ఫోన్లు చేసి తీపికబుర్లు చెబుతున్న అభిషేక్ అంటే ఆశాకు మోజు ఎక్కువైయ్యింది. ఆశా, అభిషేక్ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.

 సొంత ఇంటిని వదిలేసి వేరే ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్

సొంత ఇంటిని వదిలేసి వేరే ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్

ఉదయం నిద్రలేచి పిల్లలకు ఏదో ఒకటి చేసి పెట్టి ఉద్యోగం చెయ్యడానికి బయటకు చెక్కేస్తున్న ఆశా ప్రియుడు అభిషేక్ తో కలిసి షికార్లు కొట్టింది. సొంత ఇంటి సంసారం చక్కదిద్దుకోలేని కుమారవేల్ వేరే ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్లు చేసుకుంటూ కాలం గడిపేశాడు. ఇంతలో భార్య ఆశా తనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న వేరే ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. భార్య ఆశా, అభిషేక్ ల విషయం తెలుసుకున్న కుమారవేల్ షాక్ కు గురైనాడు. కుమారవేల్ కొంతకాలం భార్య ఆశాకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఆశా మాత్రం భర్త మాట వినకుండా ఆమె అభిషేక్ తో తిరుగింది.

గుడ్ బై...... హ్యాపీ జర్నీ

గుడ్ బై...... హ్యాపీ జర్నీ

ఈనెల 2వ తేదీన ఉదయం ఇంటి నుంచి ఉద్యోగం చెయ్యడానికి బయలుదేరిన ఆశా భర్త, పిల్లలకు సంతోషంగా బాయ్ చెప్పి వెళ్లింది. తరువాత ఆశా రాత్రి ఇంటికి తిరిగి వెళ్లలేదు. మరుసటి రోజు వరకు భార్య ఆశా కోసం వేచి చూసిన భర్త కుమారవేల్ ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. తరువాత తన భార్య ఆశా కనపడటం లేదని కుమారవేల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చెయ్యగా కుమారవేల్ కు దిమ్మతిరిగే విషయం తెలిసింది. ఆశా, అమె ప్రియుడు అభిషేక్ గుడిలో పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టారని పోలీసులు చావు కబురు చల్లగా కుమారవేల్ కు చెప్పారు.

 పోలీసు అధికారి కొడుకు

పోలీసు అధికారి కొడుకు

తన భార్య ఆశాను తనకు అప్పగించాలని, లేదంటే ఇద్దరు పిల్లల జీవితం నాశనం అవుతోందని కుమారవేల్ పోలీసులను వేడుకున్నాడు. అయితే అభిషేక్ ఓ పోలీసు అధికారి కొడుకు కావడంతో స్థానిక పోలీసులు చేతులు ఎత్తేశారు. అభిషేక్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, భార్యను పుట్టింటికి తరిమేశాడని, భార్యతో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతను ఆశాను రెండో పెళ్లి చేసుకున్నాడని వెలుగు చూసింది. తన భార్య ఆశాను పెళ్లి చేసుకున్న అభిషేక్ తండ్రి ఓ పోలీసు అధికారి కొడుకు అని, అందుకే తనకు స్థానిక పోలీసులు న్యాయం చెయ్యాలేదని, మీరే న్యాయం చెయ్యాలని భర్త కుమారవేల్ తిరుచ్చి జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు.

English summary
Illegal affair: Young mother elopes with her illicit lover in Trichy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X