• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరుడి తండ్రితో వధువు తల్లి పరార్, వ్యాలెంటైన్స్ డే రోజు ప్రత్యక్షం, జస్ట్ సారీ, లవ్, ట్వీస్ట్ !

|

సూరత్/ అహమ్మదాబాద్: వరుడి తండ్రి, వధువు తల్లి పారిపోవడంతో అ రెండు కుటుంబాలు షాక్ కు గురైనాయి. కుమారుడికి పెళ్లి చెయ్యవలసిన తండ్రి, కుమార్తెకు పెళ్లి చెయ్యవలసిన తల్లి కలిసి పారిపోయి ఇన్ని రోజులు రహస్యంగా కలిసి ఉన్నారు. అయితే వ్యాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14వ తేదీ వారు ఇద్దరు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఏదో తెలిసో తెలీకో తాము కలిపిపారిపోయామని, ఇక ముందు ఇలాంటి తప్పు చెయ్యమని కుటుంబ సభ్యులకు సింపుల్ గా సారీ చెప్పారు. అయితే తన భార్యను ఇక దగ్గరకు రానివ్వనని వధువు తండ్రి తేల్చి చెప్పడంతో వారి బంధువులు జోక్యం చేసుకుని పంచాయితీలు చేస్తున్నారు. తనను దగ్గరకు తీసుకోవాలని వధువు తల్లి భర్తను ప్రాదేయపడుతోంది.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

యువతి, యువకుడి పెళ్లి

యువతి, యువకుడి పెళ్లి

గుజరాత్ లోని సూరత్ దగ్గర్లోని కట్టర్ గ్రామంలో ని 48 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నారు. గుజరాత్ లోని నవర్సీ ప్రాంతంలో 45 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నారు. కట్టర్ గ్రామానికి చెందిన వ్యక్తి కుమారుడికి, నవర్సీ ప్రాంతానికి చెందిన మహిళ కుమార్తె గత నెల జనవరి చివరి వారంలో వివాహం చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు.

వరుడి తండ్రి, వధువు తల్లి జంప్

వరుడి తండ్రి, వధువు తల్లి జంప్

జనవరి 10వ తేదీన వధువు తల్లి తాను బయటకు వెళ్లి కూరగాయలు తీసుకొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే రోజు తాను బయటకు వెలుతున్నానని వరుడి తండ్రి ఇంటి నుంచి వెళ్లాడు. తరువాత వధువు తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ముకుల్ తన భార్య కనపడటం లేదని అదే రోజు రాత్రి వెజల్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు వరుడి తండ్రి మాయం అయ్యాడని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలు విషయం తెలిసి షాక్

అసలు విషయం తెలిసి షాక్

వరుడి తండ్రి, వధువు తల్లి కలిసి పారిపోయారని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. రెండు వారాల్లో కొడుకు, కూతురికి పెళ్లి చెయ్యవలని వీరు ఇలాంటి పని చెయ్యడంతో వారి కుటుంబ సభ్యుల దిమ్మతిరిగిపోయింది. దేశ వ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

 25 ఏళ్ల క్రితం లవ్

25 ఏళ్ల క్రితం లవ్

వాస్తవానికి పరారైన వరుడి తండ్రి, వధువు తల్లి 25 ఏళ్ల క్రితం ఓ పెళ్లిలో కలుసుకున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ప్రేమలో పడ్డారు. అయితే ఆ వ్యక్తికి ఆస్తులు లేవనే విషయానికి వారి పెళ్లికి అమ్మాయి తండ్రి నిరాకరించాడు. తరువాత ఇద్దరు విడిపోయారు. తరువాత ఆమె తండ్రి ఆమెకు వజ్రాల వ్యాపారితో వివాహం జరిపించాడు. అనంతరం ఆ వ్యక్తి వేరే మహిళను వివాహం చేసుకోవడంతో ముగ్గురు పిల్లలు పుట్టారు. వారిలో ఓ యువకుడే ప్రస్తుత పెళ్లి కొడుకు.

వ్యాలెంటైన్స్ డే రోజు సీన్ రివర్స్

వ్యాలెంటైన్స్ డే రోజు సీన్ రివర్స్

గత నెల 10వ తేదీన ఇంటి నుంచి పారిపోయిన వరుడి తండ్రి, వధువు తల్లి వ్యాలెంటైన్స్ డే శుక్రవారం వారి ఇళ్లకు చేరుకున్నారు. నా వల్ల ఆమె బాధపడటం తనకు ఇష్టం లేదు, ఆమె ఇక ముందు మంచి జీవితం గడపాలని, అందుకు తాను అన్ని విధాలుగా సహకరిస్తానని వరుడి తండ్రి కుటుంబ సభ్యులకు చెప్పారు. తాము వెళ్లిపోయిన తరువాత బంధువుల తో పాటు ప్రపంచం అంతా మమ్మల్ని చెడుగా చిత్రీకరించిందని, అందుకే అవమానంతో తిరిగి వచ్చేశామని వధువు తల్లి బోరున విలపిస్తోంది.

సింపుల్ గా జస్ట్ సారీ

సింపుల్ గా జస్ట్ సారీ

మమ్మల్ని మీరు క్షమించండి, ఇక ముందు ఎలాంటి తప్పు చెయ్యమని అంటూ పారిపోయిన వరుడి తండ్రి, వధువు తల్లి వారి కుటుంబ సభ్యులకు జస్ట్ సారీ చెప్పారు. అయితే మా పరువు తీసి 25 ఏళ్ల క్రితం ప్రియుడితో పారిపోయిన తన భార్యను తాను ఇంటిలోకి రానివ్వనని వజ్రాల వ్యాపారి ముకుల్ తేల్చిచెప్పారు.

పెద్దల పంచాయితీలు

పెద్దల పంచాయితీలు

వ్యాలెంటైన్స్ డే రోజు విడిపోయిన పాత ప్రేమికుల లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పడటంతో వారి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పడానికి వారి బంధువులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వరుడి తండ్రి, వధువు తల్లి లవ్ స్టోరీ వ్యాలెంటైన్స్ డే రోజు ఓ కొలిక్కిరావడంతో ఇక ముందు కథ ఎలాంటి మలుపు తిరుగుతోందో వేచి చూడాలి.

English summary
Illegal love issue: Surat groom's dad return back in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X