Illegal affair: ఫ్రెండ్ భార్యతో తమ్ముడు ఎంజాయ్, భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కి ?, అన్న హత్య !
చెన్నై/ మదురై: భార్యతో సంతోషంగా కాపురం చేసుకుంటున్న యువకుడు స్నేహితుడి భార్య మీద కన్ను వేశాడు. ఇంటికి వచ్చి వెలుతున్న భర్త స్నేహితుడికి అతని భార్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరు గ్రీన్ సిగ్నల్ లోకి రావడం అప్పటి నుంచి అసలు కథ మొదలై ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. భర్త లేని సమయంలో మ్యాటర్ తెలుసుకున్న స్నేహితుడు నేరుగా అతని ఇంటికి వెళ్లి ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. రానురాను ఇద్దరి వ్యవహారం విచ్చలవిడిగా తయారైయ్యింది. నేను ఇంట్లో లేని సమయంలో నా ఫ్రెండ్ పదేపదే నా ఇంటికి ఎందుకు వచ్చి వెలుతున్నాడు అంటూ భర్తకు అనుమానం మొదలైయ్యింది. పట్టపగలు బెడ్ రూమ్ లో స్నేహితుడితో భార్యతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు. తరువాత ఇరు వర్గాలు మద్య గొడవలు జరిగాయి. తమ్ముడి అక్రమ సంబంధం కారణంగా అతని అన్న దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. భార్య కోసం హత్య చేసిన భర్త, తమ్ముడి గొడవలో మధ్యలో దూరిన అన్న దారుణ హత్యకు గురికావడంతో రెండు కుటంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఈ దెబ్బతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Illegal affair: ఎస్ఐ భార్యకు ఇద్దరు ప్రియులు, బ్లాక్ మెయిల్ ?, స్పాట్ పెట్టి లేపేసిన ఎస్ఐ !

అన్న జేసీబీ ఓనర్, తమ్ముడు వ్యాపారం
తమిళనాడులోని మైలాడుతురై జిల్లాలోని మేలపట్టమంగళం గ్రామంలో సతీష్, దినేష్ అనే సోదరులు ఉంటున్నారు. సతీష్ జేసీబీ ఆపరేటర్. సతీష్ కు సంతంగా ఒక జేసీబీ పెట్టుకుని దానిని అద్దెకు ఇస్తున్నాడు. సతీష్ తమ్ముడు దినేష్ కూడా వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజు సతీష్, అతని తమ్ముడు దినేష్ ఎవరిపనుల్లో వారు బిజీబిజీగా ఉంటున్నారు. సతీష్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఫ్రెండ్ భార్య మీద కన్నుపడింది
మైలావరం సమీపంలోని బందరువాడలో పళనివేల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పళనివేల్ కు సెల్వి (పేరు మార్చడం జరిగింది) అనే భార్య ఉంది. పళనివేల్, దినేష్ స్నేహితులు. దినేష్ కు వివాహం అయ్యింది. భార్యతో సంతోషంగా కాపురం చేసుకుంటున్న దినేష్ అతని స్నేహితుడు పళనివేల్ భార్య సెల్వి మీద కన్ను వేశాడు.

భర్త ఫ్రెండ్ తో మస్త్ మజా చేసింది
దినేష్ అతని ఫ్రెండ్ పళనివేల్ భార్య సెల్వితో చనువు పెంచుకుని ఆమెతో రాసుకుని పూసుకుని తిరిగాడు. ఇంటికి వచ్చి వెలుతున్న దినేష్ కు పళనివేల్ భార్య సెల్వి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పళనివేల్ భార్య సెల్వి, దినేష్ ఇద్దరూ వన్ లోకి రావడంతో అప్పటి నుంచి అసలు కథ మొదలై ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు.

భర్తకు అనుమానం మొదలైయ్యింది
భర్త లేని సమయంలో సెల్వి సమాచారం ఇవ్వడం, అసలు మ్యాటర్ తెలుసుకున్న దినేష్ నేరుగా ఫ్రెండ్ పళనివేల్ ఇంటికి వెళ్లి ప్రియురాలు సెల్వితో ఎంజాయ్ చేస్తున్నాడు. రానురాను దినేష్, సెల్వి వ్యవహారం విచ్చలవిడిగా తయారైయ్యింది. నేను ఇంట్లో లేని సమయంలో నా ఫ్రెండ్ దినేష్ పదేపదే నా ఇంటికి ఎందుకు వచ్చి వెలుతున్నాడు, తన భార్యతో ఏమైనా అక్రమ సంబందం పెట్టుకున్నాడా ? అంటూ పళనివేల్ కు అనుమానం మొదలైయ్యింది.

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య, ఫ్రెండ్
చాలాకాలం పళనివేల్ అతని భార్య మీద, ఫ్రెండ్ దినేష్ మీద నిఘా వేశాడు. ఇటీవల పట్టపగలు బెడ్ రూమ్ లో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో దినేష్ ప్రియురాలి భర్త పళనివేల్ కు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు. ఇంకోసారి ఇలా చూస్తే ఇద్దరిని నడిరోడ్డులో నిబెట్టి నరికేస్తానని పళనివేల్ అతని భార్యకు, స్నేహితుడు దినేష్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తరువాత పళనివేల్, దినేష్ వర్గాలు మద్య గొడవలు జరిగాయి.

నీ భార్యను నువ్వు కంట్రోల్ లో పెట్టుకో !
తమ్ముడు దినేష్ వ్యవహారం విషయంలో సతీష్ ఇంతకుముందు పళనివేల్ తో గొడవపడ్డాడు. నీ భార్యను నువ్వు కంట్రోల్ లో పెట్టుకో, ఇంకోసారి నా తమ్ముడి జోలికి వస్తే నిన్ను చంపేస్తానని బెదిరించాడు. రాత్రి సతీష్ శ్రీనివాసపురంలో నిలబడి స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పళనివేల్, అతని భార్య తమ్ముడు మాధవన్ బైక్ లో అటువైపు వెళ్లారు. ఆ సమయంలో సతీష్ తో గొడవ పెట్టుకున్న పళనివేల్, అతని బావమరిది మాధవన్ కత్తులు తీసుకుని అతన్ని చంపేసి అక్కడి నుంచి పరారైనారు.

తమ్ముడి దెబ్బకు అన్న బలి
హత్యకు గురైన సతీష్ బంధువులు ఆందోళనకు దిగనడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సతీష్ ను హత్య చేసింది పళనివేల్, అతని బంధువులే అని సతీష్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. హంతకులను అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చినా సతీష్ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గలేదు. తరువాత సతీష్ ను హత్య చేసి పారిపోవడానికి ప్రయత్నించిన పళనివేల్, మాధవన్ ను చెక్ పోస్టు దగ్గర అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియుడు అన్న సతీష్ హత్యకు గురి కావడంతో అతని భార్య, ముగ్గురు పిల్లలు రోడ్డునపడ్డారు.

ప్రియురాలు, ప్రియుడు బాగానే ఉన్నారు.... మధ్యలో ?
సతీష్ హత్య కేసుతో పళనివేల్, మాధవన్ కాకుండా ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద ప్రియురాలితో ఎంజాయ్ చేసిన దినేష్, భర్త పళనివేల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసిన అతని భార్య ప్రస్తుతం బాగనే ఉన్నారు. అయితే భార్య కోసం హత్య చేసిన భర్త, తమ్ముడి గొడవలో మధ్యలో దూరిన అన్న హత్యకు గురికావడంతో రెండు కుటంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి.