వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టడానికి ఏళ్లు పట్టింది.. కూల్చడానికి అర నిమిషమే.. 20 కోట్ల హోటల్ నేలమట్టం (వీడియో)

|
Google Oneindia TeluguNews

మధప్రదేశ్ : ఆ హోటల్ కట్టడానికి ఏళ్లకు ఏళ్లు పట్టింది. కానీ, కూల్చడానికి మాత్రం అర నిమిషం పట్టింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శాంతి ప్యాలెస్ హోటల్ నేలమట్టమైన విధానం చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. కేవలం 25 సెకన్లలో భారీ భవనం కుప్పకూలడం విస్మయానికి గురిచేస్తుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 కట్టడానికి ఎన్నెళ్లో.. కూల్చడానికి మాత్రం 25 సెకన్లే

కట్టడానికి ఎన్నెళ్లో.. కూల్చడానికి మాత్రం 25 సెకన్లే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మున్సిపల్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే గాకుండా, ఆ స్థలంలో పెద్ద హోటల్ కట్టిన యజమానులకు షాక్ ఇచ్చింది. ఆ భవనం నిర్మించడానికి వారికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదు గానీ.. మున్సిపల్ అధికారులు మాత్రం కేవలం 25 సెకన్లలో దాన్ని నేలమట్టం చేశారు.

ఉజ్జయినిలో చాలా ఫేమస్ అయిన శాంతి ప్యాలెస్ హోటల్‌ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమంగా హోటల్ నిర్మించారనే కారణంగా భారీ భవనాన్ని సెకన్ల వ్యవధిలో కూల్చిపడేశారు. న్యాయస్థానం తీర్పుతో పురపాలక అధికారులు ఆ హోటల్‌ను నేలమట్టం చేసేలా చర్యలు తీసుకున్నారు.

20 కోట్లు.. 100 గదులు.. 25 సెకన్లలో నేలమట్టం

20 కోట్లు.. 100 గదులు.. 25 సెకన్లలో నేలమట్టం

20 కోట్ల రూపాయలతో దాదాపు 100 గదులతో నిర్మితమైన అత్యాధునిక సౌకర్యాల శిఖరాగ్రం శాంతి ప్యాలెస్ హోటల్ కూల్చడం చర్చానీయాంశమైంది. రెసిడెన్షియల్ కాలనీ నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న హోటల్ యజమానులు భారీ భవంతిని కట్టారు. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టులో దాదాపు పదేళ్లుగా కేసు నడిచింది.

ఆ క్రమంలో శాంతి ప్యాలెస్ హోటల్‌ను అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేయాలని ఆదేశించింది న్యాయస్థానం. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఆ స్థలంలో పెద్ద హోటల్ కట్టడమే గాకుండా.. అదే స్థలంలో మరో భవనం నిర్మించడంతో వివాదం కాస్తా కోర్టు మెట్లెక్కింది.

కూల్చివేయాలన్న హైకోర్టు.. సుప్రీంలోనూ చుక్కెదురే..!

కూల్చివేయాలన్న హైకోర్టు.. సుప్రీంలోనూ చుక్కెదురే..!

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ హోటల్ యజమానులు. అయితే సర్వోన్నత న్యాయస్థానంలోనూ వారికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆ యజమానులకు నిరాశే మిగిలింది. న్యాయస్థానం తీర్పును అమలు చేస్తూ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.

భారీ హోటల్ సెకన్ల వ్యవధిలో నేలమట్టం అవుతున్న విషయం స్థానికంగా చర్చానీయాంశమైంది. శాంతి ప్యాలెస్‌ను కూలగొడుతున్నారనే విషయం తెలిసి అది చూసేందుకు భారీగా జనాలు అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాంబులు పెట్టి జాగ్రత్తగా ఆ హోటల్‌ను కూల్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 25 సెకన్లలో ఉన్నది ఉన్నట్లుగా ఆ భవనం నెమ్మదిగా కుప్పకూలిపోయింది.

వామ్మో.. రాస 'మోహన' లీలలు.. గుంటూరు ఫారెస్ట్ అధికారి కేసులో సంచలన నిజాలువామ్మో.. రాస 'మోహన' లీలలు.. గుంటూరు ఫారెస్ట్ అధికారి కేసులో సంచలన నిజాలు

English summary
Hotel Shanti Palace Building in Ujjain town of Madhya Pradesh was blown up by a bomb through a controlled blast on Wednesday. The hotel was demolished on the orders of the high court as it was built on illegal land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X