బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. వేల కోట్ల ఐఎంఎ చీటింగ్ కేసు: దుబై నుంచి వీడియో విడుదల, నన్ను చంపేస్తారు, సీబీఐ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు ఐఎంఎ జ్యెవెలర్స్ వేల కోట్ల రూపాయల చీటింగ్ కేసు వ్యవహారంలో ఆ సంస్థ యజమాని మన్సూర్ ఆలీ ఖాన్ అలియాస్ మన్సూర్ ఖాన్ దుబాయ్ నుంచి ఓ వీడియో విడుదల చేశాడు. ఐఎంఎ సంస్థ నాశనం కావడానికి తన మతానికి చెందిన కొందరు రాజకీయ నాయకులే కారణం అని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని మన్సూర్ ఖాన్ వీడియో విడుదల చేశాడు.

Recommended Video

గెలిచి 24 గంటలు కాలేదు..అప్పుడే ఎంపీ పదవికి రాజీనామానా..?
పాస్ పోర్టు సీజ్

పాస్ పోర్టు సీజ్

తాను జూన్ 14వ తేదీ బెంగళూరు తిరిగి రావలసి ఉందని, అయితే తన పాస్ పోర్టు సీజ్ చెయ్యడంతో రాలేకపోయానని మన్సూర్ ఖాన్ తెలిపాడు. తాను నమ్ముకున్న కొందరు ముస్లీం పెద్దలు, రాజకీయ నాయకులు తన ఐఎంఎ సంస్థ నాశనం కావడానికి కారణం అయ్యారని మన్సూర్ ఖాన్ ఆరోపించాడు.

21 వేల ఫ్యామిలీలు

21 వేల ఫ్యామిలీలు

తాను కచ్చితంగా బెంగళూరు వస్తానని, ఐఎంఎ సంస్థకు చెందిన 21 వేల మంది కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని మన్సూర్ ఖాన్ వివరించాడు. తాను బెంగళూరు వస్తే తన మీద పగ పెంచుకున్న వారు కచ్చితంగా చంపేస్తారని, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని మన్సూర్ ఖాన్ మనవి చేశాడు.

 ఐఏఎస్ కు రూ. 10 కోట్లు

ఐఏఎస్ కు రూ. 10 కోట్లు

ఐఎంఎ చీటింగ్ కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని, విచారణలో తాను ఈ స్థితికి రావడానికి కారణం అయిన అందరి పేర్లు బయటకు వస్తాయని మన్సూర్ ఖాన్ అంటున్నాడు. ఐఎంఎ సంస్థకు అనుకూలంగా ఓ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒక ఐఏఎస్ అధికారికి రూ. 10 కోట్లు ఇచ్చానని మన్సూర్ ఖాన్ ఆరోపించాడు. అయితే ఐఏఎస్ అధికారి పేరు మాత్రం మన్సూర్ ఖాన్ బయటకు చెప్పలేదు.

 జేడీఎస్ ఎమ్మెల్సీ

జేడీఎస్ ఎమ్మెల్సీ

జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కర్ణాటక జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరవణ మీద మన్సూర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై శరవణ మాట్లాడుతూ తనకు మన్సూర్ ఖాన్ కు పరిచయం లేదని, ఒక్కసారి కూడ అతన్ని చూడలేదని అన్నారు. తన మీద లేనిపోని ఆరోపణలు చేసిన మన్సూర్ ఆలీ ఖాన్ ఎందుకు అలా చేశాడో తెలీదని శరవణ అంటున్నారు.

మొబైల్ నెంబర్

మొబైల్ నెంబర్

తన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు తాను ఎవ్వరికి మోసం చెయ్యనని మన్సూర్ ఖాన్ అంటున్నాడు. తన మొబైల్ నెంబర్ 99021 29090లో అందుబాటులో ఉన్నానని, భాదితులు ఆ నెంబర్ కు ఎస్ఎంఎస్ చేసి సంప్రధించాలని మన్సూర్ ఖాన్ మనవి చేశాడు.

 రూ. 4 వేల కోట్లు చీటింగ్ !

రూ. 4 వేల కోట్లు చీటింగ్ !

తాను రూ. 4 వేల కోట్లు చీటింగ్ చేశానని ఆరోపణలు వస్తున్నాయని, అన్ని వేల కోట్లు తాను మోసం చెయ్యలేదని మన్సూర్ ఖాన్ అంటున్నాడు. తన దగ్గర రూ. 1, 300 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తప్పకుండా అందరికీ న్యాయం చేస్తానని మన్సూర్ ఖాన్ అంటున్నాడు. దుబై నుంచి మన్సూర్ ఖాన్ 15 నిమిషాల వీడియో విడుదల చెయ్యడంతో దానిని పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.

English summary
IMA jewellers owner Mansoor Ali Khan video released from Dubai on Sunday. He told politicians and businessmen names. Here is the details of the story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X