వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. వేల కోట్ల స్కాం, సీబీఐ చార్జ్ షీట్ లో ఐఏఎస్, అధికారుల పేర్లు మాయం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఐఎంఏ జ్యూవెలర్స్ చీటింగ్ కేసును కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఐఎంఏ స్కాం కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. రాష్ట్రపతి, కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో అధికారుల పేర్లు చార్జ్ షీట్ లో నమోదు కాలేదని సమాచారం.

బీజేపీ లీడర్ దారుణ హత్య, చిక్కుల్లో మాజీ మంత్రి వినయ్, సీబీఐ ఎంట్రీతో !బీజేపీ లీడర్ దారుణ హత్య, చిక్కుల్లో మాజీ మంత్రి వినయ్, సీబీఐ ఎంట్రీతో !

ఐఎంఏ స్కాం కేసులో అరెస్టు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన నలుగురు అధికారుల పేర్లు చార్జ్ షీట్ లో లేకపోవడంతో మరోసారి చర్చకు దారితీసింది. బెంగళూరు గ్రామీణ జిల్లాధికారి విజయ్ శంకర్, ఎస్.ఎల్.సి. నాగరాజ్, బీడీఏ ఇంజనీర్ పి.డి. కుమార్, గ్రామలెక్కాధికారి మంజునాథ్ పేర్లు సీబీఐ సమర్పించిన చార్జ్ షీట్ లో లేవు.

IMA scam 4 name missing in CBI charge sheet in Karnataka

ఈ నలుగురు అధికారుల పేర్లు చార్జ్ షీట్ లో నమోదు కావాలంటే కేంద్ర, కార్ణాటక ప్రభుత్వం అనుమతి కావాలి. సీబీఐ అధికారులు ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోలేదు. అందుకే సీబీఐ అధికారులు ఐఎంఏ స్కాం కేసులో ఈ నలుగురు అధికారుల పేర్లు నమోదు చెయ్యలేదని సమాచారం.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

విజయ్ శంకర్ ఐఏఎస్ అధికారి. విజయ్ శంకర్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చాలంటే రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్ సీ అనుమతి తీసుకోవాలి. సీబీఐ అధికారులకు ఇక్కడి నుంచి ఇంకా అనుమతి రాలేదు. మిగిలిన ముగ్గురు అధికారులు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు.

కర్ణాటక ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో చార్జ్ షీట్ లో ఈ ముగ్గురు అధికారుల పేర్లు ఇంకా చేర్చలేదు. ఐఎంఏ స్కాం కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు చాల మందిని విచారణ చేశారు. 25 మంది పేర్లు సీబీఐ అధికారులు చార్జ్ షీట్ లో నమోదు చేసి ఆ నివేదిక కోర్టుకు సమర్పించారు.

English summary
Bengalugu: CBI files charge sheet in IMA scam. 4 government officials name in FIR not registered in Charge Sheet. CBI probing multi crore IMA scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X