• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: పతంజలి రాందేవ్ దేశద్రోహం -వ్యాక్సిన్‌ వల్ల 10వేల డాక్టర్లు పోయారంటూ -ప్రధాని మోదీకి ఐఎంఏ ఫిర్యాదు

|

పొద్దస్తమానం దేశీ స్వదేశీ అని కలవరించే యోగా గురు రాందేవ్ బాబా కేవలం తన పతంజలి ఉత్పత్తుల వ్యాపారం కోసం తల్లి లాంటి దేశానికే ద్రోహం తలపెట్టారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సంచలన ఆరోపణ చేసింది. రాందేవ్ దేశ ద్రోహానికి పాల్పడ్డారనడానికి పక్కాగా ఆధారాలున్నాయని, ఆయనపై వెంటనే రాజద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఐఎంఏ అభ్యర్థించింది. దీంతో నాలుగు రోజులుగా రాందేవ్-అల్లోపతి -ఐఎంఏ-కేంద్రం మధ్య కొనసాగుతోన్న వివాదం అనూహ్య మలుపు తిరిగినట్లయింది. వివరాలివి..

 పతంజలి రాందేవ్‌పై పరువు నష్టం దావా -రూ.1000కోట్లకు ఐఎంఏ నోటీసులు -కేంద్రం హెచ్చరించినా తగ్గని యోగా గురు పతంజలి రాందేవ్‌పై పరువు నష్టం దావా -రూ.1000కోట్లకు ఐఎంఏ నోటీసులు -కేంద్రం హెచ్చరించినా తగ్గని యోగా గురు

వ్యాక్సిన్లపై రాందేవ్ విషం

వ్యాక్సిన్లపై రాందేవ్ విషం

‘‘గౌరవనీయులైన ప్రధని మోదీగారు.. కరోనా విలయకాలంలో దేశ ప్రజలను కాపాడేందుకు మీరు చేస్తోన్న కృషిలో మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అందరం భాగం పంచుకోవడం బాధ్యతగా ఫీలవుతున్నాం. మహమ్మారిపై పోరాటంలో అతికీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియపై మీరు(కేంద్రం) ఇచ్చే పిలుపునకు ప్రజలు స్పందిస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైనది, అసలు అల్లోపతి వైద్యమే తప్పుడు విధానమని పతంజలి సంస్థకు చెందిన బాబా రాందేవ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా 10 వేల మంది డాక్టర్లు చనిపోయారని, లక్షలాది మంది సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారని రాందేవ్ ద్వారా ఓ తప్పుడు వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే. సెడిషన్ చట్టం కింద రాందేవ్ ను వెంటనే కట్టడి చేయండి.. '' అంటూ ఐఏంఏ బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాసింది.

కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన-గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి-కొవిడ్ ప్రోటోకాల్స్ సవరణ,కొత్త గైడ్ లైన్స్కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన-గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి-కొవిడ్ ప్రోటోకాల్స్ సవరణ,కొత్త గైడ్ లైన్స్

కరోనిల్ సక్సెస్.. డాక్టర్లకు వణుకు

కరోనిల్ సక్సెస్.. డాక్టర్లకు వణుకు

డాక్టర్ల అసోసియేషన్ ఐఎంఏకు, యోగా గురు రాందేవ్ బాబాకు మధ్య గడిచిన నాలుగు రోజులుగా వివాదం కొనసాగుతున్నది. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ జోక్యం చేసుకుని హెచ్చరించిన తర్వాత కూడా రాందేవ్, పతంజలిలు వెనక్కి తగ్గలేదు. దీంతో ఐఎంఏ ఇప్పుడు నేరుగా ప్రధానిని ఆశ్రయించింది. ఐఎంఏపై పతంజలి చీఫ్ బాలకృష్ణన్ ఎదురుదాడి చేశారు. పతంజలి ఆయుర్వేద్ అభివృద్ధి చేసిన యాంటీ కోవిడ్ కిట్ అద్భుతమైన విజయం సాధించడంతో అల్లోపతి డాక్టర్లు తలక్రిందులయ్యారని, రాందేవ్ వ్యాఖ్యలను ఐఎంఏ, అల్లోపతి డాక్టర్లు రాద్ధాంతం చేయడానికి కారణం ఇదేనని బాలకృష్ణన్ అన్నారు. యావత్తు దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగానే యోగాను, ఆయుర్వేదాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

  Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu
  అల్లోపతి వర్సెస్ పతంజలి..

  అల్లోపతి వర్సెస్ పతంజలి..

  కరోనాకు అల్లోపతి పనికిరాదని, పనికిమాలిన ఆ వైద్య విధానం వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని రాందేవ్ వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. దానిపై అభ్యంతరం చెబుతూ కేంద్ర ఆరోగ్య మంత్రికి ఐఎంఏ ఫిర్యాదు చేయగా రాందేవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. అంతలోనే అల్లోపతికి 25 ప్రశ్నలంటూ మళ్లీ రచ్చకు దిగారు. ఇప్పుడేమో వ్యాక్సిన్ల వల్ల డాక్టర్లు చనిపోతున్నారంటూ రాందేవ్ పేరిట వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం రాందేవ్ బాబాకు బుధవారం పరువునష్టం దావా నోటీసులు పంపింది. అల్లోపతి మందుల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. నోటీసులు పంపిన గంటల వ్యవధిలోనే ఐఎంఏ కేంద్ర సంఘం నేరుగా ప్రధాని మోదీకి రాందేవ్ పై ఫిర్యాదు లేఖ రాసింది. ప్రధాని మోదీకి, బీజేపీకి అత్యంత ఇష్టుడైన రాందేవ్ పై చర్యలు ఉంటాయా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

  English summary
  The Indian Medical Association (IMA) on Wednesday urged Prime Minister Narendra Modi to take "action under the sedition charges” against Ramdev over his statements questioning the efficacy of allopathy medicines and doctors and to stop the "misinformation campaign on vaccination” against the coronavirus disease (Covid-19) by the yoga guru.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X