బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక ఎన్నికలకు వర్షాల దెబ్బ, పిడుగులు, నేడు 12 జిల్లాలో కురిసిన వర్షం, బెంగళూరులో!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వాతావరణ హెచ్చరిక : భారీ వర్షాలు పడే సూచన

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు 2018 పోలింగ్ కు వర్షాలు సమస్యగా తయారు అయ్యే అవకాశం ఉంది. మే 12వ తేదీ ఓటు వెయ్యడానికి బయటకు వెళ్లే వారు వర్షం దెబ్బకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మే 14వ తేదీ వరకూ కర్ణాటకలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందు జాగ్రత్తగా హెచ్చరించింది. నేడు 12 జిల్లాలో వర్షం కురిసింది.

బెంగళూరుకు వర్షం దెబ్బ

బెంగళూరుకు వర్షం దెబ్బ

బెంగళూరు నగరంతో పాటు దక్షిణ కన్నడ జిల్లా, కోస్తా కర్ణాటక ప్రాంతాలు, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో మే 14వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్ర తీరాలు, బీచ్ ల దగ్గరకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

పిడుగులతో వర్షాలు

పిడుగులతో వర్షాలు

కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మే 10, 12, 14 తేదీలు భారీగా గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో పిడుగులు పడి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీగా వర్షాలు పడిన సమయంలో విద్యుత్ స్థంభాలు, చెట్ల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

 తమిళనాడు దెబ్బ

తమిళనాడు దెబ్బ

లక్షద్వీప్, తమిళనాడు తీర ప్రాంతాల్లోని సముద్రంలో సుడిగాళులు ఎర్పాడ్డాయని, ఆ కారణంగా దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మే 12వ తేదీ పోలింగ్ రోజు జాగ్రత్తగా వెళ్లి ప్రజలు ఓటు వెయ్యాలని అధికారులు మనవి చేశారు.

నేడు కర్ణాటకలో వర్షాలు

నేడు కర్ణాటకలో వర్షాలు

మే 10వ తేదీ బుధవారం ఉదయం నుంచి నుంచి కొడుగు, శివమొగ్గ, దక్షిణ కన్నడ జిల్లా, హాసన్, చిక్కమగళూరు, దావణగెరె. మైసూరు జిల్లాల్లో 35 మి.మీ నుంచి 124 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఉడిపి, చామరాజనగర, రామనగర, మండ్య, కోలారు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యింది.

English summary
Indian Meteorological Department has forecasted that consolidated trough in Tamil Nadu will bring rain in south Karnataka up to May 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X