వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు, రైళ్లు, విద్యాసంస్థలు, వాటర్ ఫాల్స్ బంద్, వరదలు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/కొచ్చి: తమిళనాడు, కేరళలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వరదలు వచ్చే అవకాశం చాల ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 48 గంటల్లో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్బంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కోస్తా ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రైళ్లు, విద్యాసంస్థలు, వాటర్స్ ఫాల్స్ బంద్ చేశారు.

తుత్తుకుడి జలదిగ్బంధం

తుత్తుకుడి జలదిగ్బంధం

తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలో భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయ్యింది. సముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగా తమిళనాడు, కేరళ అతలాకుతలం అవుతోంది. తుత్తుకుడి జిల్లాలో బుధవారం అన్ని విధ్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

నిలిచిపోయిన రైళ్లు

నిలిచిపోయిన రైళ్లు

దక్షిణ తమిళనాడులో భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. దక్షిణ తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాకులు వరదనీటిలో మునిగిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా ముత్తునగర్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసు పూర్తిగా రద్దు చేశారు.

వాటర్ ఫాల్స్ బంద్

వాటర్ ఫాల్స్ బంద్

తమిళనాడులోని ప్రసిద్ది చెందిన కుత్రాలమ్ వాటర్ ఫాల్స్ తో సహ ఐదు ప్రసిద్ది చెందిన వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకులు స్నానాలు చెయ్యడాన్ని పూర్తిగా నిషేధించారు. వాటర్ ఫాల్స్ వెళ్లే గేట్లు అన్ని మూసివేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కేరళ సీఎం వార్నింగ్

కేరళ సీఎం వార్నింగ్

భారీ వర్షాల కారణంగా సముంద్రంలో చేపలు పట్టడానికి మత్స్యకారులు ఎవ్వరూ వెళ్లకూడదని, సుముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మనవి చేశారు. సముద్ర తీరప్రాంతాల్లోని జిల్లా అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం పినరయి విజయన్ సూచించారు.

ఓఖీ తుపాను అనుభవం

ఓఖీ తుపాను అనుభవం

2017 నంవబర్ చివరి వారంలో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లను ఓఖీ తుపాను అతలాకుతలం చేసింది. ఓఖీ తుపాను కారణంగా అనేక మంది మత్స్యకారులు జలసమాధి అయ్యారు. ఓఖీ తుపాను అనుభవంతో తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి.

English summary
Due to low depression heavy rain hits in Southern parts of TN, tracks are filled with rain water, so MuthuNagar Express train stops near the Railway Station. Heavy Rain hits in the Southern areas of Tamilnadu,this results water flow in Kutralam water hills. THe district administration bans to take bath in Kutralam main falls and five falls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X