వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరీనా బీచ్ పరిసరాల్లో 144 సెక్షన్,ముందుజాగ్రత్త కోసమేనా

మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి 12వ, తేది వరకు 144 సెక్షన్ ను అమలుచేశారు. ముందుజాగ్రత్తగానే పోలీసులు ఈ సెక్షన్ ను అమలు చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:చెన్నైలోని మెరీనా బీచ్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 12వ, తేది వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

జల్లికట్టుపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని కోరుతూ మెరీనాబీచ్ వేదికగా తమిళనాడు యువత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యువత చేపట్టిన ఆందోళనకు రాజకీయపార్టీలు కూడ మద్దతు ప్రకటించారు

జల్లికట్టు పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ యువత చేపట్టిన ఆందోళనకు పాలకులు దిగిరావాల్సిన పరిస్థితి నెలకొంది.

తమిళనాడు యువతను ఇతర రాష్ట్రాలు కూడ తీసుకోనే ప్రయత్నం చేశారు.కర్ణాటక, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో యువత ఆందోళనకు తమిళనాడులోని మేరీనాబీచ్ వేదికగా సాగిన ఆందోలన స్పూర్తిగా నిలిచింది.

మెరీనా బీచ్ లో 144 సెక్షన్

మెరీనా బీచ్ లో 144 సెక్షన్

వచ్చే నెల 12వ, తేది వరకు మెరీనాబీచ్ లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇది ఫిబ్రవరి 12వ, తేది వరకు కొనసాగనుంది.మెరీనా బీచ్ ను వేదికగా చేసుకొని తమిళనాడు యువత ఆందోళన సాగించింది.ఈ ఆందోళనలతో శాసనభలో ముసాయిదా బిల్లును ఆమోదించింది తమిళనాడు శాసనసభ.దీంతో ఉద్యమకారులు మెరీనాబీచ్ ను ఖాళీ చేశారు. అయితే మెరీనాబీచ్ లో 144 సెక్షన్ ను విధిస్తూ తమిళనాడు పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు.వచ్చే నెల 12వ, తేది వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు.

ముందు జాగ్రత్తగానే 144 సెక్షన్

ముందు జాగ్రత్తగానే 144 సెక్షన్

మెరీనా బీచ్ లో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. శనివారం నాడు మెరీనా బీచ్ లో బారీగా పోలీసులను మోహరించారు. ఈ బీచ్ వేదికగా ఆందోళనలు సాగుతాయనే సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు. మరో వైపు ఆందోళనకు బ్రేక్ వేయాలనే ఉద్దేశ్యంతోనే బీచ్ వేదికగా 144 సెక్షన్ ను అమలుచేశారు.

సందర్శకులకు మినహయింపు

సందర్శకులకు మినహయింపు

మెరీనా బీచ్ లో 144 సెక్షన్ విధించినా కొన్ని మినహయింపులను ప్రకటించారు పోలీసులు. మెరీనాబీచ్ కు ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ కు వచ్చేవారికి 144 సెక్షన్ మినహయింపుఇచ్చారు. బీచ్ ను చూసేందుకు వచ్చే సందర్శకులకు, కుటుంబ సమేతంగా వచ్చేవారికి ఎలాంటి ఆంక్షలు ఉండవని పోలీసులు చెప్పారు.

నిర్మానుష్యంగా మెరీనాబీచ్

నిర్మానుష్యంగా మెరీనాబీచ్

మెరీనాబీచ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను మలు చేయడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్కంగా మారింది. సాధారణంగా ఈ ప్రాంతమంతా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.అయితే 144 సెక్షన్ కారణంగా ఈ ప్రాంతమంతా జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారింది. ఆందోళనలు కొనసాగుతాయనే అనుమానంతో పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేశారు.

English summary
The Chennai police on Saturday declared that Section 144 will be imposed at marina beach and surrounding localities starting January 29 and will be in effect until February 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X